పంచవటిలో సభ్యుడైన ఓ అనామక బ్లాగరు అంబేద్కర్ ను వదిలి ఆధ్యాత్మిక విషయాలపై వ్రాయమని చాలా కాలం నుంచి సూటిపోటి వ్యాఖ్యలతో బతిమాలుతున్నారు. సరే, ఆయన బతిమాలుతున్నారని కాకపోయినా, అన్నగారి (సత్యనారాయణ శర్మగారి) ఆలోచనా తరంగాలలో "తంత్రంలో షట్కర్మల ప్రాధాన్యత" అనే వ్యాసం నాకో అవకాశం ఇచ్చింది. ఆ వ్యాసంలో, మన తంత్రాలలో కామ్యసాధనకు సంబంధించి ఇవ్వబడిన ఆరు విధానాలను అన్నగారు ప్రస్తావించారు. మోహన, వశీకరణ, స్తంభన, ఉచ్ఛాటన, విద్వేషణ మరియు మారణ క్రియలకు సంబంధించిన వ్యవహారం ఇది.
ఆసక్తి కలిగించే కొన్ని వ్యాఖ్యలకు నాకు తెలిసిన వివరణ ఇవ్వాలనే ప్రయత్నంతో వ్రాస్తున్న వ్యాసం ఇది. ముందుగా, మలక్ లేవనెత్తిన అంశం. ఈ వ్యాసం నచ్చలేదని, ఇవి మూఢనమ్మకాలని, దయ్యాలు భూతాల మీద తనకు నమ్మకం లేదని మలక్ అన్నారు.
అసలు విషయం ఏమిటంటే, ఈ వ్యాసంలో ఎక్కడా శర్మ గారు దయ్యాలు, భూతాల ప్రస్తావన తీసుకురాలేదు. ఆయన సంగతేమో కానీ, దేవుడు ఉన్నాడు అని నేను నమ్ముతాను కాబట్టి, దయ్యాలు కూడా ఉన్నాయని నేను నమ్ముతాను. ఇది ప్రస్తుత వివరణకు సంబంధించి అనవసరమైన విషయం కాబట్టి, పక్కన పెడతాను.
మనకు ఉన్న దేవతలందరూ మంత్రబద్ధులు. ఉన్న ప్రతి దేవతకు ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్ర సాధన చేసి, సిద్ధిని పొందినవాడికి ఆ దేవత కామ్యసిద్ధి కలిగిస్తుంది. మంత్ర సిద్ధిని పొందినవాడు భక్త మార్కండేయుడు కావచ్చు, లేదంటే భస్మాసురుడు కావచ్చు. భస్మాసురుడు, రావణుడు, హిరణ్యకశిపుడు దుర్మార్గులని తెలిసినా, బ్రహ్మ వరాలు ఎందుకు ఇచ్చాడంటారు? వాళ్ళు ఆయా మంత్ర సిద్ధిని పొందారు కాబట్టి, అవి ఇవ్వక తప్పని పరిస్థితి.
మీ సంతోషం గారు మరో విషయం లేవనెత్తారు. మన సంస్కృతికి సంబంధించి తంత్ర సాధన అనవసరం. కాబట్టి, విష్ణు సహస్రనామాలో, లలితా సహస్రనామాలో చేసుకోవచ్చు కదా అని ఓ ఉచిత సలహా పారేసారు.
