"అంబేద్కర్" అన్న పేరు చాలు, మన రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించటానికి...
"అంబేద్కర్" అన్న పేరు చాలు, నిద్రాణమై ఉన్న పీడిత, తాడిత ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని రగిలించటానికి...
"అంబేద్కర్" అన్న పేరు చాలు ఆత్మగౌరవంతో దళితులు తలెత్తుకొని ధీటుగా నిలబడటానికి...
ఎవరు అంబేద్కర్? స్వాతంత్ర్య సమరయోధుడా? విప్లవ వీరుడా? మేధావా? జాతిపితగా, మహాత్మునిగా జననీరాజనాలు అందుకున్న మహాత్మా గాంధిని కూడా నేడు మరిపించేవిధంగా రగులుతున్న ఆ స్ఫూర్తి ఏమిటి? ఎన్నికలైన వెంటనే, గాంధీని ఆదర్శాల గోడలపైకి ఎక్కించేసి, పూలమాలలు వేసి దులిపేసుకుంటున్నారు. కానీ, ప్రతి రోజు, ప్రతి పూట, అంబేద్కర్ నామజపం చేయని రాజకీయ నాయకుడు ఈరోజుల్లో కనిపించడు.
ఈనాడు జాతిపితగా మనం నివాళులు అర్పించే మహాత్మాగాంధిని సైతం విచక్షణా రహితంగా విమర్శించే సముదాయాలు, అగ్రవర్ణాలవారు అంబేద్కర్ పేరును ఉచ్ఛరించటం కూడా నేరంగా పరిగణించే ఉన్మాద పరిస్థితులు ప్రస్తుతం రాజ్యమేలుతున్నాయి.
ఒక వ్యక్తిగా తను ఎదుర్కొన్న వివక్షను ప్రశ్నిస్తూ తిరుగుబాటు చేసిన అంబేద్కర్ ను, సాటి వ్యక్తిగా నేనెంతలా అభిమానిస్తానో, ఆ తిరుగుబాటు మనస్తత్వంతో ఆధునిక భారతంలో మతమార్పిడులకు శ్రీకారం చుట్టిన వ్యక్తిగా కూడా ఆయన్ను అంతే విమర్శిస్తాను. అధ్యాత్మిక వ్యాసాలు వ్రాసుకోక అంబెద్కర్ గురించి నీకెందుకని ప్రశ్నించే అనామకులే కాదు, అంబేద్కర్ గురించి వ్రాస్తే, నీ బ్లాగును ప్రభుత్వానికి నోటిఫై చేస్తామని బెదిరించే దళిత మేధావులూ నాకెదురయ్యారు. సరే, ఇదో విషయాంతరం.
ఎవరూ విమర్శలకతీతం కాదు. విమర్శలతోపాటు అభినందించదగ్గ విషయాలను కూడా ప్రస్తావించాల్సిందే. అసలు, ఆనాటి అంబేద్కర్ ఆదర్శ భావజాలానికి, ఈనాటి నియోదళితిస్టు భావజాలానికి పొంతన ఏమాత్రమూ కనిపించటంలేదు. ఆనాడు కుల వివక్షతపై అంబేద్కర్ పోరాటం మొదలేయటానికి తగిన సామాజిక పరిస్థితులు ఉన్నాయి. ఆయన పోరాటం కూడా అన్ని మతాలలోని కులవివక్షతకు వ్యతిరేకంగా మొదలయ్యిందే కానీ, వాటి ఆధారంతో కాదు. అగ్రవర్ణాలు ఆనాడు కులవివక్ష చూపించారు కాబట్టి, ఆ ఆధారంతో ఈనాడు దళితులు అగ్రవర్ణాలపై వివక్ష చూపించాలనే ప్రయత్నం ఆయన పోరాటంలో కనబడదు. ఈ పైత్యం ఇప్పుడు రెక్కలు తొడిగిన నియోదళితిస్టు భావజాలానిదే.
