26, జూన్ 2009, శుక్రవారం

ద్వంద్వప్రవృత్తి - అయ్యవారి బెకబెకలు

అలుపొచ్చినా రాకపోయినా, అయ్యవారి బెకబెకలు మాత్రం ఆగవు. ఇప్పుడు ప్రజల (హిందువుల అని చదువుకోండి) ద్వంద్వ ప్రవృత్తి గురించి ఇలా సెలవిచ్చారు.



మతానికి అనుకూలమైన సలహాలూ,ప్రతిపాదనలు ఎంత అనౌచిత్యంగా ఉన్నా మనలో చాలా మంది అంగీకరిస్తాం. కానీ వ్యతిరేకంగా తార్కికంగా ప్రశ్నిస్తే మాత్రం మనోభావాలు గాయపరుచుకుంటాం...ఇంతేగా! ఈ ద్వంద్వప్రవృత్తి ఎందుకు?



ఇంతకి ఆ అనౌచిత్యమైన సలహా ఏమిటంటే, ఎవరో బ్లాగరు ఆస్ట్రేలియాలో జరుగుతున్న అరాచకాన్ని తప్పించుకోటానికి ఆంజనేయస్వామి రక్ష కట్టుకోమని చెప్పారట. నేను వేసే కుప్పిగంతులకు నన్ను తిడతారు, మరి అనౌచిత్యంగాసలహాలిచ్చిన ఈ బ్లాగరును ఎవరూ ఏమీ ఎందుకు అనరు అని భోరుభోరుమని ఏడ్చినంత పని చేసేసారీ అయ్యవారు.



అసలు ద్వంద్వ ప్రమాణాల గురించి ఈ అయ్యవారు వాపోవటమేమిటి ఛండాలంగా? తన ఈ ద్వంద్వ ప్రవృత్తినే ఘనంగా వైరుధ్యమని' చాటుకున్నారుగా.



ఎందుకూ పనికిరాని మంత్రాలని ఏదో వ్యాసంలో వ్రాసారు. వ్రాసినాయన ఊరుకున్నారా, లేదే. ప్రతి మంత్రానికి ఉన్నఅర్ధాన్ని అడుక్కుని మరీ పెళ్ళి చేసుకున్నారట. ఎందుకూ పనికిరాని, అర్ధంపర్ధంలేని మంత్రాలతో పెళ్ళి మాత్రం ఎందుకు చేసుకున్నావురా పుల్లాయ్ అని మొన్నటిదాకా ఎవరైనా ప్రశ్నించారా అయ్యవారిని?



వేదాలు లేవు, రామాయణ భాగవత భారతాది పురాణేతిహాసాలు అన్నీ కాల్పనిక మన్నారు. మరి వాదనకు అనుకూలించిందని, అదే భారతంలోని భగవద్గీత శ్లోకాలు వాడుకొని కుల ప్రస్తావన ఎందుకు చేసావోయ్ పుల్లాయ్ అని మొన్నటిదాకా ఎవరైనా అడిగారా అయ్యవారిని?



కులమతాల పట్టింపులు లేవన్నారు. నేనో మానవతావాదిని అని చెప్పుకున్నారు. తమరి ఐ.డి.తో మోసపూరితంగావ్యవహరించారని తమరు చెప్పినవారి మీద కేసు పెట్టటానికి మాత్రం 'ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ' యాక్టు ఎందుకు గుర్తుకువచ్చింది? వేరే అభియోగం ఎందుకు గుర్తుకురాలేదోయ్ పుల్లాయ్ అని అడగలేదే!



అయ్యవారికి అవసరమైన తెలివితేటలు ఎన్ని ఉన్నాయోకానీ, అక్కర్లేని అక్కసు చాలా ఉంది. అది మొన్నమధ్య ఆయన పెట్టిన ఓ కామెంటుతో తెలిసిపోయింది. దాదాపు సంవత్సరకాలంపైగా నేను వ్రాస్తున్న వ్యాసాలు, కవితలు ఆయనకు ఒక్కసారిగా చచ్చువిగా, పుచ్చువిగా కనిపించాయట. మరి ఆయన వ్రాసాననుకున్న కవిత్వాన్ని విమర్శించారని భాస్కర్ గారి గురించి ఆయన ఏం చెప్పారో చూడండి.