ఎవరికి ఏ సాధన అవసరం అని నేను మీరు నిశ్చయించలేం కదా! ఎవరి సుకృతాన్ని బట్టి వారికి ఆయా అవకాశాలు వస్తాయి. బహుశా, ఈయన ఉద్దేశ్యంలో ఇలా ప్రయోగాలు చేసి మారణ క్రియలు జరిపే తంత్రం అవసరమా అని కూడా అయ్యుండవచ్చు. ఆమాటకొస్తే, వేదమంత్రాలతో కూడా మారణ ప్రయోగాలు చేయవచ్చు. రామాయణ, భారతాలు చదువుకున్నాం. యుద్ధాలలో బ్రహ్మాస్త్రాలు, నారాయణాస్త్రాలు, ఆగ్నేయాస్త్రాలు వాడేవారని కూడా చదివాము, శరత్కాలంగారు వర్ణించే టైపులో బాణాలు వేసుకోవటం కూడా సినిమాలలో చూసాం. అక్కడ అర్జునుడు ఆగ్నేయాస్త్రం వేసినప్పుడు, వేయబడిన బాణం కర్ర ముక్క, ఇనుప ముక్కా అన్నది ముఖ్యమైన విషయం కాదు. బాణం బదులుగా ఓ గడ్డిపరక అభిమంత్రించి వేసినా అది ప్రయోగమే అవుతుంది. ఉదాహరణకు, పాండవుల వంశం నశించాలని, అశ్వత్థామ ఓ గరికను అభిమంత్రించి బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగిస్తాడు, మహాభారతంలో.
అందరం భక్తిప్రపత్తులతో స్మరించే గాయత్రీ మంత్రం కూడా, వెనుక నుంచి చదివితే బ్రహ్మాస్త్రమౌతుందని చెబుతారు పెద్దలు. అలానే, ఏ లైనుకాలైను వెనుక నుంచి చదివితే బ్రహ్మదండమని, ఏ పదానికి ఆ పదం వెనుక నుంచి చదివితే బ్రహ్మశిరోనామకాస్త్రమని కూడా చెబుతారు. ఇలా విలోమ పద్ధతిలో చాలా మంత్రాలను ప్రయోగాలుగా వాడుకోవటం గురించి మన తంత్రాలలో విస్తారంగా చెప్పారు.
భస్మాసురుడికి, హిరణ్యకశిపుడికి వారు కోరిన వరాలు ఇచ్చినా, వారివారి దుష్కర్మల ఫలితాన్ని కూడా అనుభవించే విధంగా సృష్టిక్రమం నడుస్తుంది. అందుకనే, అటువంటి ప్రయోగాలు అత్యవసర పరిస్థితుల్లో తప్పించి వాడరాదన్న విషయాన్ని కూడా శర్మ గారు చెప్పారు.
ఈరోజుల్లో, సాధన చేయలేని మన బద్ధకానికి భక్తి అనే ముసుగు తొడిగి, మొక్కుల పేరుతో దేవుడిని ప్రలోభపెట్టి పనులు చేసుకుందామనే బాపతే ఎక్కువ. సాయిబాబా మంత్ర తంత్రాలు ఆచరించలేదని కొందరంటున్నారు. వారిలాగా, అడ్డగోలు వాదనతో దానికి ప్రమాణం చూపమని నేను అడగను. ఆయన సాధన యోగపరమైనది. అష్టాంగయోగాన్ని సాధన చేసేవారనే విషయం ఆయన జీవితచరిత్ర చదివిన ఎవరికైనా అర్ధమౌతుంది.
ఏది ఏమైనా, మంచి తాంత్రిక వివరాలున్న వ్యాసాన్ని చదవాల్సిన రీతిలో చదవలేదని, అర్ధం చేసుకోవాల్సిన రీతిలో అర్ధం చేసుకోలేదని మాత్రం తెలుస్తుంది.

http://takitadhimi.blogspot.com/
రిప్లయితొలగించండిమంత్రాలు తంత్రాలు బోగస్ అనే పెద్దమనిషి ఇంట్లో సాయిబాబా పటం నుండి వీభూధి వచ్చిందిట! అది మనం నమ్మాలట. ఎవర్నో పాము కాటేస్తే బాబాని స్మరిస్తే ఒంటి నిండా వీభూధి పూసి వెళ్ళాడట ఆయన!! రోగం వెంటనే కుదిరిందట! ఇవి మనం నమ్మాలి. మంత్రాలు తంత్రాలు నమ్మకూడదు. తొండ ముదిరి వికటకవి ఎలా అయ్యింది చెప్మా?."