దళితులను ఓ సామూహిక శక్తిగా తీర్చిదిద్దింది అంబేద్కరైతే, ఆ సామూహిక శక్తిని తమ రాజకీయాలకు వాడుకునే స్వార్ధపరులు నియోదళితిస్టు నేతలు. ఏ స్వార్ధమూ లేదనుకునేట్లయితే, ఆరు దశాబ్దాలు పైబడ్డ మన స్వాత్రంత్ర్య దేశంలో ఇంకా దళితులెందుకని జనజీవన స్రవంతికి దూరంగా కొట్టుమిట్టాడుతున్నారు? అగ్రవర్ణాలతో దళితులు మమేకమైతే, అది తమ అస్తిత్వానికే ప్రమాదమని భావించే ఈ నియోదళితిస్టు నేతలే దీనికి కారణం. దళితులు ఈ జనజీవన స్రవంతిలో భాగం కావటం వారికి ఇష్టం ఉండదు. అందుకే, ఎప్పటికప్పుడు వారిని వంచించే విధంగా, అగ్రవర్ణాలతో వివాదాలు రేపుతారు. గతంలోని గాయాలను తిరగదోడుతారు. ఆఖరికి ఆ వంచన వేద పురాణేతిహాసాల వరకూ పాకుతుంది. అంతేకాదు, చెదురుమొదురుగా ప్రకటితమౌతున్న కుల వివక్షను మళ్ళీ ఆసరాగా తీసుకుంటారు.
మునుపంత కాకపోయినా, ఇప్పటికి కుల వివక్ష ఉన్నదనేది నిజం. కానీ, కుల వివక్షను చూపేవాడిని ఒక నేరస్తుడిగా గుర్తించక, వాడినో అగ్రవర్ణపు వ్యక్తిగా భావించటం వల్లే సమస్యలు పునరావృతమౌతాయి. ఒక తీవ్రవాదికి మతాన్ని అంటకట్టటంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించే మేధావులే వీళ్ళు. మరి వీళ్ళు చేసేదీ అదే.
ఆనాటి పరిస్థితుల నేపథ్యంలో, తను హిందు మతాన్ని వదిలి, బౌద్ధ మతం స్వీకరించటమే కాకుండా దళితులను కూడా సామూహిక మత మార్పిడులకు ప్రేరేపించాడు అంబేద్కర్. అప్పట్లో, హిందుమతంలోను, ఇస్లాం లోను ఉన్న కులజాడ్యాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు కానీ, మరే ఇతర కారణాలు కావు.
ఈనాడో! అర్ధికావసరాలకు క్రైస్తవాన్ని పుచ్చుకోవటమే కాకుండా, క్రైస్తవ దళితులకు కూడా రిజర్వేషనులు కల్పించాలనే దౌర్భాగ్య పరిస్థితులు దాపురించాయి. ఆ డిమాండ్లకు తలలూపే ప్రభుత్వాలు కూడా తయారయ్యాయి. ఇటువంటి డిమాండ్ల వల్ల హిందుమతంలోని కుల జాడ్యాన్ని రూపు మాపి, ఈ మతంలోని దళితులకు దక్కాల్సిన అవకాశాలని కూడ గద్దల్లా తన్నుకుపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ అంబేద్కరే ఈరోజు జీవించి ఉంటే, బహుశా మతమార్పిడి నిరోధక చట్టం కోసం పోరాడేవారేమో!
ఇక్కడ మరో కోణం కూడా గమనించాలి. అంబేద్కర్ కూడా మతాన్ని మార్చుకున్నాడే కానీ, మతం వద్దనుకోలేదు. అంటే, వ్యక్తి వికాసానికి తద్వారా సామాజిక వికాసానికి మతం అవసరమనే ఆయన కూడా ఆచరణలో చూపించారు. మరి ఈనాడో, ఆ అంబేద్కర్ వారసులుగా ప్రకటించుకుంటూ, ముఖ్యంగా హిందుమతం మీద పడి ఏడుస్తూ మతాలనేవి అనవసరం, మానవత్వమే ప్రధానమని కాకమ్మ కబుర్లు చెప్తూ, ఆచరణలో తద్విరుద్ధంగా ప్రవర్తించే కుహానా మేధావులకు ఉరిశిక్ష విధించమని బహుశా అంబేద్కర్ బ్రతికి ఉంటే సిఫార్సు చేసి ఉండేవారేమో!
