8, అక్టోబర్ 2010, శుక్రవారం

మహాత్ములు - మన అభిప్రాయాలు


స్వాతంత్ర్యోద్యమాన్ని అహింసాయుతంగా మలచి దేశ ప్రజలందరినీ దాదాపుగా ఒకేతాటిపై నడిపించిన గాంధీ "మహాత్ముడే". స్వాతంత్ర్యపోరాటంలో ఒక్కసారి కూడా అరెస్టు కాబడని అంబేద్కర్, దళితజనుల కోసం చేసిన పోరాటానికి "భారతరత్నే." మనం చదువుకున్న పాఠ్యాంశాల ఆధారంగా మనం అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. దురదృష్టవశాత్తు, కాంగ్రెస్ కమ్యూనిస్టు మేధావులు దేశచరిత్రను ఉన్నదున్నట్లుగా ఏనాడు చెప్పలేదు. వారు వక్రీకరించిన చరిత్రే చదివి మన మన అభిప్రాయాలు ఏర్పరచుకుంటున్నాం.

గాంధీని చంపిన హంతకుడుగా మాత్రమే గాడ్సే పరిచయం మనకు మన పాఠాల్లో ఇవ్వబడింది. ఒక హంతకుడుగా ముద్రపడిన ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మనకెవ్వరికీ అందుబాటులో లేదు. కాబట్టే, మన దృష్టిలో అతనో దుర్మార్గుడు! ఒక్క గాడ్సే అని కాదు... చరిత్రలో తొంగిచూస్తే మరుగున ఉన్న మహానుభావులు చాలామందే ఉంటారు.

గాడ్సె ప్రత్యక్షంగా గాంధీని హత్య చేసాడు, కాబట్టి నేరస్తుడే. ముస్లీములు పాకిస్తాన్ గా విడిపోయిన తర్వాత, ఆ పాకిస్తాన్ కు ఆర్ధిక సహాయం చేయాలని నిరాహార దీక్ష చేసిన బాపూజీ - భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల ఉరిశిక్షను ఆపివేయటానికి ఎటువంటి దీక్షలు ఎందుకు చేయలేదు? వారి మరణానికి పరోక్షంగా కారకుడైన గాంధీ, గాడ్సే కన్నా ఎలా గొప్పవాడు?

హిందు మతోన్మాదిగా భావించబడే గాడ్సే చేతుల్లో హత్య గావించబడ్డ గాంధీకి, సిక్కు సైనికుని చేతుల్లో హత్య చేయబడ్డ ఇందిరాగాంధీకి, తమిళ టైగర్సు చేతుల్లో చంపబడ్డ రాజీవ్ గాంధీకీ తేడా ఏమీ లేదు. వారు చేసిన రాజకీయాలకు వాళ్ళు బలయ్యారు కానీ, త్యాగం ఏమాత్రమూ కాదు.

మనం నేర్చుకున్న చరిత్ర పాఠాలు, ఎవరి త్యాగం ఏమాత్రమనేది తులనాత్మకంగా చెప్పదు. చెప్పలేదు కూడా. వారి పోరాట పంథాలో స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల త్యాగాలు, గాంధీ నెహ్రూల త్యాగాల కన్నా భిన్నమా? అహింసాయుత పోరాటంలో కూడా అసువులు బాసిన వేలాది ప్రజల త్యాగం గాంధీ నెహ్రూల త్యాగం కన్నా తక్కువా?

రెండు మూడేళ్ళ క్రితం అప్పటి కేంద్ర మంత్రిగా పనిచేసిన మణిశంకర్ అయ్యర్ అండమాన్ లోని సెల్యులర్ జైలుకు వెళ్ళటం తటస్థించింది. అక్కడి జైలులో వీర్ సావర్కర్ చిత్రపటం చూసి అగ్గి మీద గుగ్గిలం అయ్యి, తన చేతులతో తీసి అవతల పారేసాడు (లిటరల్ గా). జీవితంలో ముఖ్యమైన సమయాన్ని - దాదాపు ఇరవై సంవత్సరాలు పైగా ఆ జైలులో గడిపిన స్వాతంత్ర్య సమరయోధుడి త్యాగం గాంధీ నెహ్రూల త్యాగానికి తీసిపోయిందనా వాడు ఆ పటాన్ని తీసి పారేసాడు? సావర్కర్ తో పోలిస్తే, గాంధీ నెహ్రూలు తమ పోరాటంలో భాగంగా ఎంతకాలం జైలు జీవితం గడిపారు?

ఇవి కేవలం అభిప్రాయ బేధాలుగా మాత్రమే పరిగణించి కొట్టేస్తాం. మన దేశం, మన స్వాతంత్ర్యం కొందరి పోరాటఫలమనే చరిత్ర పాఠాలు చదివిన తర్వాత అవి అభిప్రాయ బేధాలుగా మాత్రమే కనిపిస్తాయి కానీ, నిజాలు మాత్రం కావు. కేవలం హిందువులు, హిందు మతాభిమానులనే కారణంతో, ఎన్నెన్నో త్యాగాలు చేసిన చాలామంది యోధులు మన చరిత్రపుటల్లో కనీస మాత్రంగానైనా ప్రస్తావించబడకపోవటం ఈ కాంగ్రెస్, కమ్యూనిస్టు చరిత్రకారుల కుట్రలలో భాగమే.

కాబట్టి చరిత్ర పేరుతో వీళ్ళు మన కళ్ళకు కట్టిన గంతలు తొలగించి నిష్పక్షపాతంగా వారివారి చరిత్రలు తెలుసుకొని అభిప్రాయాలు ఏర్పరచుకోవాలి. కోర్టులో నాధూరాం గాడ్సె ఇచ్చిన చివరి ఉపన్యాసం ఈక్రింది లింకులో చదవండి.