Well Said.
రిప్లయితొలగించండికిరణ్ గారూ,
రిప్లయితొలగించండిముందుగా దసరా శుభాకాంక్షలు..
ఇక విషయానికి వస్తే ఇటువంటి విద్యల వల్ల సగటు మానవుడికి ఉపయోగమెంత?? మరి ఈ విద్యలు అంత ఉపయోగకరమైన వైతే యోగాసనాల లాగా ఎందుకు ప్రాచుర్యం పొందలేదు?? నా ఉద్దేశ్యం లో ఇటువంటి విద్యల వల్ల మేలు జరిగే అవకాశం తో పాటు కీడు జరిగే అవకాశం కూడా అంతే ఉంది.. అందుకే మన పెద్దలు వాటిని ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వలేదు..
ఇక బద్దకం వల్ల ఇలాంటి సాధనలు చేయలేక భక్తి అంటున్నారు అనే విషయం లో నేను విభేదిస్తున్నాను.. రోజు సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు, యోగాసనాలు వేసే వాళ్ళు, ప్రాణాయమం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు.. ఇక భక్తికి మీరన్నట్టు బద్దకం కారణం అని నాకనిపించటం లేదు.. ఎందుకంటే మారు తున్న జీవన విధానాల వల్ల ఇటువంటి సాధనలకు సమయం దొరకడం కష్టం.. రాత్రి 12 దాకా ఆఫీస్ కాల్స్ లో ఉన్న వ్యక్తి తెల్లవారి 5గం లేచి ప్రాణాయామం చెయ్యమంటే కష్టమే కదా..
కార్తీక్ గారు - మీకు కూడా దసరా శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండి===
ఇక విషయానికి వస్తే ఇటువంటి విద్యల వల్ల సగటు మానవుడికి ఉపయోగమెంత??
===
ఏ ఉపయోగాలు ఆశించి మొక్కులు, పూజలు చేస్తారో, వాటికి మించి ఉపయోగకరం.
===
మరి ఈ విద్యలు అంత ఉపయోగకరమైన వైతే యోగాసనాల లాగా ఎందుకు ప్రాచుర్యం పొందలేదు??
===
యోగసాధకుల కన్నా, మంత్రసాధకులు తక్కువ అనే నిర్ణయానికి మీరెలా వచ్చారో తెలుసుకోవాలనుంది.
===
నా ఉద్దేశ్యం లో ఇటువంటి విద్యల వల్ల మేలు జరిగే అవకాశం తో పాటు కీడు జరిగే అవకాశం కూడా అంతే ఉంది.. అందుకే మన పెద్దలు వాటిని ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వలేదు
===
మీరు చెబుతున్న యోగాసనాలలో కూడా మంత్రసాధనల వల్ల కలిగే మేలు, కీడులు కూడా జరుగుతాయి.
పెద్దలు ప్రాముఖ్యం ఇవ్వలేదని ఎలా చెబుతారు? ఈరోజుల్లో మంత్ర సాధన చేసేవాళ్ళు లేరు కాబట్టి పెద్దలు ప్రాముఖ్యత నివ్వలేదని చెప్పటం సరికాదు. నిజానికి, వేదాల తర్వాత విస్తృతంగా వ్రాయబడినవి తంత్రాలే.
మయాకృతాని తంత్రాణి సంఖ్యాయాష్టోత్తరంసతం
యేన యేన ప్రార్ధితోహం దేవీ సంప్రార్ధితామయా
మేరుతంత్రంలో ఈశ్వరుడు నూట ఎనిమిది తంత్రాలు ఉన్నట్లుగా చెప్పటం జరిగింది. తంత్రమంటే, మీరు కూడా నలుగురితోబాటు నారాయణ అన్నట్లు, తంత్రాన్ని క్షుద్రవిద్యగా భావించటం ఆశ్చర్యం కలిగిస్తున్నది.