' ఇతరులు కవితలు రాస్తే వాటిని గర్హిస్తారు. ముఖ్యంగా దళితులెవరైనా రాస్తే "పోనీ ఏమైనా కవితా?" అని ప్రశ్నిస్తారు. చాలా ఉద్దాత్తరూపుడు. ఉదారస్వభావుడూ. యోగి. ఋషి. పల్నాటి వీరుడు. వేదసంహితుడు. ఇంకా ఎన్నెన్నో.



కులమతాల పట్టింపులనేవే లేవనే పెద్దమనిషి చూడండి పైన ఏమన్నారో! తాను దళితుడు కాబట్టి, తాను కవిత్వంపేరుతో వ్రాసారు కాబట్టి అది కవిత్వమనే అనాలిట! అది కవిత్వం కాదని భాస్కర్ అన్నందుకు ఎలా విరుచుకుపడ్డారో! ఎంత విచిత్రం. చివారఖరుకు, తను వ్రాసినవాటికి గుర్తింపు కోసం, మెప్పుదల కోసం కూడ ఈ పెద్దమనిషికి కులం కావాల్సివచ్చింది. పైకి మాత్రం మానవతావాది.



అయ్యవారి ద్వంద్వ వైఖరి పంచాయితీలో పెద్దరాయ్డుగారు ఇంకా చాలానే విడమర్చి చెప్పారు. అదీ చదువుకోండి, ఈయన ఎంత పెద్ద హిపోక్రాటో తెలుస్తుంది.





అట్రాసిటీ కేసులు

మన రాజ్యాంగం కొందరికి ప్రసాదించిన కొన్ని విశేషహక్కులు ఎలా దురుపయోగమౌతున్నాయో, ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల్లో ప్రస్ఫుటంగా తెలుస్తున్నది. జరిగిన ఆ రెండు సంఘటనలు స్త్రీలపై అత్యాచారానికి సంబంధించినవి కావటం ఓ విశేషమైతే, దురుపయోగం చేయటానికి ప్రయత్నించింది కూడా మహిళలే కావటం మరో విశేషం.

ముందుగా చెప్పుకోవాల్సిన సంఘటన... బాలీవుడ్ నటుడు షైని అహూజా తన ఇంటి పనిపిల్లను బలాత్కారం చేయటం. పరీక్షలు జరిపిన సంస్థలు ఈ ఘటనను నిర్ధారించాయి. పోలీసులు కేసు విచారిస్తున్నారు. కానీ విచిత్రమేమిటంటే, ఒక స్త్రీ అయి ఉండి, షైనీ అహుజా భార్య మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు నిజంగా తోటి స్త్రీలకు అవమానకరం.

'ఈమధ్య కాలంలో ఆడవాళ్ళు కూడా మగవారిని బలాత్కారం చేస్తున్నారని' ఆవిడ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యకు మద్దతు తెలుపుతున్నట్లుగా, షైని అహుజా ఇంటి మరో పనిమనిషి, బలత్కారానికి గురైనట్లుగా చెప్పబడిన పనిమనిషికి షైనీ మీద మోజు ఉన్నదని చెప్పటం కూడా జరిగింది.

ఇవన్నీ చూస్తుంటే, జరిగిన సంఘటనకు మసిపూసి మారేడుకాయ చేయాలనే సంకల్పంతో ఈ 'మహిళలే' పావులు కదుపుతున్నట్లు స్పష్టమౌతుంది. స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న మాటలని మరోసారి ఋజువు చేస్తున్నారు.

ఇక రెండో సంఘటన. ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్ లో నలుగురైదుగు పోలీసులు తనను సామూహిక బలాత్కారం చేసారని ఓ మహిళ సంచలన వ్యాఖ్య చేసింది. దరిమిలా, ఆ స్టేషనుపై ప్రజలు దాడి చేయటం, ఆ పోలీసులను, ఎస్.హెచ్.ఒ.ను సస్పెండు చేయటం, కేసును క్రైం బ్రాంచ్ కు అప్పగించటం కూడా జరిగింది.


