Since some of the well wishers find the title to be offensive, I am changing the title and re-posting it.===
మన ఇతిహాస పురాణాలలోని సామాజిక కట్టుబాట్లను అదేపనిగా విమర్శించే కామెడీ మేధావులు మనకు మనం వ్రాసుకున్న రాజ్యాంగమనే కట్టుబాటును విమర్శిస్తే ఎందుకో తట్టుకోలేరు. దేవుడు లేడు, భక్తి ముక్తి అంతా ట్రాష్ అనే హేతువాద నాస్తికోన్మాదులు రాజ్యాంగాన్ని విమర్శిస్తే, ఆ విమర్శించినవాడికి దేశభక్తి లేదని తీర్మానిస్తారు! సరే, ఇదో విషాయంతరం కాబట్టి దాని గురించి ప్రస్తుతం వాదించటంలేదు.
మన ఇతిహాస పురాణాలలోని సామాజిక కట్టుబాట్లను అదేపనిగా విమర్శించే కామెడీ మేధావులు మనకు మనం వ్రాసుకున్న రాజ్యాంగమనే కట్టుబాటును విమర్శిస్తే ఎందుకో తట్టుకోలేరు. దేవుడు లేడు, భక్తి ముక్తి అంతా ట్రాష్ అనే హేతువాద నాస్తికోన్మాదులు రాజ్యాంగాన్ని విమర్శిస్తే, ఆ విమర్శించినవాడికి దేశభక్తి లేదని తీర్మానిస్తారు! సరే, ఇదో విషాయంతరం కాబట్టి దాని గురించి ప్రస్తుతం వాదించటంలేదు.
సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా మనలని మనం ప్రకటించుకుని అరవై ఏళ్ళు దాటింది. ఆరు దశాబ్దాల మన రాజ్యాంగం కొందరు మేధావులకు రామాయణం కన్నా పవిత్రమైనదైతే, కొందరికి అదో అతుకుల బొంత, మరికొందరికి అదో కుప్పతొట్టి. సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించుకోవటంతో సంతృప్తి చెందక, 1976కల్లా సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య దేశంగా మారిపోయాం.
మన రాజ్యాంగం విమర్శలకు అతీతమా? వందకోట్లకు పైగా ఉన్న భారతీయులకు ఈ రాజ్యాంగం నిజంగానే మార్గదర్శక సూచికా? ఏమిటి ఆ గొప్పదనం?
ముందస్తుగా కామెడీ మేధావుల అనుచరులకు నావో రెండు ముఖ్యమైన గమనికలు.
1. రాజ్యాంగాన్ని విమర్శిస్తున్నానంటే, డా. అంబేద్కర్ ను విమర్శిస్తున్నానని అపోహ పడవద్దు. నా వరకు, ఈ రాజ్యాంగానికి రూపకల్పన చేసింది ఒక్క అంబేద్కర్ కాదు. రాజ్యాంగసభలోని దాదాపు 400 మంది సభ్యులు. కాబట్టి, రాజ్యాంగాన్ని పొగిడినా, తెగిడినా అది వారందరి సమిష్ట కృషిని మాత్రమే.
2. నేను రిజర్వేషనులకు వ్యతిరేకం కాదు. కొన్ని శతాబ్దాలపాటు వివక్షకు గురైన దళితులకు, కేవలం పది సంవత్సరాల రిజర్వేషనులు చాలని చెప్పిన అంబేద్కర్ భావాలతో నేను ఏకీభవించను. నా ఉద్దేశ్యంలో, కనీసం నాలుగైదు తరాలపాటు చిత్తశుద్ధితో ఈ రిజర్వేషనులను అమలుచేస్తే కానీ, దళితప్రజలు భారత జనజీవన స్రవంతిలో భాగం కాలేరు.
* * *
ఇక, అసలు విషయానికి వద్దాం. అన్నం ఉడికిందో లేదో తెలియటానికి ఒకట్రెండు మెతుకులు చూస్తే చాలు. కాబట్టి, మన రాజ్యాంగానికి ముఖ్యమైనవిగా భావించే కొన్ని విషయాలపైన మాత్రమే నా వ్యాసం ఉంటుంది.
రాజ్యాంగపు ముందుమాటలో (preamble) మనని మనం సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించుకున్నాం. అసలు మనది ఏవిధంగా సర్వసత్తాక దేశం? ఏనాడు ఒక సర్వసత్తాక దేశంగా మనం ప్రవర్తించాం?
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పరిపత్తి కల్పించటం సర్వసత్తాక ప్రజాస్వామ్య లక్షణమా?
రాష్ట్రాల మధ్య వివాదాలని పరిష్కరించలేక, న్యాయస్థానాలే సమస్యలను పరిష్కరించాలని సూచించటం ఏరకంగా సర్వసత్తాక ప్రజాస్వామ్య లక్షణం? చట్టసభలకన్నా, న్యాయస్థానాలే సమస్యలు పరిష్కరించగలవనుకుంటే, మనకీ అసెంబ్లీలు, పార్లమెంటులు దేనికి? ఆ బాధ్యత కూడా న్యాయస్థానాలకే అప్పగించవచ్చు కదా!