===
ఇక బద్దకం వల్ల ఇలాంటి సాధనలు చేయలేక భక్తి అంటున్నారు అనే విషయం లో నేను విభేదిస్తున్నాను.. రోజు సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు, యోగాసనాలు వేసే వాళ్ళు, ప్రాణాయమం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు..
===
యోగసాధనంటే, సూర్యనమస్కారాలు ప్రాణాయామాలేనా సార్? యోగ చాలా ప్రాచుర్యంలో ఉందని చెబుతున్నారు... ఎంతమంది ఎన్నిరకాల ఆసనాలు వేయగలరో ఓ సారి బేరీజు వేసి చూడండి. నిజానికి, అక్కడా బద్ధకమే. అందుకే, చాలావరకు సూర్యనమస్కారాలతోను, ఓ ఐదు నిముషాలు ప్రాణాయామాలతోనూ యోగసాధన ముగించేస్తారు.
adements cant digest nd understand this concept sir..these fellows doesnt do any work on the subject first nd ask heckling qstns on it.They dnt read any related stuff.we have to clarify nd xplain on free of cost basis.
రిప్లయితొలగించండిDear Brother
రిప్లయితొలగించండిhttp://eenadu.net/story.asp?qry1=5&reccount=32
ఈ లింక్ లొ ఉన్న జరిగిన సంఘటన చూసి... ఇలాంటి దురదృస్టకర సంఘటనలు నివారించడానికి ఒక సగటు పౌరుడిగా , హిందు దర్మం ఆచరించే వ్యక్తిగా ..మనం ఏమి చెయ్యాలి ?
ఇటువంటి సంఘటనలకు .... మీరు పైన ఉదహరించిన టపాలు, వాటిలొ ఉన్న ఇంఫర్మేషన్ ఏ రకంగా ప్రభావితం చేస్తుందొ చెప్పగలరా....
>> మంచి తాంత్రిక వివరాలున్న వ్యాసాన్ని చదవాల్సిన రీతిలో చదవలేదని, అర్ధం చేసుకోవాల్సిన రీతిలో అర్ధం చేసుకోలేదని మాత్రం తెలుస్తుంది. >> దీనికన్నా మంచి వివరాలున్న వ్యాసాన్ని చెప్పాల్సిన రీతిలో చెప్పలేదని, ఒపికగా సందేహాలు తీర్చాలిసిన అర్ధం తీర్చలేదని తెలుస్తుంది అని రాస్తే నేను ఎక్కువ మీతొ ఏకీభవించేవాడిని....
ఆయనకే కాదు ఎవరికి ఈ తంత్ర విద్యల మీద నమ్మకం ఉన్నా... బ్లాగ్ ముఖం గా ఇప్పుడే చెబుతున్నా.... నేను రేడి... ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను :-)))
సాయికిరణ్ గారు
రిప్లయితొలగించండిమంచి విషయం వ్రాసారు. తంత్రం అంటే దెయ్యాలు, భూతాలను ఆహ్వానం చేయడం అనే అజ్ఞానంలో ఉండిపోయారు. పోని తెలియనప్పుడు శర్మ గారిని పద్ధతిగా జిజ్ఞాసతో అడిగి తెలుసుకోవచ్చుగదా అలా కాకుండా పిచ్చి వ్రాతలని కొట్టిపారేసారు. వీళ్ళకున్న సినిమా నాలెడ్జి, చిన్నప్పటి నుంచి విన్న మూఢనమ్మకాలతో తంత్రం అంటే క్షుద్రం అని తేల్చేసారు ఇప్పుడు దాని మీద వ్యంగ్య టపాలు, కామెంట్లు. అంతేగాని ఒక్కరు కూడా తంత్రం, తంత్ర శాస్త్రం అంటే అర్థం చెప్పమని అడగలేదు. అడిగుంటే శర్మగారు చక్కగా చెప్పేవారు.