ఇంతాచేసి, ఆ మహిళ బలాత్కారం చేసిన వ్యక్తులను గుర్తించలేకపోయింది. క్రైం బ్రాంచ్ నిర్వహించిన పెరేడ్ లో అసలు ఆ స్టేషనుకే సంబంధంలేని ఎవరో కానిస్టెబుల్ ను ఒక్కడిని గుర్తుపట్టిందట! అలానే, సంఘటన పోలీసు స్టేషనులో ఎక్కడ జరిగిందో కూడా చెప్పలేకపోయింది.

సరే, ఆ విషయాలు పక్కన బెడదాం. ఆమెపై అఘాయిత్యం జరిగినట్లుగా కనీసమైన ఆనవాళ్ళు లేవని వైద్యులు నిర్ధారించటం ఓ విశేషం కాగా, ఆవిడ ముందు చేసిన కంప్లైంటులో భర్త పేరు ఓ విధంగాను, క్రైం బ్రాంచ్ విచారణలో మరోపేరు చెప్పటం మరో విశేషం. స్టేషనులోని సి.సి. కెమేరాలో కూడా ఈమె దాఖలాలే లేవట!

బహుశా ఇప్పుడు పోలీసులు ఈ మహిళలపై అట్రాసిటీ కేసులు వేయాలేమో?

23, జూన్ 2009, మంగళవారం

నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు - ఓ బెకబెక

అయ్యవారు, మళ్ళీ ఏదో అన్నారు. అది చూడండి..

@Malakpet Rowdy & కొండముది సాయికిరణ్ కుమార్: మీ చరిత్ర విశ్లేషణ జ్ఞానం చూస్తుంటే ముచ్చటేస్తోంది. మీ మితజ్ఞానాన్ని ఒక ఉదాహరణద్వారా వివరించుకుందాం ! Get ready for a social history research methodology lesson.

ఒక సమాజంలో... ఉదాహరణకు తెలుగు సమాజంలో పెళ్ళి సాంప్రదాయాల అవిర్భావాన్ని గురించి పరిశోధించాలనుకున్న ఇద్దరు పరిశోధకులున్నారు. ఒకటి మీరు. మరొకటి నేను. పరిశోధన మొదలెట్టగానే "పెళ్ళి" ప్రస్తావన/వర్ణన ఏఏ పురాతన తెలుగు గ్రంధాల్లో ఉందో మొదటగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ‘మొల్ల’రామాయణంలో రాముడూసీతల పెళ్ళి వివరణ దొరుకుతుందనుకోండి. అందులో సీతారాముళ్ళని పట్టుపీతాంబరాలు కట్టి, నుదుటిన తిలకందిద్ది,కళ్ళకు కాటుకపెట్టి,ముంజేతికి కంకణాలు తొడిగి తయారుచేసి. సీత సిగ్గులమొగ్గవుతుంటే మంగళవాయిద్యాలూ వేదపండితుల మంత్రఘోష మధ్య రాముడు మాగళ్యధారణ గావించాడు అని కనబడింది.

పెళ్ళి సాంప్రదాయాల గురించి పరిశోధన చేయాలని బయలుదేరటం బానే ఉంది. కానీ, విశేషమేమిటంటే ఆ పరిశోధన మేము ఎలా మొదలుపెడతామో, ఎలా ముగిస్తామో కూడా ఆయన ఊహించిపడేసారు.

మేమా పరిశోధన ఎలా చేస్తామో మీరే ఊహించి చెప్పారు కాబట్టి, మీరెలా చేస్తారో నన్నోసారి ఊహించుకోనీయండి.