అంతర్జాతీయంగా చూసినా, సర్వసత్తాక దేశంగా మన ప్రవర్తన :
• తీవ్రవాదుల దాడులు జరిగిన ప్రతిసారీ, పాకిస్తాన్ ను వేలెత్తి చూపించటం వరకేనా? పాకిస్తాన్ పై అంతర్జాతీయ ఆంక్షలు విధించాలని అమెరికాను దేబిరించటమా? ఒక సర్వసత్తాక దేశంగా మనం ఎందుకని ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నాం? ఏ ఆంక్షలు అంతర్జాతీయ సమాజం విధించాలని ఆశిస్తున్నామో, ఆ ఆంక్షలు మనం ఎందుకు విధించలేకపోతున్నాం? తీవ్రవాదుల దాడులు జరిగిన వెనువెంటనే పాకిస్తాన్ తో సంబంధాలు తెంచుకుంటున్నాం. సంవత్సరం తిరగకుండానే, పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలు మెరుగు పరచుకోవాలని అదే పాకిస్తాన్ ను మళ్ళీ దేబిరిస్తున్నాం? ఇదా మన సర్వసత్తాక సార్వభౌమత్వం?
• అరుణాచల్ ప్రదేశ్ ను పకడ్బందీ వ్యూహంతో చుట్టుముట్టుతున్న చైనా చొరబాటును, ఆ దేశ రాయబారిని పిలిచి ఖండించటం వరకేనా?
• ఇరాక్ పై అమెరికా మారణహోమాన్ని నామమాత్రంగా ఖండించటం వరకేనా?
ఇవి ప్రస్తుతానికి సంబంధించిన విషయాలే. చరిత్రలో తొంగిచూస్తే, ఇంతకు మించిన దారుణమైన ఉదాహరణలు మనకు లభిస్తాయి.
కాశ్మీర్ సమస్యను ఐ.రా.స. వరకు చేర్చి దేశ సర్వసత్తాక సార్వభౌమత్వాన్ని నెహ్రూ ఆనాడే నవ్వులపాలు చేస్తే, ఆ తర్వాత బంగ్లాదేశ్ విముక్తిపోరాటంలో చేతికి చిక్కిన దాదాపు 50 వేలమంది పాకిస్తాన్ సైనికులను నోబెల్ శాంతి బహుమతి కోసం పాకిస్తాన్ కు తిప్పిపంపింది ఇందిరాగాంధి. ఆనాడే, పాకిస్తాన్ సైనికుల బదిలీకి కాశ్మీరులో పాకిస్తాన్ చొరబాటును అడ్డుపుల్లగా వాడుకోలేదెందుకు?
అయ్యా ఇది, భారత సర్వసత్తాక సార్వభౌమాధికారం. చివరికి నేపాల్ కూడా మనకు పక్కలో బల్లెంగా మారిపోతుంటే చేతులు ముడుచుకు కూర్చుంటున్నాం.
ఇలాగే, మనం ఘనంగా అభివర్ణించుకున్న సామ్యవాద ప్రజాస్వామ్యమైనా, లౌకిక ప్రజాస్వామ్యమైనా మేడిపండ్లే.
* * *
"WE, THE PEOPLE OF INDIA, having solemnly resolved to constitute India into a SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC and to secure to all its citizens:
JUSTICE, social, economic and political;
LIBERTY of thought, expression, belief, faith and worship;
EQUALITY of status and of opportunity; and to promote among them all
FRATERNITY assuring the dignity of the individual and the unity and integrity of the Nation;
IN OUR CONSTITUENT ASSEMBLY this twenty-sixth day of November, 1949, do HEREBY ADOPT, ENACT AND GIVE TO OURSELVES THIS CONSTITUTION."
దేశ పౌరులందరికీ, న్యాయం, స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం కల్పిస్తామని చాటుకుంటూ రూపొందించిన రాజ్యాగం మనది. వీటిలో ఏ ఒక్కటైనా సరిగా అమలులో ఉందా? ఉదాహరణకు సమానత్వాన్ని పరిశీలిద్దాం. సమానత్వమే ఎందుకంటే, మన రాజ్యాంగ హిపోక్రసీని చాటిచెప్పే మహత్తరమైన పదం ఇది.
రాజ్యాంగపు ముందుమాటలో అందరికీ సమాన అవకాశాలు అన్నారు. అదే రాజ్యంగంలోని లోపల పేజీల్లో రిజర్వేషనుల కేటాయింపులు ఉండాలని చెప్పారు. (నేను రిజర్వేషనుల వ్యతిరేకిని కాదని మరోసారి కామెడీ మేధావుల అనుచరులకు మనవి).