ఈనాడు ఇళ్ళలో అందరూ చదివే లలితా సహస్ర నామాలు తంత్ర శాస్త్రంలోనివే. శ్రీ చక్రార్చన, శ్రీ విద్యా ఉపాసన, దేవి ఖడ్గమాల కూడా తంత్ర శాస్త్రంలోనివే. ఇవేకాదు అమ్మవారి పూజలన్నీ తంత్ర శాస్త్ర పరిధిలోనివే కదా. ఇవిగాక వైష్ణవ త్రంత్రం, వోమకేశ్వర తంత్రం, నారద ప్రయాణ తంత్రం, ఉచ్ఛిష్ట గణపతి ఉపాసన వంటి తంత్రాలు చాలా ఉన్నాయి.
తంత్రం కూడా భగవంతుని పూజించే ఒకానొక ఉన్నత స్థాయి పూజా విధానం. దీనిలో షోడశోపచార పూజలు, బీజక్షర మంత్ర జపం, యంత్ర పూజ, హోమములు, ధ్యానయోగ సాధన ఉంటాయి. వీటిని ఒక సద్గురువు దగ్గర మంచి సమయలో మంత్ర ఉపాసన తీసుకొని ఆ మంత్రాన్ని లక్షలకొద్ది జపం చేయాల్సి ఉంటుంది. అలా చేసిన వ్యక్తికి మంత్ర సిద్ధి కలిగి అనేక మహిమాన్విత సిద్ధులు కలుగుతాయి. మాములు వ్యక్తులు ఈ సాధన చేయాలంటే చాలా కష్టపడాలి. శ్రద్ధ, నిష్ట, గురు భక్తి, దైవం పట్ల, మంత్రం పట్ల విశ్వాసం ఉండాలి.
అంతటి శ్రద్ధ ఇప్పటి వారికి తక్కువ కాబట్టి చిన్న చిన్న పూజలు, వ్రతాలు చేయడం, వారాలప్పుడు ఆయా దేవతల గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం తీసుకొని వచ్చేయడం. అక్కడితో స్వస్తి. అదే గొప్పగా భావిస్తున్నారు. ఒక సాయిబాబా నామమైనా, శివ పంచాక్షరీ అయినా, నారాయణ మంత్రమైనా రోజు వేలకొద్ది చదివితేగాని ఆ మంత్రం యొక్క సిద్ధి కలుగదు. కాని మనం అలా చదవకుండా ఓ పావుగంటలోనో, అరగంటలోనో పూజ ముగించేస్తాం. ఇక మంత్ర సిద్ధి ఎలా కలుగుతుంది. ఎందుకంటే దైవం మంత్రాధీనం. మననాత్ త్రాయతే ఇతి మంత్రః అంటే జపించేవారిని రక్షించేది మంత్రం. దానిని కొన్ని ప్రత్యేక విధులతో చేయడమే తంత్రం. అది సాధన చేసినవాడికి కలిగేవే శర్మగారు చెప్పిన సిద్ధులు, వాటితోపాటు అష్టసిద్ధులు, వాక్సుద్ధి కూడా కలుగుతుంది. ఆ దేవతానుగ్రహం అపారంగా ఉంటుంది.
మీలో అందరూ దైవ పూజ చేసేవారే మరి అలాటప్పుడు శర్మ గారు చెప్పిన విషయాన్ని అపహాస్యం చేయడమెందుకు. మనస్పూర్తిగా దైవారాధన చేయండి. అందు అనుభూతులు మీకు తెలుస్తాయి.
సాయికిరణ్ గారు నేను వ్రాసినది తప్పు అనిపిస్తే నిరంభ్యతరంగా నా కామెంట్ తొలిగించండి.