ఆనాటి రాజకీయ పరిస్థితుల కారణంగా, (ముఖ్యంగా తూర్పు బెంగాలులోను, హైద్రాబాద్ లోను కొనసాగిన ముస్లీముల అరాచకత్వ నేపథ్యంలో), అంబేద్కర్ ముస్లీములందరినీ పాకిస్తాన్ కు పంపేయాలని కోరారు. అంతేకాదు, తమ మతగ్రంధాల ప్రకారం ముస్లీములు ఈ దేశాన్ని మాతృదేశంగా భావించలేరు అని కూడా ప్రకటించారు.
"థాట్స్ ఆన్ పాకిస్తాన్" అనే పుస్తకంలో ఆయన అంటారు "పాకిస్తాన్ వేర్పాటుతో హిందు-ముస్లీం వేర్పాటు తత్వం సమసిపోదు" అని. ఎంత దూరదృష్టితో ఆయన ఈమాట అన్నారో, ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే మనకు అర్ధమౌతుంది.
ముస్లీములు భారతదేశాన్ని మాతృదేశంగా భావించలేరని ఆయన ఖరాఖండీగా ఆరోజుల్లోనే చెబితే, ఈరోజుల్లో మాత్రం పోటా చట్టం ముస్లీములకు వ్యతిరేకంగా దురుపయోగమౌతుందని ఆ చట్టాని తీసిపారేస్తారు. అప్జల్ గురుకు ఉరిశిక్ష విధించినా, వాడు ముస్లీం కాబట్టి, ముస్లీం సముదాయ మనోభావాలు గాయపడుతాయి కాబట్టి ఆ ఉరిశిక్ష అమలు జరపరు. చివరికి, ఆయన వారసులుగా ప్రకటించుకునే కామెడీ మేధావులు కాశ్మీరును పాకిస్తాన్ కు ధారాదత్తం చేయమంటారు! అంబేద్కర్ ఈరోజు వరకు జీవించి ఉంటే, ఈ కామెడీ మేధావులందరిని కాల్చి పడేయమని చెప్పుండేవారేమో!
ఇవి అంబేద్కర్ ఆదర్శ భావజాలాలా? లేక కామెడీ మేధావుల నియోదళితిస్టు భావజాలమా?!
ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే, అంబేద్కర్ ఆలోచనలు, ఆదర్శాలు ఒక్క దళితులకు మాత్రమే పరిమితం చేయాల్సిన అవసరంలేదు. వ్యక్తిగా ఆయనలో ఉండే లోపాలు, ఒక వ్యవస్థగా రూపొందిన ఆయన ఆదర్శాల నేపధ్యంలో చర్చించాల్సిన అవసరం మాత్రం ఉంది. ఎందుకంటే, ఆయనకున్న ఆలోచనాత్మక, ఆచరాణాత్మక, విచక్షణాయుత దృక్ఫధం ఆయన నిలువెత్తు వ్యక్తిత్వాన్ని స్పృశించటం ఒక ఎత్తైతే, ఆ దృక్ఫధాలే ఆయన యొక్క సోకాల్డ్ వారసుల్లో లోపించటం.
ఆవకాయలో కూడా...
చాలా అద్భుతంగా రాశారు.
రిప్లయితొలగించండిఆయన్ని అవసరార్థం వాడుకునే వారే ఎక్కువ ఇవాళ!
good post!
రిప్లయితొలగించండిఇంతకూ మత మార్పిడులపై, మతం వద్దనుకునే వారిపై మీ అభ్యంతరం ఏమిటి?