లోపల చెప్పిన విషయాలకు, పైన వేసిన సమానత్వపు ముసుగు ఎందుకు? ఒక వైపు కొందరికి ప్రత్యేక కేటాయింపులు (సామాజిక సందర్భం ఏదైనా గానీ) చేస్తూ, అందరికీ సమాన అవకాశాలు అని మనని మనం మోసం చేసుకోవటం దేనికి? ఇది హిపోక్రసీ కాదా?
నిమ్నజనోద్ధరణకు వెసులుబాటు కల్పించిన రాజ్యాంగాన్నే అలుసుగా తీసుకొని, అధికారికంగాను, అనధికారికంగాను మతాధారిత రిజర్వేషనులకు కూడా పాల్పడుతూ, వాటిని చట్టసభలకు కూడా అడ్డు అదుపూ లేకుండా విస్తరిస్తూ, ఇంకా సమానత్వమని చెప్పుకోవటంలోని ఔచిత్యం ఏమిటి? నాకు రాజకీయాలపై అవగాహన కలుగుతున్నప్పటి నుంచి, గుంటూరు ఒకటో అసెంబ్లీ నియోజకవర్గం మైనారిటీలకు కేటాయించబడింది. నేను మైనారిటీ మతానికి సంబంధించినవాడిని కాకపోవటం వల్ల, నా నియోజకవర్గానికి ప్రతినిధిగా నిలబడటానికి కూడా నాకు అర్హత లేకపోతే, ఇంకెక్కడి సమానత్వం?
వ్యవసాయ ప్రధానమైన దేశం మనది. ఒక వ్యాపారికి ఉన్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఈ వ్యవసాయ ప్రధాన దేశంలోని రైతులకు ఎందుకు లేవు? ఆంధ్రప్రదేశ్ లో ప్రత్తి పండించే రైతు, తనకు అనుకూలమైన ధర దొరుకుతున్నా, మరో రాష్ట్రంలో అమ్ముకోలేని దుస్థితి మన దేశంలో ఉంది. ఇదొక కోణమైతే, మరో కోణం చూడండి. పెప్సీలు, కోక్ లు తమ తమ వస్తువులకు తమకిష్టమైన ధరలు నిర్ణయించుకోవచ్చు. మరి ఓ రైతు తన పంటకు తానే కనీస గిట్టుబాటు ధరను నిర్ణయించుకునే పరిస్థితులు ఎందుకు లేవు? ఇదా మన రాజ్యాంగం కల్పించిన సమాన అవకాశాల అర్ధం?
ఇలా చెప్పుకుంటూ పోతే సవాలక్ష అవలక్షణాలతో కూనారిల్లే మన రాజ్యాంగం మీద, మన ప్రజాస్వామ్యం మీద పుస్తకాలే వ్రాయొచ్చు. ఏదేమైనా, అతుకుల బొంత లాంటి మన రాజ్యాంగం దాదాపు నాలుగువందల సోకాల్డ్ మేధావుల పుణ్యమా అని మన మీద రుద్దబడుతున్నది. ఇప్పటికే వందకు పైగా సవరణలతో అమలౌతున్న మన రాజ్యాంగం మరెన్ని సవరణలకు గురౌతుందో చెప్పలేం. ఇన్నిన్ని సవరణలతో ఈ రాజ్యాంగం మనకు అవసరమా?
సాయి కిరణ్ గారు,
రిప్లయితొలగించండిమీ సునిశిత విశ్లేషణ తో చాలా ప్రశ్నలు వేశారు. వాటికి జవాబులు చాలా వరకు దుర్లభం.
Sai garu...!! Very much valid concerns ... where as we dont get any of the answers for those queries...!! Well written as well...
రిప్లయితొలగించండిమీరు bulletted list లో రాసిన వాటిని మినహాయిస్తే మిగతావన్నీ relavent గానేవున్నాయి (అవి మాత్రం మన ఘనత వహించిన ఆయా ప్రధానులు వ్యవహరించిన తీరులో లోపాలని అనుకుంటున్నాను). సమానత్వంలో reservations అనేవి ఒక exception కదా ఇంతకీ మీరు సమర్ధిస్తూనే దాన్ని విమర్శించారన్నమాట :). రైతుకు తన పంటను ఇతరరాష్ట్రాల్లో అమ్ముకొనే హక్కులేదా? ఒకవేళ లేకపోతే దాని లక్షిత ప్రయోజనమేంటి? గిట్టుబాటు ధరను ప్రభుత్వం అజమాయిషీ చేయడం బహుశా అవి నిత్యావసర వస్తువులు (చాలా వరకు) కాబట్టి కావచ్చు. రైతుకు జరిగే అన్యాయాన్ని ప్రత్యక్షంగా రాజ్యాంగానికి ముడిపెట్టలేమేమో. ఏమో...