'బొక్కలు' వెదికే 'మనుషులు' కదా అందుకే ముందుగా గ్రంధాలలోకి దూకారు. అందులోనూ రామాయణం. అటు మొల్ల రామాయణం తిరగేస్తారు. ఇటు వాల్మీకి రామాయణం తిరగేస్తారు. ఆపైన రంగనాధ, తులసీ అన్నీ తిరగేసి చెప్పేదేమిటంటే ఈ రామాయణాలన్నిటిలోనూ సీతారాముల పెళ్ళి ఒకేరకంగా వర్ణించిలేదు. ఇంకపైగా, ఏ రామాయణంలోనూ సీతారాముల వివాహాన్ని రిజిస్టర్ చేసిన దాఖలాలు కూడా లేవు. కాబట్టి, కాల్పనిక కథ అయిన రామాయణంలో సీతారాముల పెళ్ళి జరిగిందనేది ఒక అపోహ మాత్రమే. ఇదీ మీ తంతు.

ఇక బొక్కలెదికే పెద్దమనిషికి ఇష్టమైన విషయం - కులం. ఈ పెద్దమనిషి కులం గురించి పరిశోధన చేస్తుంటే (గ్రంధాలలో) భగవద్గీత కనిపించింది. అందులోని కొన్ని శ్లోకాల ఆధారంగా కులవ్యవస్థ ఆ రోజుల్లో ఉన్నదని తీర్మానిస్తారు.

బొక్కలు వెదకని పెద్దమనిషులు కూడా ముక్కున వేలేసుకొని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే, భగవద్గీత ఉన్న మహాభారతం ఓ కాల్పనిక కథగా ఈ మనిషే అభివర్ణించారు. మరి ఓ కాల్పనిక కథలోని ఓ ప్రస్తావన నిర్ధారించటమేమిటనే అనుమానంతో మనకెందుకులే అని ఆ ముక్కే మూసుకొని వెళ్ళిపోతారు.

అయ్యో విషయం మీకు అర్ధమయినట్లు లేదు. సరే విడమర్చి చెబుతా. ఈ అయ్యవారి వాదనకనుగుణంగానే గమనిస్తే, 'పరుగోపరుగు' అనే సినిమా చూసి, అందులో 'కత్తి రాందాసు' అనే పాత్ర మన కత్తివీరులతో తనకు ఉన్న బంధాన్ని, సంబంధాన్ని నిర్ధారిస్తుంది అంటే ఎలా ఉంటుంది?

***

అలానే, 'బ్రాహ్మణికల్ ఆటిట్యూడ్' అనే పదాన్ని ఆయన వాడిన సందర్భం ఎంత హేయం. అయ్యా, 'బ్రాహ్మణికల్' అనే పదం తీసి అక్కడ మీ కులం వాడి చూడండి. అప్పుడది ఎంత హేయాతిహేయంగా మీకు కనిపిస్తుందో? ఆ సందర్భంలో మీరు కులదూషణ చేయలేదంటే ఎవ్వరూ నమ్మరు.

****

మేధావిననుకునే ఈ పెద్దమనిషి వ్రాసే పది లైనుల్లో తొమ్మిది వాచాలతే! రాయకపోతే ఆత్మహత్య చేసుకుంటామనే అభిమానుల కోసం ఇదే తంతు కొనసాగిస్తున్నారు, నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అంటూ..

22, జూన్ 2009, సోమవారం

బ్రాహ్మణ ద్వేషం - ఒక ఆటిట్యూడ్

అది ఓ పోలీస్ స్టేషన్.

ఇన్ స్పెక్టర్ : ఏంటి సంగతి? ఎందుకొచ్చారు?

ఒకటో వ్యక్తి : సార్ వీడు ముసుగేసుకొని నా పీక పిసుకుతానని బెదిరించాడండి. అందుకే ముసుగు తీసి తెచ్చా.

ఇన్ స్పెక్టర్ : ఏరా నిజమేనా?

రెండో వ్యక్తి : అవునండి. కానీ, వీడే ముందు నా పిర్ర గిల్లాడు. కోపం వచ్చి.....

ఇన్ స్పెక్టర్ : ఏరా, కోపం వస్తే మాత్రం... పీక పిసుకుతానంటావా? బొక్కలో తోయండిరా వీడ్ని.

***

అలా, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి జరిగింతర్వాత, మరో సన్నివేశం, అదే పోలీస్ స్టేషన్ లో ...

ఇన్ స్పెక్టర్ : ఏంట్రా మళ్ళీ వచ్చావ్?