రిప్లయితొలగించండిమంచి వ్యాసం, చాల బాగా రాసారు .
రిప్లయితొలగించండిఅగ్రవర్ణాలతో దళితులు మమేకమైతే, అది తమ అస్తిత్వానికే ప్రమాదమని భావించే ఈ నియోదళితిస్టు నేతలే దీనికి కారణం.
----------------------------------------------
ఒప్పుకుని తీరాల్సిన నిజం .
సాయికిరణ్ గారు నాదొక చిన్న అనుమానం అంబేద్కర్ తన చివరి దశలో తిరిగి హిందూ మతాన్ని స్వీకరించారు అని నాకు చదివిన గుర్తుంది ఇది కరెక్టేనా ?
అనామక గారు - నా వరకు మతమార్పిడులు చట్టపరంగా నిషేధించాలని భావిస్తాను. మతం వద్దు అనుకునేట్లయితే ఇక ఇబ్బందేముంది>
రిప్లయితొలగించండిశ్రావ్య గారు - అంబేద్కర్ తిరిగి హిందువుగా మారారన్న దాన్లో నిజంలేదనే అనుకుంటున్నాను. నేనైతే, ఇంతవరకూ ఎక్కడా చదలేదు.
Well said Saikiran.
రిప్లయితొలగించండి"ఎవరూ విమర్శలకతీతం కాదు. విమర్శలతోపాటు అభినందించదగ్గ విషయాలను కూడా ప్రస్తావించాల్సిందే"
రిప్లయితొలగించండిసాయికిరణ్ గారు వ్యాసం బాగుంది.
అంబెద్కర్ అణగారిన వర్గాల కొసం ఎంతగానొ పొరాడినాడొ అంతగా మార్కిజాన్ని వ్యెతిరెకించాడు అంతిమంగా ఆయన దొపిడివర్గాలకె కొమ్ముకాచాడు మతం అనెది అదిఎమతమయినా అది డొపిడీ ఉన్నంతవరకూ ఉంతుంది ఈ విషెయాలు నెను నెను కొత్తగా చెప్పెది ఎమిలెదు రంగనాయకమ్మ గారి "దళిత సమస్య పరిస్కారానికి బుద్దుడూ చాలడు ,అంబెద్కర్ చాలడూ మార్క్స్ కావాలి" పుస్తకం చదివితె తెలుస్తుంది .
రిప్లయితొలగించండిఅంబెద్కర్ అణగారిన వర్గాల కొసం ఎంతగానొ పొరాడినాడొ అంతగా మార్కిజాన్ని వ్యెతిరెకించాడు అంతిమంగా ఆయన దొపిడివర్గాలకె కొమ్ముకాచాడు మతం అనెది అదిఎమతమయినా అది డొపిడీ ఉన్నంతవరకూ ఉంతుంది ఈ విషెయాలు నెను నెను కొత్తగా చెప్పెది ఎమిలెదు రంగనాయకమ్మ గారి "దళిత సమస్య పరిస్కారానికి బుద్దుడూ చాలడు ,అంబెద్కర్ చాలడూ మార్క్స్ కావాలి" పుస్తకం చదివితె తెలుస్తుంది .
రిప్లయితొలగించండినా ఆలోచనల్లో అంబేత్కర్ లాంటి వాళ్ళుండరు. "ఆలోచింప తగని వారిగూర్చి ఆలోచించడం అనుచితము" అన్నారు, కాబట్టి. :)
రిప్లయితొలగించండిచాలా బాగా వివరించారు . ఇదే విధం గా 'అంబేద్కర్' ఆలోచనలు , ఆశయాలు గురించి ఇంకొక టపా లో రాయగలరు.