రిప్లయితొలగించండిఇంతేనా! ఏదో చెప్తారనుకున్నా లేండి. :)
రిప్లయితొలగించండి1) మీరు కులా ధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకం కానప్పుడు, అవి మతా ధారితమైతేనేమి? వర్ణ, జాతి ఆధారితమైనవి ఐతేనేమి? వాస్తవంగా వివక్షకు గురైన , చేసిన వారు ఇద్దరూ ఇప్పుడు బ్రతికి లేరు. సచ్చినోళ్ళు, సచ్చినోళ్ళకు మధ్య జరిగిన వివక్షకు, ఇప్పుడు బ్రతికినోళ్ళ మధ్య అప్పగింతలు/ప్రతీకారకోటాలు జరగాలనుకోవడమనే ఆలోచన రావడమే ఆ మేధావుల మహత్తర మేధోపాసనకు నిదర్శనం.:P
2) సర్వసత్తాక అని ఆ దొరికిన 50వేలమందిని డిక్కీలో తొంగోబెట్టి పంపడం కన్నా మీరన్నట్టు బేరాలాడుకోడానికి వాడుకుని వుండవచ్చు. కాని ఆవైపు వున్నది సర్వ చెత్తాక మిలిటరీస్వామయ్మమనే విషయాన్ని మీరు మరిచిపోయినట్టున్నారు. కార్గిల్లో పోయిన తమ సైనికుల శవాలనే, ఐడెంటిటీ కార్డులతోబాటు చూపినా మావి కావు పొండహే అన్న సత్తాకము వారిది. పిచ్చికుక్కలపై సత్తాకము ప్రదర్శించటం పుడంగుల లక్షణము కాదు. :) ఇరాక్, అఫ్ఘాన్లలో అమెరికా వారి సత్తాకము వాళ్ళ ఎకానమీని చైనాముందు మోకరిల్లి, కనీసం 20ఏళ్ళు పడుకునేలా చేసిందని పుడంగులకు తెలియనిది కాదు.
3) గిట్టుబాటుధరలు అంటే సపోర్టింగ్ ప్రైస్ అని. అంతకన్నా ఎక్కువధరలకు ఎవరైనా కొంటామంటే రైతులు అమ్ముకోవచ్చు. లేదంటే రైతులు ఇళ్ళలో దాచుకోవచ్చు. ప్రజలు ఆహారధాన్యాలకొరత లేకుండా చూడటం ప్రభుత్వ రాజ్యాంగబద్ధమైన భాద్యత. మద్దతుధరలు రాజ్యాంగంలో రాసివుండరనుకుంటా, అలాఇతే ఏ రూపాయకో 10కిలోల బియ్యం వచ్చేవి. మీరు రెఫర్ చేసిన రాజ్యాంగం అంబడిపూడి వారి ప్రచురణ అయ్యుంటుందేమో ఓసారి చూసుకోండి. :D
ఇండియన్ మినార్వా గారు
రిప్లయితొలగించండిఆయా ప్రధానులు వ్యవహరించిన తీరులో లోపాలుగా వాటిని కొట్టేయ కూడదు. ఎందుకంటే, రాజ్యాంగంలో సూచించిన సర్వసత్తాక సార్వభౌమత్వ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఉన్నవి వారి వ్యక్తిగత విధానాలు కావు. వారు రాజ్యాంగబద్ధంగా ఎన్నికకాబడ్డ ప్రజాప్రతినిధులు. ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నప్పుడు ఈ రాజ్యాంగం ఏం చేయగలుగుతున్నది?
అలాగే, రైతుకు జరిగే అన్యాయం కూడా. అందరికీ సమాన అవకాశాలన్నప్పుడు రైతుకు మాత్రం మినహాయింపు దేనికన్నది నా ప్రశ్న. అంతేకానీ, మూర్ఖంగా శంకర్ అనుకుంటున్నట్లు రైతులకు రాజ్యాంగం ధరలు నిర్ణయించాలని చెప్పటంలేదు.
సాయి కిరణ్ గారూ,
రిప్లయితొలగించండినిజంగా చెప్పాలంటే, వ్యాసంలో చాలా అస్పష్టత ఉందనిపిస్తుందండీ. మీరేమైనా తొందరలో రాశారేమో, కొద్దిగా సమయం తీసుకొని రాసుంటే బావుండేదనిపిస్తుంది. వ్యాసం చాలా నిరాశ కలిగించిందని చెప్పగలను. కాకపోతే, నేనాశించినట్లే అన్నీ ఉండాలనుకోవడ సరికాదేమో! మీ వ్యాసం దృష్టిలోనే పరిశీలించడానికి ప్రయత్నిస్తా.
సరే విషయానికి వస్తే, మీరు లేవనెత్తిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలని పరిశీలిద్దాం.
>>ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పరిపత్తి కల్పించటం సర్వసత్తాక ప్రజాస్వామ్య లక్షణమా?
ఇదికేవలం ఏవొ కొన్ని పడికట్టు పదాలతో చేసే మాయాజాలం లా కనిపించడం లేదూ! మీలాంటి సీరియస్ మేధావులు కూడా ఇలా చేస్తే ఎలా? :) Just Kidding..
