పంచవటిలో సభ్యుడైన ఓ అనామక బ్లాగరు అంబేద్కర్ ను వదిలి ఆధ్యాత్మిక విషయాలపై వ్రాయమని చాలా కాలం నుంచి సూటిపోటి వ్యాఖ్యలతో బతిమాలుతున్నారు. సరే, ఆయన బతిమాలుతున్నారని కాకపోయినా, అన్నగారి (సత్యనారాయణ శర్మగారి) ఆలోచనా తరంగాలలో "తంత్రంలో షట్కర్మల ప్రాధాన్యత" అనే వ్యాసం నాకో అవకాశం ఇచ్చింది. ఆ వ్యాసంలో, మన తంత్రాలలో కామ్యసాధనకు సంబంధించి ఇవ్వబడిన ఆరు విధానాలను అన్నగారు ప్రస్తావించారు. మోహన, వశీకరణ, స్తంభన, ఉచ్ఛాటన, విద్వేషణ మరియు మారణ క్రియలకు సంబంధించిన వ్యవహారం ఇది.
ఆసక్తి కలిగించే కొన్ని వ్యాఖ్యలకు నాకు తెలిసిన వివరణ ఇవ్వాలనే ప్రయత్నంతో వ్రాస్తున్న వ్యాసం ఇది. ముందుగా, మలక్ లేవనెత్తిన అంశం. ఈ వ్యాసం నచ్చలేదని, ఇవి మూఢనమ్మకాలని, దయ్యాలు భూతాల మీద తనకు నమ్మకం లేదని మలక్ అన్నారు.
అసలు విషయం ఏమిటంటే, ఈ వ్యాసంలో ఎక్కడా శర్మ గారు దయ్యాలు, భూతాల ప్రస్తావన తీసుకురాలేదు. ఆయన సంగతేమో కానీ, దేవుడు ఉన్నాడు అని నేను నమ్ముతాను కాబట్టి, దయ్యాలు కూడా ఉన్నాయని నేను నమ్ముతాను. ఇది ప్రస్తుత వివరణకు సంబంధించి అనవసరమైన విషయం కాబట్టి, పక్కన పెడతాను.
మనకు ఉన్న దేవతలందరూ మంత్రబద్ధులు. ఉన్న ప్రతి దేవతకు ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్ర సాధన చేసి, సిద్ధిని పొందినవాడికి ఆ దేవత కామ్యసిద్ధి కలిగిస్తుంది. మంత్ర సిద్ధిని పొందినవాడు భక్త మార్కండేయుడు కావచ్చు, లేదంటే భస్మాసురుడు కావచ్చు. భస్మాసురుడు, రావణుడు, హిరణ్యకశిపుడు దుర్మార్గులని తెలిసినా, బ్రహ్మ వరాలు ఎందుకు ఇచ్చాడంటారు? వాళ్ళు ఆయా మంత్ర సిద్ధిని పొందారు కాబట్టి, అవి ఇవ్వక తప్పని పరిస్థితి.
మీ సంతోషం గారు మరో విషయం లేవనెత్తారు. మన సంస్కృతికి సంబంధించి తంత్ర సాధన అనవసరం. కాబట్టి, విష్ణు సహస్రనామాలో, లలితా సహస్రనామాలో చేసుకోవచ్చు కదా అని ఓ ఉచిత సలహా పారేసారు.
ఎవరికి ఏ సాధన అవసరం అని నేను మీరు నిశ్చయించలేం కదా! ఎవరి సుకృతాన్ని బట్టి వారికి ఆయా అవకాశాలు వస్తాయి. బహుశా, ఈయన ఉద్దేశ్యంలో ఇలా ప్రయోగాలు చేసి మారణ క్రియలు జరిపే తంత్రం అవసరమా అని కూడా అయ్యుండవచ్చు. ఆమాటకొస్తే, వేదమంత్రాలతో కూడా మారణ ప్రయోగాలు చేయవచ్చు. రామాయణ, భారతాలు చదువుకున్నాం. యుద్ధాలలో బ్రహ్మాస్త్రాలు, నారాయణాస్త్రాలు, ఆగ్నేయాస్త్రాలు వాడేవారని కూడా చదివాము, శరత్కాలంగారు వర్ణించే టైపులో బాణాలు వేసుకోవటం కూడా సినిమాలలో చూసాం. అక్కడ అర్జునుడు ఆగ్నేయాస్త్రం వేసినప్పుడు, వేయబడిన బాణం కర్ర ముక్క, ఇనుప ముక్కా అన్నది ముఖ్యమైన విషయం కాదు. బాణం బదులుగా ఓ గడ్డిపరక అభిమంత్రించి వేసినా అది ప్రయోగమే అవుతుంది. ఉదాహరణకు, పాండవుల వంశం నశించాలని, అశ్వత్థామ ఓ గరికను అభిమంత్రించి బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగిస్తాడు, మహాభారతంలో.
అందరం భక్తిప్రపత్తులతో స్మరించే గాయత్రీ మంత్రం కూడా, వెనుక నుంచి చదివితే బ్రహ్మాస్త్రమౌతుందని చెబుతారు పెద్దలు. అలానే, ఏ లైనుకాలైను వెనుక నుంచి చదివితే బ్రహ్మదండమని, ఏ పదానికి ఆ పదం వెనుక నుంచి చదివితే బ్రహ్మశిరోనామకాస్త్రమని కూడా చెబుతారు. ఇలా విలోమ పద్ధతిలో చాలా మంత్రాలను ప్రయోగాలుగా వాడుకోవటం గురించి మన తంత్రాలలో విస్తారంగా చెప్పారు.
భస్మాసురుడికి, హిరణ్యకశిపుడికి వారు కోరిన వరాలు ఇచ్చినా, వారివారి దుష్కర్మల ఫలితాన్ని కూడా అనుభవించే విధంగా సృష్టిక్రమం నడుస్తుంది. అందుకనే, అటువంటి ప్రయోగాలు అత్యవసర పరిస్థితుల్లో తప్పించి వాడరాదన్న విషయాన్ని కూడా శర్మ గారు చెప్పారు.
ఈరోజుల్లో, సాధన చేయలేని మన బద్ధకానికి భక్తి అనే ముసుగు తొడిగి, మొక్కుల పేరుతో దేవుడిని ప్రలోభపెట్టి పనులు చేసుకుందామనే బాపతే ఎక్కువ. సాయిబాబా మంత్ర తంత్రాలు ఆచరించలేదని కొందరంటున్నారు. వారిలాగా, అడ్డగోలు వాదనతో దానికి ప్రమాణం చూపమని నేను అడగను. ఆయన సాధన యోగపరమైనది. అష్టాంగయోగాన్ని సాధన చేసేవారనే విషయం ఆయన జీవితచరిత్ర చదివిన ఎవరికైనా అర్ధమౌతుంది.
ఏది ఏమైనా, మంచి తాంత్రిక వివరాలున్న వ్యాసాన్ని చదవాల్సిన రీతిలో చదవలేదని, అర్ధం చేసుకోవాల్సిన రీతిలో అర్ధం చేసుకోలేదని మాత్రం తెలుస్తుంది.