రిప్లయితొలగించండి>>>ఆరు దశాబ్దాలు పైబడ్డ మన స్వాత్రంత్ర్య దేశంలో ఇంకా దళితులెందుకని జనజీవన స్రవంతికి దూరంగా కొట్టుమిట్టాడుతున్నారు? అగ్రవర్ణాలతో దళితులు మమేకమైతే, అది తమ అస్తిత్వానికే ప్రమాదమని భావించే ఈ నియోదళితిస్టు నేతలే దీనికి కారణం.
రిప్లయితొలగించండిఅయ్యా! స్వాత్రంత్ర్య వచ్చి యిన్ని సంవత్సరాలు అయినా దళితులు అగ్రవర్ణాలతో మమేకం కాలేకపోవటానికి కొందరు అగ్రవర్ణాలవారే కారణం... కార్యాలయలలో చులకనా మాట్లాడటం... కాలేజీలలో గ్రూపులను కూడగట్టటం... మిత్రులుకదా అని వారి ఇంటికి వెళితే బయటే కూర్చోబెట్టం, పాత గ్లాసుల్లో నీరు యివ్వటం మొదలగునవి చేస్తూనే ఉన్నారు.
అంతెందుకు ఇన్ని చెపుతున్నారు మీ వరకు మీరు ఓ దళితుణ్ణి మనస్పూర్తిగా అదరిస్తారా!!!
>> మిత్రులుకదా అని వారి ఇంటికి వెళితే బయటే కూర్చోబెట్టం, పాత గ్లాసుల్లో నీరు యివ్వటం మొదలగునవి చేస్తూనే ఉన్నారు.
రిప్లయితొలగించండిI guess this happens in the case of an Upper Caste fellow also. Even if a brahmin goes to another brahmin's house, he would face the same situation. And it's intention is not to belittle a person. Just a custom
సోదరా నేను చాలా సందర్భల్లో భాదపడ్డ విషయాలపైన నేను అనుకున్నట్టు రాశారు... ముఖ్యంగా మతం వేరు కులం వేరు కానీ దలిత క్రిష్టియన్లకు ఎసి రిజర్వేషన్లు కావాలంటున్నారు. క్రిష్టియన్ అనేది ఒక మతమైనప్పుడు మళ్లి కుల ప్రతిపదికన రిజర్వేషన్లు ఎట్లా అడుగుతారు. అట్లా అడగడమంటే అసలైన , అమయకులైన దళితులను వంచించడం కాదా... దీని పైనా లోతైనా చర్చ జరగాలి.. అసలైనా నాయకులకు న్యాయం జరగాలని ఆశిద్దం.
రిప్లయితొలగించండి"కుల వివక్షను చూపేవాడిని ఒక నేరస్తుడిగా గుర్తించక, వాడినో అగ్రవర్ణపు వ్యక్తిగా భావించటం వల్లే సమస్యలు పునరావృతమౌతాయి. ఒక తీవ్రవాదికి మతాన్ని అంటకట్టటంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించే మేధావులే వీళ్ళు. మరి వీళ్ళు చేసేదీ అదే."
రిప్లయితొలగించండిమీరన్నది నిజం.ఇహ మతమార్పిదులమీద మీ అభిప్రాయంతో నేను ఎకీభవించలేకున్నాను. ఏ మతాన్ననుసరించాలి అనేది personal choice కదా దాంట్లోకి ప్రబుత్వ జోక్యమెందుకు?
@రామమొహన్ గారు: ఈ పుస్తకాన్ని చదివే ప్రయత్నమైతే చేశాను. ఇంత సీరియస్ విషయాన్ని తన ఎందుకూకొరగాని అపహాస్యంతో పాడుచేశారావిడ. హాస్యం అన్నివేళలా సరియైనది కాదు అని ఆవిడకెవరైనా సర్దిచెబితే బాగుండు.
You must read this book. You can get this book from flipkart.
రిప్లయితొలగించండిhttp://www.breakingindia.com/?page=videos&playlist=84946D0C3A116B00
http://www.boloji.com/index.cfm?md=Content&sd=Articles&ArticleID=10807