ఫెడరల్ స్ఫూర్తికీ, లేదా యూనిటరీ స్ఫూర్తికీ సార్వసత్తాక ప్రజాస్వామ్య లక్షణాలకీ సంబంధం ఏంటి? ఏదేశమైనా తన అవసరాలకి సరిపోయినంత ఫెడరల్ లక్షణాలనీ, యూనిటరీ భావాలనీ ఏర్పరుచుకుంటుంది. సరే, పైకి కనిపించే మాయాజాలాన్ని వదిలి, మీరు చెప్పాలనుకున్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఆర్టికల్ 370 గురించి మీ విమర్శ అనిపిస్తుంది. ఒకవేళ అదే గనుక అయితే తప్పకుండా దానిమీద చర్చ చేద్దాం.
>>రాష్ట్రాల మధ్య వివాదాలని పరిష్కరించలేక, న్యాయస్థానాలే సమస్యలను పరిష్కరించాలని సూచించటం ఏరకంగా సర్వసత్తాక ప్రజాస్వామ్య లక్షణం?
రేండు రాష్ట్రాల మధ్య సమస్యలుంటే ఎవరి వాదన రాజ్యాంగబద్దంగా ఉందో కోర్టులు నిర్ణయించడంలో నాకేమీ అభ్యంతరపెట్టాల్సిన విషయం కనిపించడం లేదు. రాజకీయ పార్టీలు సరిగ్గా పని చేయనప్పుడు, ఉన్న చట్టాలని అమలు చేసే పనికూడా కొన్నిసార్లు కోర్టులే చేపట్టవలసి రావడం ఖచ్చితంగా సమస్యే, అయితే ఇది రాజ్యాంగానికి సంబందించిన సమస్య ఎలా అవుతుంది? ఒకరకంగా చూస్తే మనదేశంలో, చట్టసభలకీ, న్యాయవ్యవస్థకీ, పరిపాలనా వ్యవస్థకీ, రక్షణ వ్యవస్థకీ మధ్య చాలా చక్కని సమతుల్యత ఏర్పరచ గలగడం మన రాజ్యాంగ పరిణతినే సూచిస్తుంది కదా! ఒక్కసారి చుట్టూ చూడండి. ఎన్ని దేశాలు ఈ సమతుల్యత లేక కిందా మీదా పడుతున్నాయో.
>>మరి ఓ రైతు తన పంటకు తానే కనీస గిట్టుబాటు ధరను నిర్ణయించుకునే పరిస్థితులు ఎందుకు లేవు? ఇదా మన రాజ్యాంగం కల్పించిన సమాన అవకాశాల అర్ధం?
ఇక్కడ మీ సమస్య రాజ్యాంగం కల్పించిన సమాన అవకాశాలతో కాదుకదా! రైతులకు సంబంధించిన పాలనా పరమైన విధాన నిర్ణయాలు సరిగ్గా లేవనే దాన్ని చూపించి ఏకంగా రాజ్యాంగ సిద్ధాంతాలనే సరైనవి కావన్నట్లు చిత్రీకరించడం ఏవిధంగా సమర్ధనీయమో మీరే చెప్పాలి. ఇది ఎలా వుందంటే, కొంతమంది భారతీయులు లంచగొండులైనంత మాత్రాన, మన మొత్తం సంస్కృతినీ, మత భావాలనీ సరైనవి కావు అన్నట్టుగా ఉంది.
>>ఇప్పటికే వందకు పైగా సవరణలతో అమలౌతున్న మన రాజ్యాంగం మరెన్ని సవరణలకు గురౌతుందో చెప్పలేం. ఇన్నిన్ని సవరణలతో ఈ రాజ్యాంగం మనకు అవసరమా?
దేశ ప్రజల ఉమ్మడి ఙాన సంపద మీద నమ్మకమే పునాదిగా మన వ్యవస్థని నిర్మించారు అనిపిస్తుంది. అందుకే పరిస్థితులనుబట్టి సమాజంలో మారే విలువలను బట్టి మార్చుకునే వీలు ఉండడం నా దృష్టిలో చాలా చక్కని వెసులుబాటుగా అనిపిస్తుంది. చాలా మంది అనుకునేట్టు, అనేక సవరణలు జరగడమనేది, సిగ్గుపడాల్సిన విషయంగా కన్నా, మనలో మార్పునీ ఆధునికీకరణనీ ప్రోత్సాహించే అంశంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో నిర్ధారించిన విలువలనే యుగయుగాలకీ, తరతరాలకీ పరమ పవిత్రమైనవిగా చూడాల్సిన పరిస్థితిని తప్పించుకోవచ్చు. కాకపోతే ఈ వెసులుబాటుని ఎలా ఉపయోగించుకుంటున్నాము అనేది ఒక జాతిగా మనందరి మీదా ఆధారపడి ఉన్న విషయం.
Hello Weekend Politician gaaru -
రిప్లయితొలగించండిఇదికేవలం ఏవొ కొన్ని పడికట్టు పదాలతో చేసే మాయాజాలం లా కనిపించడం లేదూ! మీలాంటి సీరియస్ మేధావులు కూడా ఇలా చేస్తే ఎలా? :) Just Kidding..