ఒకటో వ్యక్తి : సార్ వీడు కూడా ముసుగేసుకొని పీక పిసుకుతానని బెదిరిస్తే, ముసుగు తీసి తెచ్చా సార్.

ఇన్ స్పెక్టర్ : ఏరా నిజమేనా?

ఆరో వ్యక్తి : సార్... వీడే ముందు నా పిర్ర గిల్లాడండి. అందుకే కోపం వచ్చి....

ఇన్ స్పెక్టర్ : వారానికో లంపటం ఇలాంటిది ఎందుగ్గానీ, పిర్ర గిల్లినోడిని బొక్కలో తోయండిరా, వీడి పీక ఇంకెవరూ పిసకరు. వీడెవడి పిర్ర గిల్లడు. వారానికోసారి ఎఫ్ఫైఆర్ లంటూ, సైబర్ క్రైంలంటూ విసిగిస్తున్నాడు.

***

అయ్యా ఇదీ భోగట్టా. మనం అనాల్సింది అంటూనే ఉన్నాం. మనం చేయాల్సింది చేస్తూనే ఉన్నాం. మరి, ప్రతిక్రియలు, ప్రతిచర్యలు వస్తున్నప్పుడు గగ్గోలు పెట్టటం దేనికి?

తను కుల విమర్శ చేయలేదు, మత విమర్శ చేయలేదు అంటున్న పెద్దమనిషి 'బ్రాహ్మణికల్ ఆటిట్యూడ్' అన్న విషయంపై జరిగిన ఒకానొక చర్చలో వ్రాసిందేమిటి?

అసలు 'బ్రాహ్మణికల్ ఆటిట్యూడ్' అన్న పదం ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా మొట్టమొదట, ఏ సందర్భంలో వాడారో పక్కన పెడదాం. ఈ పెద్దమనిషి తానే ఒప్పుకున్నట్లుగా వ్రాసిన కామెంటులో ఓ సారి చూడంది, ఆ పదాన్ని ఏ సందర్భంలో వాడారో...


"పనిలోపని ఇంకోమాట. మా యూనివర్సిటీలో (HCU) లైబ్రరీలోని ఆ సెమిస్టర్ కోర్సుకి సంబంధించిన ముఖ్యమైన పుస్తకాల్ని రూముకి తెచ్చుకుని మరెవరికీ అందకుండా రహస్యంగా చదివే వాళ్ళనికూడా బ్రాహ్మనికల్ అనేవాళ్ళం.

విద్యార్థుల రెస్పాన్స్ తో సంబంధం లేకుండా, వారి ఇంట్రెస్ట్ తో సంబంధం లేకుండా కేవలం సమయానికొచ్చి పాఠం వల్లెవేసే లెక్చరర్ ఆటిట్యూడ్ ని బ్రాహ్మనికల్ అనేవాళ్ళం.

సోషియల్ సైన్స్ లో రిసెర్చ్ అంటే రెఫరెసులతోనో మొదలవ్వాలి అనినమ్మే ప్రొఫెసర్ ఆటిట్యూడ్ ని బ్రాహ్మనికల్ అనేవాళ్ళం.

విద్యార్థుల కష్టనష్టాలతో సంబంధం లేకుండా “రూల్స్” మాత్రమే ఫాలో అవుతాననే డీన్ ఆటిట్యూడ్ ని బ్రాహ్మనికల్ అనేవాళ్ళం.

ఇప్పటికీ ఆ పదంలోగానీ దాన్ని వాడే విధానంలోగానీ పెద్ద తేడా లేదు."

అయ్యా ఇదీ సంగతి. పైన ఆయనే పేర్కొన్న సందర్భాల్లో కనీసం ఒక్క సందర్భంలోనైనా, బ్రాహ్మణ కులాన్ని పేర్కొనకుండా విమర్శించటం సాధ్యపడదా! ఒక స్వార్ధపర వ్యక్తిని తిట్టడానికో, మరొకరిని గేలిచేసి వేళాకోళం చేయటానికో మాత్రమే ఈయన ఆ పదాన్ని వాడుతారని ఇంత నిర్భయంగా, నిస్సిగ్గుగా చెబుతున్నా, ఆయన చేసిన కుల దూషణ కనిపించకపోతే మీరు ధృతరాష్ట్రులే.