శ్రీవాసుకి
కార్తీక్ గారు మెయిల్ లో పంపిన వ్యాఖ్య ఇది :
రిప్లయితొలగించండికిరణ్ గారూ,
నేను మీబ్లాగులో తంత్రాల టాపిక్ చర్చిస్తున్న కార్తీక్ ను.. మీ బ్లాగులో ఎందువల్లో కామెంటలేకపోయాను అందువల్ల ఇలా పర్సనల్ గా మెయిల్ చేస్తున్నాను.. అన్యధా భావించద్దు..
>>ఏ ఉపయోగాలు ఆశించి మొక్కులు, పూజలు చేస్తారో, వాటికి మించి ఉపయోగకరం.
యోగాసనాలు ధ్యాన పద్దతుల వల్ల మనిషికి ఆరోగ్యం, దృఢమైన మనస్సు వస్తాయి.. ఈ యంత్రాలు/తంత్రాల వల్ల అలాంటివి కలుగుతాయా? ఇది ఒక నమ్మకం మీద ఆధారపడ్డ విషయం కాదా?? మరొక అనుమానం ఏమిటంటే యంత్రాలకు/ఆధ్యాత్మికతకు సంబంధం ఏమిటి??
>>యోగసాధకుల కన్నా, మంత్రసాధకులు తక్కువ అనే నిర్ణయానికి మీరెలా వచ్చారో తెలుసుకోవాలనుంది.
యోగసాధకుల కన్నా మంత్ర సాధకులు తక్కువ అని ఎందుకు అన్నానంటే, నేనింత వరకూ ఒక తంత్ర/క్రియలు నేర్పించే ఒక పెద్ద స్కూల్ ఆఫ్ థాట్(తెలుగు పదం?) ను చూడాలేదు.. అదే యోగా నేర్పించను ఎన్ని సంస్థలు ఉన్నాయి.. రామకృష్ణ మిషన్ దగ్గరి నుంచీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వరకూ చాలా ఉన్నాయి..
>>మీరు చెబుతున్న యోగాసనాలలో కూడా మంత్రసాధనల వల్ల కలిగే మేలు, కీడులు కూడా జరుగుతాయి.
నిజమే ఆసనాలు సరిగ్గా వెయ్యకపోతే కీడు జరుగుతుంది.. కానీ ఆసనాలతో ఇంకో మనిషిని చంపడం వగైరా చేయలేము కదా?? ( సదరు శర్మ గారు చెప్పిన వాటిలో అత్యంత ఇబ్బందికరమైన విషయం అదే.. ఒక మనిషి మరణాన్ని మనం శాసిస్తే ఇక మానవుడు దేవుడని విర్రవీగడా??)
>>నిజానికి, వేదాల తర్వాత విస్తృతంగా వ్రాయబడినవి తంత్రాలే.
ఈ విషయం నాకు తెలిదు.
మరి ఇవి జనబాహుళ్యం లోకి ఎందుకు చేర లేదు?? మన పురాతన విద్యలన్నీ చాలామటుకు కనుమరుగయ్యాయి.. (దీనికి మనకు జన్మతో వచ్చిన నిర్లిప్తత కారణం అని నా అభిప్రాయం) కానీ యోగాసనాలు ఆయుర్వేదం వంటివి ఇంకా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి కదా..
>>మీరు కూడా నలుగురితోబాటు నారాయణ అన్నట్లు, తంత్రాన్ని క్షుద్రవిద్యగా భావించటం ఆశ్చర్యం కలిగిస్తున్నది.
నా వ్యతిరేకత తంత్రం మీద కంటే చేతబడి, మోహన క్రియ లాంటి వాటి మీద. గమనించగలరు. తంత్రం అనేదాని గురించి నాకు పెద్దగా తెలీదు.. కాబట్టి నో కామెంట్స్.
>>నిజానికి, అక్కడా బద్ధకమే. అందుకే, చాలావరకు సూర్యనమస్కారాలతోను, ఓ ఐదు నిముషాలు ప్రాణాయామాలతోనూ యోగసాధన ముగించేస్తారు.