ఫెడరల్ స్ఫూర్తికీ, లేదా యూనిటరీ స్ఫూర్తికీ సార్వసత్తాక ప్రజాస్వామ్య లక్షణాలకీ సంబంధం ఏంటి? ఏదేశమైనా తన అవసరాలకి సరిపోయినంత ఫెడరల్ లక్షణాలనీ, యూనిటరీ భావాలనీ ఏర్పరుచుకుంటుంది.
===
ఈ అస్పష్టతకు కారణం సర్వసత్తాక అన్న పదం, దాన్ని అర్ధం చేసుకునే విధానం వలన. బహుశా ఆంగ్లంలో చెబితే అస్పష్టత కొద్దిగా తొలుగుతుందేమో...
What I understand by the word Sovereignty is - It implies a single pervasive authority. Who is that authority in our federal structure? Is it not the Central Government. These governments, conveniently pass the buck to Courts when they can't take a decision. At the same time, take their own time in implementing the Orders issued by the Courts. Refer Afzal Guru's case.
ఇక మిగతా వ్యాఖ్యల విషయానికి వస్తే, నేను ఉదహరించిన సమస్యలన్నీ మన పరిపాలనా విధానంలో ఉన్న లోపాలే అంటున్నారు. దానర్ధం, మన రాజ్యాంగం ఎంతో పకడ్బందీగా చేసారని భావిద్దామా? మరి అలా పకడ్బాందీగా చేయబడ్డ రాజ్యాంగా ఇన్నేసి పరిపాలనా లోపాలను ఏవిధంగాను అడ్డుకోదే! కాసేపాగితే, ఈ రాజ్యాంగం సాధారణ పౌరులకే గానీ, ప్రభుత్వాలకు కాదనేట్లున్నారు మీరు :))
రిప్లయితొలగించండిyou have mentioned the preamble of the constitution in your post. it is surprising that you are mentioning Central government as the sovereign.
రిప్లయితొలగించండిIndian constitution vests the paramount power in the people of India. That is the thing I am proud of. The people of this country and their collective conscience is the sovereign power which determines the direction we need to take.
you have mentioned the preamble of the constitution in your post. it is surprising that you are mentioning Central government as the sovereign.
రిప్లయితొలగించండిIndian constitution vests the paramount power in the people of India. That is the thing I am proud of. The people of this country and their collective conscience is the sovereign power which determines the direction we need to take.
====
You mean to say that the GOI, which is elected by the people of this country has no responsibility with regard to the Sovereignty of the state?
You mean to say that it is only the people and not the Govt. who has to act upon against any attack on the country's sovereignty?
Indian constitution vests the paramount power in the people of India. That is the thing I am proud of. The people of this country and their collective conscience is the sovereign power which determines the direction we need to take.
రిప్లయితొలగించండి=====
As far as I know, this is called democracy.. and it happens in all democratic countries..
>> మన రాజ్యాంగం ఎంతో పకడ్బందీగా చేసారని భావిద్దామా? మరి అలా పకడ్బాందీగా చేయబడ్డ రాజ్యాంగా ఇన్నేసి పరిపాలనా లోపాలను ఏవిధంగాను అడ్డుకోదే!
రిప్లయితొలగించండిముందుగా అంగీకరించుకున్న ఒక సిద్ధాంతాలు, విలువల ఆధారంగా జీవనం సాగించుకోవడానికే రాజ్యాంగం లాంటి ఏర్పాట్లు. ఒక్కోసారి ఎన్నో చిన్న చిన్న విషయాలని కూడా రాజ్యాంగంలో అనవసరంగా చేర్చారేమో అని ఆశ్చర్యం వేస్తుంటుంది నాకు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు:
మన రాజ్యాంగం ప్రకారం, పార్లమెంట్ లో సభ్యుల ప్రవర్తనని కోర్టులలో ప్రశ్నించే వీలు లేదు. పార్లమెంట్ లో జరిగే చర్చలు ఎన్నొసార్లు మౌలిక మైన మార్పులకు శ్రీకారం కావాలికాబట్టి అలా పెట్టారేమొ అనుకున్నాను. ఇదికూడా చెప్పాలా అనిపించేది. ఏదోలే మరీ అతి జాగ్రత్త వహించారేమో, అందులో మన వాళ్ళంతా అప్పట్లో లాయర్లు కదా అనుకున్నాను.
అదే సూత్రాన్ని ంఫ్ లకి డబ్బులిచ్చిన సందర్భంలో కూడా తనకనుకూలంగా ఫ్వ్ నరసిం హా రావు లాంటి కాంగ్రేస్ మేధావులు వాడుకోవడం, పైగా దాన్ని సుప్రీం కోర్టు అనుమతించడం చూసాక ఏమనిపిస్తుంది? ఈ లెక్కన రాజ్యాంగం ఒక లక్ష పేజీలు రాసినా మనవాళ్ళకు సరిపోదేమో అనిపించింది.