కొన్నాళ్ళక్రితం వరకూ అగ్రవర్ణాల వారు నిమ్నజాతులవారిని పిలవటానికో మరొకరిని తిట్టడానికో ఓ రెండు పదాలు ఉపయోగించేవారు. అటువంటి పిలుపులను అభ్యంతరకరమని, సంస్కారహీనమని భావించి మరచిపోతున్న రోజుల్లో, గతాన్ని గుర్తుచేసే విధంగా, వైషమ్యాలకు ఆజ్యం పోయాలనే సంకల్పంతో చేసే ఈ ప్రయత్నాలు ఎంతవరకూ సహేతుకం?

ప్రభుత్వము, సమాజము అందించిన సహకారంతో ప్రస్తుతం మంచిస్థాయిలో ఉన్న ఈ పెద్దమనిషికి తాను చేసే యాగీ వల్ల కలిగే నష్టమేమీ లేదు. ఉన్న లాభమల్లా, గతంలో దాష్టీకం చేసిన అగ్రవర్ణాన్ని అవమానించగలిగాననే తృప్తి. కానీ ఈయన చేస్తున్న ఈ దాష్టీకం వల్ల ఎవరికి నష్టం కలుగుతుందో ఓసారి ఆలోచించాలని మనవి.

అగ్రవర్ణాల నుండి ఈయన తరహాలోనే సంస్కారహీనుడైన ఓ నత్తి నరేష్ 'శూ*** ఆటిట్యూడ్' అని మొదలేసి సమాజంలో వైషమ్యాలు సృష్టిస్తాడు. వీడు సృష్టించే వైషమ్యాలవల్ల సమాజంలో మంచి స్థానంలో ఉండి, కేసుల మీద కేసులు వేసి పబ్బం గడుపుకోగలననే వ్యక్తులకు వచ్చే నష్టంలేదు. కానీ, ఇప్పటికీ నిమ్నజాతులుగానే మిగిలిపోయి సమాజంలో భాగం కావాలని తపనపడే మరికొందరు వారి ప్రమేయం లేకుండానే వెలివేయబడి, వారి తప్పు లేకుండానే వైషమ్యాలు ఎదుర్కోవాల్సివస్తుంది. దీనికి బాధ్యత ఈ సంస్కారహీనులదే.

ఈ విషయాన్ని సైబర్ పోలీసులు గమనిస్తారనే ఆశిస్తాను.
***


పై వ్యాసం పోస్టు చేసే లోపే, అయ్యవారి బెకబెక మరోసారి వినిపిస్తే, వెళ్ళి చూసా వేరే బ్లాగులో. మీరూ చూడండి.

"మనుస్మృతి ఆధారంగా కులాల్ని ప్రతిపాదించించి ఎవరు? పంచమకులంగా అంటరాని కులాల్ని సృష్టించిందీ, ఆ ఆభిజాత్యాన్ని వర్ణాశ్రమంలో కుదించింది ఎవరు? దాన్ని perpetuate చెయ్యడంలో అన్ని కులాల పాత్ర ఉన్నా, basis ఇదే అనేది మీరొప్పుకోకపోయినా చరిత్ర అదే చెబుతోంది.

సంస్కృతంలో మాత్రమే ఉన్న ఈ doctrines బ్రాహ్మణులు కాక మరెవరైనా రాసారని చరిత్ర నాకు చెప్పలేదు. మీకు కావలసిన scientific proof నాకు తెలీదు. కానీ నేను ప్రతిపాదించిన సిద్ధాంతం చారిత్రకు సంబంధించినది.ఇందులో నేను కొత్తగా ఆపాదించందీ, నిందించిందీ ఏమీ లేదు. I was only stating a social and historical FACT."