ఇవన్నీ ఎవరికి నచ్చినవి వాళ్ళు చేస్తారు.. ఇక ఈ స్కూల్ ఆఫ్ థాట్స్ వాళ్ళు ఒక నిర్థిష్టమైన పద్దతులు ఫాలో అవుతారు.. ఉదా:- ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ సుదర్శన క్రియ 45 నిమిషాలు పడుతుంది.. దానికి ముందు కొంత వ్యాయామం తప్పనిసరి.. ఇక పతంజలి యోగా వాళ్ళు 40 నిమిషాలలో చాలా ఆసనాలు చేయిస్తారు.. కనుక ఇది బద్దకం అని నేను అనలేను..
--
urs ever,
-Karthik
FEAR: False Expectation Assuming to be Real.
యోగాసనాలు ధ్యాన పద్దతుల వల్ల మనిషికి ఆరోగ్యం, దృఢమైన మనస్సు వస్తాయి.. ఈ యంత్రాలు/తంత్రాల వల్ల అలాంటివి కలుగుతాయా? ఇది ఒక నమ్మకం మీద ఆధారపడ్డ విషయం కాదా?? మరొక అనుమానం ఏమిటంటే యంత్రాలకు/ఆధ్యాత్మికతకు సంబంధం ఏమిటి??
రిప్లయితొలగించండి===
యోగాసనాలను, ధ్యానపద్ధతులను దేహదారుఢ్యం కోసం, దృఢమైన మనసు కోసం మాత్రమే పరిమితం చేయటం వల్లన, మీకు ఎక్కడ చూసినా యోగ నేర్పే క్లాసులు కనిపిస్తుంటాయి. వీటిని మించిన అతీతమైన స్థితికి తీసుకెళ్ళేది యోగసాధన. దురదృష్టవశాత్తు ఆ స్థాయిలో నేర్పే గురువులు ఈరోజుల్లో దొరకకపోవటం వల్లనే, దేహదారుఢ్యానికి మాత్రమే ఇవి పరిమితమౌతున్నాయి.
ధ్యాన యోగమైనా, మంత్ర తంత్ర సాధనలైనా సఫలం కావటానికి ఏకాగ్రతనే సూచిస్తుంటాయి. ఇవి రెండు విభిన్నమైన పద్ధతులు. ఒకటి ఎక్కువ కాదు, మరొకటి తక్కువ కాదు.
ఇక, మంత్ర తంత్రాల గురించి లేశమాత్రమైనా నేను చెప్పగలను కానీ, యంత్రాల గురించి నాకు తెలిసింది పెద్దగా లేదు. కాబట్టి, ఆ జోలికి వెళ్ళను.
===
నేనింత వరకూ ఒక తంత్ర/క్రియలు నేర్పించే ఒక పెద్ద స్కూల్ ఆఫ్ థాట్(తెలుగు పదం?) ను చూడాలేదు.. అదే యోగా నేర్పించను ఎన్ని సంస్థలు ఉన్నాయి.. రామకృష్ణ మిషన్ దగ్గరి నుంచీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వరకూ చాలా ఉన్నాయి..
===
నిజానికి తంత్రం నేర్పే పాఠశాలలు ఉండవు. ఎవరైనా ఒక "సద్గురువు"ను ఆశ్రయించి, ఆయన అనుగ్రహం పొందగలిగినప్పుడు మాత్రమే మంత్ర తంత్రాలు నేర్పుతారు. ఈ సాధనలు లౌకికావసరాలు తీర్చగలిగినా, వీటి పరిధి విస్తృతమైనది, అలౌకికమైనది, నిగూఢమైనది. అందుకే, ఈ సాధనలు గురు ముఖతా మాత్రమే నేర్చుకోవాలని చెబ్తారు. అందుకే వీటికి ప్రత్యేకించి పాఠశాలలు ఉండవు. ఇక రామకృష్ణ మిషన్ వారైనా నాకు తెలిసీ మంత్ర తంత్ర సాధనలో ముందు వరుసలోనే ఉండే సంస్థ.