అందుకే రాజ్యాంగంలో వున్న విలువలు అర్థాంతరంగా సమాజంలో అప్పటికప్పుడు ప్రతిష్ఠించబడవు అని గమనించాలి. ఆ విలువల వైపుగా సమాజాన్ని నడిపించాల్సిన బాధ్యత మనందరిదీ, మరీ ముఖ్యంగా నాయక గణానిదీ.
అంతే గానీ, ఏదో మహా గొప్పగా రాజ్యాంగంలో రాసేస్తే సమాజం మారిపోతుందా ఏంటి? లేక సమాజంలో లోపాలున్నాయికాబట్టి మేమంతా మహానుభావులం రాజ్యాంగమే దీనికంతటికీ మూలకారణం అని అనుకోవడం సరికాదు.
>>You mean to say that the GOI, which is elected by the people of this country has no responsibility with regard to the Sovereignty of the state? You mean to say that it is only the people and not the Govt. who has to act upon against any attack on the country's sovereignty?
రిప్లయితొలగించండిసాయి కిరణ్ గారూ,
What I am trying to say is that the central government or the constitution itself derives their power from the people of this country. People of India holds the paramount power as per our constitution.
If the GOI is not acting according to the will of the people or loose their mandate it should go.
If the GOI is acting with the mandate of the people, but its actions are ultra vires to the Constitution.. it means the nation building is still in progress..and it is our duty to contribute to such a thing.
People of India holds the paramount power as per our constitution.
రిప్లయితొలగించండి====
What power!! You call ONE VOTE every five years is POWER!! And the same voter is taken for grated for five years. That's how this constitution made us live 6 decades. And you say this Constitution gives paramount power to people?
>>What power!! You call ONE VOTE every five years is POWER!! And the same voter is taken for grated for five years. That's how this constitution made us live 6 decades. And you say this Constitution gives paramount power to people?"
రిప్లయితొలగించండి-----------------
So..ONE VOTE every five years and the indirect influence of public opinion and the trust reposed in 543 representatives is what we have. OK. if that is not enough, then do you think OE VOTE every 4 years is good, or ONE VOTE every year is Good? Or do you propose a referendum of a billion people on each and every issue?
The point here is, we are expected to produce enough leadership amongst ourselves. a leadership in whose judgement we can trust and a leadership whose behaviour will be in accordance with the values we gave to ourselves in the constitution.
If we are not able to produce that leadership.. that is some thing we need to think and address as the people of this country. There are faults.. in the system. I agree. But I also see many acheivements as well.
I know our present system of parliamentary democracy is not fool proof. But what are the other alternatives ?
If Democracy is the bad form of governance then may be it is better because all other alternatives are worse than that.
_____________________________________________
రిప్లయితొలగించండిIndian constitution vests the paramount power in the people of India.
_____________________________________________
LOL!!
I completely agree with KSKK's comment for the above sentence.
//ONE VOTE every year is Good?//
రిప్లయితొలగించండిOne vote every month is good. Every vote should be given support price not less than 1000Rs/vote. Voters should have freedom to vote whichever constituency they want in the country.
నెలకోసారి ఎన్నిలొస్తే, పదిమంది సభ్యులున్న కుటుంబానికి నెలకు 10వేలు అదనపు ఆదాయం. దారిద్ర్యరేక కింద వున్నోళ్ళు పైకి, మధ్య, పైతరగతి అభిమానవంతులు పాతాళానికి పోగలరు. ఐడియా అభివృద్ధికి సోపానాలు వేసేలా బాగుంది. ఎన్నికల కమీషన్ పర్మనెంట్ స్టాఫ్ ఏర్పాటు చేసుకోవాలి, లక్షల్లో కొత్త వుద్యోగాలు పుడతాయి. నాకు నచ్చింది. :)
పాకిస్తాన్ సైనికుల బదిలీకి కాశ్మీరులో పాకిస్తాన్ చొరబాటును అడ్డుపుల్లగా వాడుకోలేదెందుకు?
రిప్లయితొలగించండి__________________________________________________
పాకిస్తాన్ గనక తను ఆక్రమించుకున్న ప్రాంతాన్ని భారత్ కు తిరిగి ఇచ్చేస్తే కధ సుఖాంతం అవ్వదు - ఎందుకంటే అప్పుడు ప్లెబిసైట్ నిర్వహించాల్సిన బాధ్యత భారత్ మీద ఉంటుంది. ఆ ఎన్నిక ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం, మొత్తం కాశ్మీర్ పాకిస్తాన్ కి పోయినా పోవచ్చు. అదే గనక జరిగితే భౌగోళికంగా మనకి పెద్దగా నష్టం లేకపోయినా, రాజకీయంగా & భద్రతా పరంగా రాజధానికి అంత చేరువలో సరిహద్దు ఉండడం శ్రేయస్కరం కాదు. అందుకే పాకిస్తాన్ ఆక్రమించుకున్నదన్ని దానికే వదిలేసి, అ వంకతో మన భాగాన్ని మనమే అట్టేపెట్టుకోవడమే సరైన పధ్ధతి.
