నియోదళితిస్టు భావజాలం వెర్రితలలు వేస్తూ దేశాన్ని ప్రమాదపుటంచులకు తీసుకెళుతున్న ప్రస్తుత తరుణంలో అంబేద్కర్ ఆలోచనలను, ఆశయాలను విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉంది. గాంధీ బొమ్మను వాడుకునే కాంగ్రెస్ తీరులోనే, ఈ నియోదళితిస్టు మేధావులు కూడా అంబేద్కర్ ను బొమ్మల వరకు, విగ్రహాల వరకు మాత్రమే పరిమితం చేసారు. వీరికి ఆయన ఆశయాలు, ఆలోచనలపై ఉన్న గౌరవం కన్నా, ఆయన బొమ్మలపై ఉన్న నమ్మకమే మెండు. వాళ్ళ రాజకీయావసరాలు తీర్చేది ఆయన ఆశయాలు కాదుగా!
ఆయన ఆశయాలు, ఆలోచనల గురించి నాకర్ధమైనంతలో విశ్లేషించే ముందర, ఆయనలో నాకు నచ్చని కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావిస్తాను :
1. వివక్షకు గురౌతున్న దళితులలో చైతన్యం తీసుకురావటానికి, ఆయన మతమార్పిడులు ఓ సాధనంగా చేసుకోవటం ఓ విడ్డూరం.
2. అందుకు గాను, హిందువులు పరమ పవిత్రంగా భావించే పురాణేతిహాసాలపై అడ్డదిడ్డమైన వ్యాఖ్యానాలు వ్రాయటం ఇంకా విచారకరం. ఆయన ఎన్నో చదువులు చదివి ఉన్నా, సంస్కృత భాషపై ఆయనకున్న అవగాహనా రాహిత్యం ఆశ్చర్యపరుస్తుంది.
3. శతాబ్దాలుగా అణగదొక్కబడిన నిమ్నజాతులవారి అభ్యుదయానికి కేవలం 10 సంవత్సరాలు మాత్రమే రిజర్వేషనులు సరిపోతాయనే ఆయన అభిప్రాయం కూడా మరింత ఆశ్చర్యపరుస్తుంది.
ఇక అసలు విషయానికి వద్దాం.
ఆయన జీవితాశయమల్లా ఒక్కటే. నిమ్న జనోద్ధరణ. తన జీవితం మొత్తం ఆ ఆశయానికి ధారపోసిన అంబేద్కర్, ఈనాటి నియోదళితిస్టు మేధావుల్లాగా తననో నవతావాదిగానో, మానవతావాదిగానో టముకు వేసుకోలేదు. దేశానికి స్వాతంత్ర్యం కన్నా, ముందుగా నిమ్నజాతుల స్వాతంత్ర్యమే ముఖ్యమనే స్థాయిలో ఆయన తన ఆశయ సాధనకు కృషిచేసారు. దాని పర్యవసానంగా స్వాతంత్ర్యోద్యమంలో చీలికలు కూడా తీసుకురావటానికి బ్రిటీషు ప్రభుత్వం ప్రయత్నించినా ఆయన తన వైఖరిని మార్చుకోలేదంటే, నిమ్న జనోద్ధరణకు ఆయన ఎంత అంకితమయ్యారనేది అర్ధమౌతుంది. "లోక విరోధి"గా ఆయన్ను భావించినా, "యధార్ధవాది"గానే మిగిలిపోదామనుకున్న వ్యక్తిత్వం ఆయనది. ప్రస్తుత నియోదళితిస్టుల్లో ఏరి "యధార్ధ వాదులు... లోక విరోధులు"!!