అయ్యవారి రెండు నాల్కల ధోరణికి ఇదో పెద్ద ఉదాహరణ. వేదాలు, పురాణాలు లేవు. అవి కేవలమూ కల్పిత గాధలు అనే పెద్దమనిషి 'మనుస్మృతి' మాత్రం ఉన్నదని నమ్ముతారు. దాని ఆధారంగా కులవిభజన చేసింది కూడా బ్రాహ్మణులే అని (ప్రత్యేకించి చెప్పకపోయినా) నమ్ముతారు. ఇకపైగా, అది సామాజిక, చారిత్రక సత్యం అని కూడా నొక్కి వక్కాణిస్తారు.

మనుస్మృతి ఉన్నదని నమ్మేట్లయితే, వేద పురాణాలని కూడా ఉన్నాయని విశ్వసించండి. లేదంటే, మనుస్మృతి ఉన్నదనే వాదన కూడా కట్టిపెట్టాలి. కేవలమూ, అవకాశవాదంగా వీటిని వాడుకుంటామనటం అసమంజసం.

ఒక్క ఈయన అనే కాదు, మేధావులుగా భావింపబడుతున్న చాలామంది చరిత్రకారులు చేసే వితండవాదనే ఇది. కేవలమూ కొన్ని అగ్రవర్ణాలను విమర్శించటమే ధ్యేయంగా వీరు అవకాశవాదాన్ని ప్రదర్శిస్తారు. అంతేకానీ, నిజమైన చారిత్రక ఆధారాలు ఉండి కాదు.

20, జూన్ 2009, శనివారం

మాయావతి మూర్ఖత్వం

ఎవరో ఏదో బ్లాగులో ఈయన బ్లాగు లింకు తనదిగా ఇచ్చి తన కామెంటు పెట్టారట. రిజర్వేషనులని ప్రస్తావించి, ఈయన కులాన్ని ఎత్తి చూపించారుట. కడుపు మండిందట. కేసు పెడతారట! ఆయన ఎక్కడ ఉన్నా, ఈ దేశానికి రాకపోరా, అరెస్టు చేయించలేనా అన్న ధీమా! So what?

ఈ దేశంలో మహాత్మాగాంధిని అమ్మనాబూతులు తిట్టిన ఓ రాష్ట్ర దళిత ముఖ్యమంత్రి ఈ అయ్యవారికి ఆదర్శం! అవును. మహాత్మాగాంధికే దిక్కు లేదు, అది కూడా కేంద్రంలో కాంగ్రెసు అధికారంలో ఉన్నప్పుడు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలతో ఎంతమందిని ఎంతకాలం ఇలా వేధించగలమన్న ధీమాతో వీళ్ళు ఉంటారో?

ఆశ్చర్యమైతే లేదు కానీ, ఏవగింపు మాత్రం కలుగుతుంది. అందులోనూ, ఇంత చదువుకున్నవాళ్ళని ఇలా చూసినప్పుడు, ఇంతవరకూ వారిపై ఉన్న వీసమెత్తు గౌరవాన్ని కూడా వాళ్ళు పోగొట్టుకుంటున్నప్పుడు, నిజంగానే ఛీదర పుడుతుంది.

సరే ఈ పిడకల వేట పక్కన పెట్టి, మాయావతి మాటతూలుడు గమనిద్దాం. హరిజన గిరిజనులతో కలిసిన తర్వాత మహాత్మా గాంధి ఇంటికి వెళ్ళి చేతులు కడుక్కునేవాడట! మహాత్మాగాంధీ అంటే, ఎవరో ములాయంసింగునో, అద్వానినో, సోనియానో భావించి ఈ మాయావతి తమ నోటి తీట బానే వదిలించుకుంది. కానీ, గాంధీని మహాత్ముడని ఎందుకు అన్నారు? అంబేద్కరును ఎందుకు అనలేదు అని ఒక్కసారైనా ఆవిడ ఆలోచించి ఉంటే, ఇలా నోరు పారేసుకునేది కాదు.

ఆ రోజుల్లోనే, అగ్రకులంలో పుట్టినా, కుల మత కట్టుబాట్లను పక్కకు పెట్టి, హరిజన గిరిజనులకు గుళ్ళల్లో ప్రవేశానికి పాటుపడ్డాడు గాంధి. ఈరోజుల్లో ఇదేమంత గొప్ప విషయంగా అనిపించకపోవచ్చు. కానీ, ఆ రోజుల్లో ఇది నిజమైన సాహసమే. ఎందుకంటే, కుల బహిష్కార శిక్ష కూడా విధింపబడే అవకాశమున్న సాహసం అది.