===
సదరు శర్మ గారు చెప్పిన వాటిలో అత్యంత ఇబ్బందికరమైన విషయం అదే.. ఒక మనిషి మరణాన్ని మనం శాసిస్తే ఇక మానవుడు దేవుడని విర్రవీగడా??
===
శర్మ గారు వ్రాసిన వ్యాసంలో ఈ వాక్యాలు బహుశా మీరు చదివినట్లు లేరు.
"అయితే, ఇవన్నీ దుష్కర్మలు కదా, ఇటువంటి ప్రయోగాలు చెయ్యవచ్చునా అని సందేహం కొందరికి వస్తుంది? తంత్రం ఒక అతీత శక్తి. అది మంచిదీ కాదు, చెడ్డదీ కాదు. దానిని ఉపయోగించే తీరునుబట్టి దాని ఫలితం ఉంటుంది. మరీ ప్రాణం మీదకు వచ్చినపుడు మాత్రమే ఇటువంటి విద్యలను ప్రయోగించాలి గాని ఆషామాషీగా వీటిని ఎక్కడబడితే అక్కడ వాడరాదు. వీటి యొక్క ప్రయోగ, ఉపసంహార క్రియలు రెండూ మాంత్రికునికి తెలిసి ఉండాలి. లేకుంటే చేసేవానికే చాలా ప్రమాదం కలుగుతుంది."
కాబట్టి, ఆయనేదో ప్రజలను ఈ విద్యలు నేర్చుకొని ఎదుటివాళ్ళను చంపమంటున్నారనే అపవాదులు వేయటం సరికాదు. తాంత్రిక ప్రయోగాలలో ఉన్న విషయాలను పరిచయం చేస్తున్నారు అంతే.
ఇక్కడ మరో విషయం. దేవుడిని నమ్మేవాళ్ళయితే, విధిని నమ్ముతారు. ఎప్పుడు ఎలా ఎక్కడ నుంచి ప్రమాదాలు పొంచి ఉంటాయో ఊహించలేం. అందుకని, సాధకులు వారు చేసే దేవత ఉపాసనలతో వారికో రక్షా కవచం ఏర్పరచుకుంటారు. అటువంటివే, ఆ వ్యాసంలో పేర్కొన్న ఈ వాక్యం :
"శ్రీచక్ర నవావరణ పూజాతత్పరులమీదా, సమయాచార తత్పరులమీదా, అంతర్యాగపరులైనవారిమీదా ఇవి పనిచెయ్యవు. టువంటప్పుడు చేసినవానిమీదనే ఇవి విరుచుకుపడతాయి. అందుకనే విచక్షణా రహితంగా డబ్బుకోసం వీటిని ప్రయోగించేవారు చివరికి వీటితోనే ప్రాణాలు పోగొట్టుకుంటారు."
ఏ విద్యలనైనా, దురుపయోగం చేయటమనేది ఉంటుంది. మంత్ర ప్రమేయం లేకుండా, కేవలం యోగసాధనలో అతీతమైన స్థితికి చేరిన వ్యక్తి కూడా శర్మగారు చెప్పిన ప్రయోగాలు చేయగల సమర్ధుడే. అలా ఎవరైనా యోగసాధకుడు తన శక్తిని దుర్వినియోగం చేస్తే, యోగాని నిందిస్తారా? ఇంకా, దురుపయోగమౌతాయని, నేర్చుకోరాదని శాసిస్తారా?
Any ways, thanks a lot for a decent discussion. In fact, Shri Sarma gaaru is the most competent person I have seen in the Net. Instead of mocking at him, had he been asked decently, he would have certainly given a better answer than a novice like me.
సాయి గారు, మీరు ఇచ్చిన వివరణ బాగుంది కాని శర్మ గారికి అసహనం ఎక్కువ అని ఆయన సమాధానం చదివిన వారికి అర్థమౌతుంది.
రిప్లయితొలగించండి