ఆయన ఆలోచనల గురించి చర్చించుకునేప్పుడు, ముఖ్యంగా ప్రస్తావించాల్సిన విషయం మన మొట్టమొదటి "రాజ్యాంగ పీఠిక" అందులో దేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగానే అభివర్ణించారు. కుల మత జాడ్యాలు విపరీతంగా ఉన్న ఆ రోజుల్లో, ఎన్నో చదువులు చదివిన అంబేద్కర్ కు, ఇతర రాజ్యాంగ సభ సభ్యులకు "సెక్యులర్" (లౌకిక) అన్న పదమే తెలియదు అనుకోవాలా? మన రాజ్యాంగానికి మత ప్రస్తావన పులమకూడదని భావించారా? లేక, అప్పటి నేతల పరిపాలనలో లౌకిక స్ఫూర్తికి వచ్చే ఇబ్బందేమీ ఉండదన్న నమ్మకమా? రాజ్యాంగంలో మతాధారిత రిజర్వేషనులు ఉండరాదని నిర్దేశించిన రాజ్యాంగసభ, "లౌకిక" అన్న పదాన్ని మొట్టమొదటి రాజ్యాంగ పీఠికలో చేర్చకపోవటం వెనుక కారణం ఏమై ఉంటుంది? బహుశా, ప్రత్యేకించి కొన్ని మతాల కోసం రూపొందించబడిన వేరువేరు యాక్టుల వలన, "లౌకిక" అన్న పదం వాడటం సమంజసం కాదని భావించి ఉండవచ్చు.
ఆ తర్వాత, 1976 లో దేశంలో అత్యయిక పరిస్థితుల మధ్య, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాజ్యాంగ పీఠికకు మార్పులు చేసి, మన దేశాన్ని "సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య దేశంగా" మార్చివేసింది. అంటే, రాజ్యాంగం అమలులోకి వచ్చిన దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత దేశంలో సామ్యవాద, లౌకిక స్ఫూర్తి దెబ్బతిన్నదని భావించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సవరణలు చేపట్టిందని భావించాలేమో! అదే నిజమైతే, అన్ని సంవత్సరాలూ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా! సామ్యవాద, లౌకిక స్ఫూర్తులు దెబ్బతినటానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలేనని ఒప్పుకున్నట్లే కదా!
ఇది విషయాంతరమైనా, కాంగ్రెస్ కుత్సిత రాజకీయాలను ఎత్తి చూపే సందర్భం. కాబట్టి, దీనిపై కూడా సరైన చర్చ జరగాలి.
ఏదేమైనా, అంబేద్కర్ ఆశించిన స్ఫూర్తికి విరుద్ధంగా మన ప్రభుత్వాలే కాదు, ఇప్పటి నియోదళితిస్టు భావజాల పరంపర కూడా కొనసాగుతున్నదని, అది క్షేమకరం కాదని నిర్ధారించవచ్చు.
అయ్యా! తమరు దళితజనోద్ధారకులా లేక అంబేద్కర్ గారి పై రీసెర్చ్ చేస్తున్నారో తెలియటం లేదు. దళితజనోద్ధారకులైతే బ్లాగుల్లో కాదు జనాల్లోకి రండి...
రిప్లయితొలగించండిGood article Kiran.
రిప్లయితొలగించండి@ Anonymous....before challenging, please put up your challenge with some identity :))
సాయికిరణ్ గారు,
రిప్లయితొలగించండిమీరు చెప్పింది నిజమే. ఆ పైన అంబేడ్కర్ని అందరిలా ఆకాశానికెత్తయ్యకుండా విమర్శించడానికి కూడా మీరు పూనుకోవడం ఒక మంచి పరిణామం. అంబేడ్కర్ ప్రస్తుత దళిత నాయకుల కంటే దూర దృష్టి, తెలివి తేటలు ఉన్న వాడే, కానీ మీరు ఆయన్ని మరీ పైకి కూడా లేవనెత్తకండి. :-) He is not all that he is made out to be as has been clearly demonstrated by Arun Shourie in his book, "Worshipping the false Gods". If you don't have the time to read that tome, at least read the following interview by Arun Shourie.
http://www.rediff.com/news/aug/23arun.htm
-మురళి
>>శుచి, శుభ్రత, నియమం,
రిప్లయితొలగించండినిష్ట, నిజాయితీ, నమ్మకం ఇవి ఏ సాధనకైనా అవసరమైనవే.
పంచవటి లో నీతులు, మరి ఇక్కడ ...
:))
రిప్లయితొలగించండి"శుచి, శుభ్రత, నియమం, నిష్ట, నిజాయితీ, నమ్మకం" వీటికి ఈ వ్యాసంలో వచ్చిన ప్రమాదమేమిటి అనామకులు గారు?
Thanks for the link Murali gaaru.
రిప్లయితొలగించండి