రౌండు టేబుల్ సమావేశాలకు వెళ్ళినప్పుడు కూడా, బ్రిటీషు సామ్రాజ్యవాద దురహంకారానికి బలౌతున్న సామాన్య భారతీయుడుని ప్రతిబింబిస్తూ కొల్లాయి మాత్రమే కట్టుకున్నాడు. అలానే, స్వాతంత్ర్యపోరాటంలో ఎన్నిసార్లు జైలుకు వెళ్ళాడో, చరిత్రను తిరగేస్తే తెలుస్తుంది. అదీ గాంధీ గొప్పదనం. అందుకే మహాత్ముడయ్యాడు.

మరి అంబేద్కర్ చేసిందేమిటి? హిందూ మతంలో కుల దురహంకారానికి బలౌతున్నానంటూ బౌద్ధ మతం స్వీకరించాడు. గాంధీలా అదే మతంలో ఉంటూ, మతభావాలను మార్చాలనే ప్రయత్నం చేయలేదు. కాబట్టి, ఓ పలాయనవాదిగానే ఆయన ప్రతిబింబిస్తాడు.

సరే, స్వాతంత్ర్యపోరాటంలో ఒక్కసారైనా జైలుకు వెళ్ళిన చరిత్ర అంబేద్కర్ కు ఉందా? నిజానికి, విభజించి పాలించు అనే బ్రిటీషు సిద్ధాంతానికి అంబేద్కర్ చేయూతనందించి, అదే అభిప్రాయాన్ని రౌండ్ టేబుల్ సమావేశాల్లో ప్రకటించాడు కానీ, దేశ స్వాతంత్ర్యం గురించి ఏనాడూ పోరాడలేదు.

దాదాపు మూడు వందల మంది దాకా సభ్యులున్న రాజ్యాంగసభలో ఒకే ఒక్క 'డ్రాఫ్టింగ్ కమిటీ'కి ఆయన ఛైర్మన్ గా వ్యవహరించాడు. అది కూడా, రాజ్యాంగసభ దాదాపు యాభై శాతం తన పని ముగించిన తర్వాత.

రిజర్వేషనుల పరంగా ఈరోజు చాలామంది అంబేద్కర్ తమనేదో ఉద్ధరించాడని నెత్తిన పెట్టుకుంటారు. మరికొంతమంది ఆయనపై అనవసరంగా నోరు కూడా పారేసుకుంటారు. నిజానికి, ఈ రిజర్వేషనుల ప్రతిపాదన చేసింది అంబేద్కర్ కాదు. వల్లభ్ భాయ్ పటేల్, బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి ఇతర నేతలు. హరిజన, గిరిజనుల, తదితర వెనుకబడిన వర్గాల ప్రజల కోసం రాజ్యాంగ సభలో ఏర్పాటు చేయబడిన కమిటీలకు వారు చైర్మన్లుగా వ్యవహరించి రిజర్వేషనుల ప్రతిపాదన చేసారు.

ఏదేమైనా, పై విషయాలు తెలుసుకున్న తర్వాత గాంధీ ఎంతటి మహాత్ముడనేది అర్ధమైనా కాకపోయినా, మాయావతి ఎంత మూర్ఖురాలో అర్ధమౌతుంది। పుట్టినరోజు పండగల జరుపుకుంటూ 50-60 కిలోల కేకు కోసి పంచుకునే మాయావతికి మహాత్ముని విలువలు తెలుస్తాయనుకోవటం మన తప్పు.

PS : అయ్యా నాకు 'కత్తిలాంటి' అనేది ఊతపదం. అయినా, ప్రస్తుత పరిస్థితుల్లో 'కత్తి' అన్న పదం వాడాలంటే భయంవేసి, అది ఈ టపా శీర్షిక నుంచి తీసేలోపే 'జల్లెడ'లో వచ్చింది. అందుకు 'కత్తి'వారు నన్ను క్షమించగలరు.