10 కామెంట్‌లు:

  1. కేవలం హిందువులు, హిందు మతాభిమానులనే కారణంతో, ఎన్నెన్నో త్యాగాలు చేసిన చాలామంది యోధులు మన చరిత్రపుటల్లో కనీస మాత్రంగానైనా ప్రస్తావించబడకపోవటం ఈ కాంగ్రెస్, కమ్యూనిస్టు చరిత్రకారుల కుట్రలలో భాగమే.
    __________________________________________________

    Well said - mainly the leftists.

    రిప్లయితొలగించండి
  2. "వారు చేసిన రాజకీయాలకు వాళ్ళు బలయ్యారు కానీ, త్యాగం ఏమాత్రమూ కాదు"; Well said sir...!!! True true true.....!!

    రిప్లయితొలగించండి
  3. It is worth putting the whole text of Nathuram Godse's final speech here itself. However, few paragraphs will enlighten us surely about the motives of Godse.

    * * *

    Briefly speaking, I thought to myself and foresaw I shall be totally ruined, and the only thing I could expect from the people would be nothing but hatred and that I shall have lost all my honour, even more valuable than my life, if I were to kill Gandhiji. But at the same time I felt that the Indian politics in the absence of Gandhiji would surely be proved practical, able to retaliate, and would be powerful with armed forces. No doubt, my own future would be totally ruined, but the nation would be saved from the inroads of Pakistan. people may even call me and dub me as devoid of any sense or foolish, but the nation would be free to follow the course founded on the reason which I consider to be necessary for sound nation-building.

    I have to say with great regret that Prime Minister Nehru quite forgets that his preachings and deeds are at times at variances with each other when he talks about India as a secular state in season and out of season, because it is significant to note that Nehru has played a leading role in the establishment of the theocratic state of Pakistan, and his job was made easier by Gandhi's persistent policy of appeasement towards the Muslims.

    I now stand before the court to accept the full share of my responsibility for what I have done and the judge would, of course, pass against me such orders of sentence as may be considered proper. But I would like to add that I do not desire any mercy to be shown to me, nor do I wish that anyone else should beg for mercy on my behalf. My confidence about the moral side of my action has not been shaken even by the criticism levelled against it on all sides. I have no doubt that honest writers of history will weigh my act and find the true value thereof some day in future.

    * * *

    How truthful he was to himself!

    రిప్లయితొలగించండి
  4. Nice post. ఇప్పుడు చదివే పిల్లలకు ఈ విషయాలు ఏమి తెలీవు. ఉన్న చరిత్రని ఎవరికి వారు అనుకూలంగా మార్చేసుకొంటున్నారు. నిజమెలా తెలుస్తుంది.

    రిప్లయితొలగించండి
  5. చాలా బాగా వ్రాసారు
    నేను కూడా అప్పట్లో ఒక పోస్ట్ వ్రాసాను గాడ్సే మీద
    http://anvvapparao.blogspot.com/2009/10/blog-post_31.html

    http://anvvapparao.blogspot.com/search/label/%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80

    రిప్లయితొలగించండి
  6. హైస్కూల్ కూడా సదవకున్నా స్పీచీ ఇంగ్లీసులో సక్కగ రాసిండు, గాడ్సే. నా సెవుల్లో గోబి పూవులు కనిపిస్తున్నాయా.

    రిప్లయితొలగించండి
  7. >>>స్వాతంత్ర్యపోరాటంలో ఒక్కసారి కూడా అరెస్టు కాబడని అంబేద్కర్, దళితజనుల కోసం చేసిన పోరాటానికి "భారతరత్నే." మనం చదువుకున్న పాఠ్యాంశాల ఆధారంగా మనం అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం.

    అంబేద్కర్ పేరు లేకుండా పోస్ట్ లు వ్రాయటం చేతకాదేం, పుస్తకాలలో యిచ్చినవి ఎంతో రీసెర్చ్ చేసి చెప్పబడినవి ..అంతేకాని మిడిమిడి జ్ఞానం తో చెప్పినవి కావు. ప్రతి మనిషిలో మంచి చెడు అనే రెండు కోణాలు వుంటాయి. అలానే గాంధీ గారు / గాడ్సే గారులో కూడా. మంచి ఎక్కువ పాళ్ళు ఉండబట్టే గాంధీ మహాత్ముడయ్యారు. ఎందరో ప్రముఖులు ఆయన్ని కలిశారు వారిలో శ్రీ యోగానంద పరమహంస గారు, స్వామి రామ వంటి వారు ఉన్నారు. ఎవరి అభిప్రాయాలు వారి కుంటాయి. ఇది మీ అభిప్రాయం అంతే... అంతేకాని చిన్నప్పుడు చదివినవన్నీ తప్పు అనదం సరికాదు.

    రిప్లయితొలగించండి
  8. /కొండముది సాయికిరణ్ కుమార్ said...
    సుజాత గారు మీ ప్రయత్నం అభినందనీయం. ఒక్క రాజీవ్ గాంధీ అనేముంది, మహాత్మా గాంధీ తప్పించి, ఏ ఇతరగాంధీ గానీ, ఏ ఇతరవ్యక్తుల పేర్లు మన మీద రుద్దకూడదు.

    October 27, 2010 8:41 AM /

    గాడ్సే గారి పేరు కూడా వద్దా?!
    గాంధీ కన్నా గాడ్సే, అంబేత్కర్ లు గొప్పన్నారు. మరి గాడ్సే, అంబేత్కర్లలో ఎవరు గొప్ప?

    రిప్లయితొలగించండి