మరి పాకిస్తాన్ PoK ని ఎందుకు ఇవ్వట్లేదంటారా? కారణం అదే. ఒక వేళ ఎన్నిక ఫలితాలు భారత్ కు అనుకూలంగా వస్తే అది వారికి ప్రమాదకరమే కదా?
if that is not enough, then do you think OE VOTE every 4 years is good, or ONE VOTE every year is Good?
రిప్లయితొలగించండి__________________________________________________
No need of that. What we need is the RIGHT TO RECALL an underperforming representative and also the RIGHT TO REJECT ALL THE CONTESTANTS in an election. The constitution doesnt provide it.
వీకెండ్ గారు - మన రాజ్యాంగాన్ని కుప్పతొట్టి అనటానికి కారణంగా నా వాదన మరింత స్పష్టంగా ఉండటానికి కొన్ని ఉదాహరణలు ఇస్తాను :
రిప్లయితొలగించండిమన చట్టసభలలో చేసే ఏ చట్టమైనా రాజ్యాంగ పరిధులకు లోబడి ఉండాలనే అనుకోలు ఆధారంగా ఈ ఉదాహరణలు గమనించండి.
ఒక ప్రభుత్వం పోటా అనే చట్టాన్ని ప్రవేశపెట్టి, పార్లమెంటులో ఆమోదింపచేసింది. కొన్నేళ్ళ తర్వాత మరో ప్రభుత్వం అదే చట్టాన్ని, అదే పార్లమెంటులో తీసి అవతల పడేసింది. ఈ రెండు ప్రభుత్వాలు, తమ తమ నిర్ణయాలకు ఆధారంగా రాజ్యాంగాన్నే పేర్కొన్నాయి. మరి తప్పెవరిది? మొదటి ప్రభుత్వానిదా, రెండవ ప్రభుత్వానిదా, లేక ఇద్దరిదీ తప్పా, ఇద్దరిదీ ఒప్పా?
ఏ రకంగా అనుకోటానికైనా ఆస్కారం కలిగించే విధంగా మన రాజ్యాంగాన్ని ఆయా పార్టీల ప్రభుత్వాలు వాడుకున్నాయనేది సుస్పష్టం. విస్పష్టంగాలేని మన రాజ్యాంగానిది తప్పులేదని అనగలరా? ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు అర్ధం చెప్పుకునే విధంగా రూపొందించబడిన మన రాజ్యాంగానిదే తప్పు.
మరో ఉదాహరణ. కొందరు దళిత యువకులు, ఏవేవో కారణాల వల్ల ప్రయాణీకులతో నిండి ఉన్న ఓ బస్సును తగులబెట్టారు. చాలామంది మరణించటం కూడా జరిగింది. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం వారికి మరణశిక్ష విధిస్తే, దాన్ని తోసిరాజని వారికి క్షమాభిక్ష పెట్టాడు అప్పటి రాష్ట్రపతి. రాజ్యాంగం తనకిచ్చిన విశేషాధికారాన్ని ఆయన దుర్వినియోగం చేయటంలో రాజ్యాంగం తప్పేముందని మీరు అడగవచ్చు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా కొట్టివేసే అధికారం రాష్ట్రపతికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?
అంతేకాదు, తప్పుచేసే చట్ట సభల సభ్యులను, స్పీకరు అనుమతి లేకుండా అరెస్టు చేసే అధికారం ఎవరికీ లేకుండా చేయటం మన రాజ్యాంగ లోపంగా మీకనిపించదా?
ఇక ఎన్నికలు ఓటుహక్కు గురించి ఎంతని మాట్లాడుకుందాం? ఏ రాజకీయ పార్టీ ప్రత్యక్ష మద్దతు లేకుండా విజయ్ మల్యా రాజ్యసభ సభ్యుడు ఎలా అయ్యాడంటారు? ఎంతమంది ప్రజా ప్రతినిధులను తన డబ్బుతో అతను కొని ఉంటాడు? వీటన్నిటికి కూడా పాలనా వ్యవస్థలోని లోపాలుగానే భావించాలా?
పాకిస్తాన్ గనక తను ఆక్రమించుకున్న ప్రాంతాన్ని భారత్ కు తిరిగి ఇచ్చేస్తే కధ సుఖాంతం అవ్వదు - ఎందుకంటే అప్పుడు ప్లెబిసైట్ నిర్వహించాల్సిన బాధ్యత భారత్ మీద ఉంటుంది.
రిప్లయితొలగించండి===
మలక్ - అప్పట్లో పాకిస్తాన్ కు మద్దతుగా నిల్చిన అమెరికాను కూడా పట్టించుకోకుండా బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి ఇందిరాగాంధీ సైనిక సహాయాన్ని అందించింది. ఆ సమయంలో ప్లెబిసైట్ నిర్వహించాల్సిన అవసరం కూడా ఎంతమాత్రమూ వచ్చి ఉండేది కాదు.
ఆ సమయంలో ప్లెబిసైట్ నిర్వహించాల్సిన అవసరం కూడా ఎంతమాత్రమూ వచ్చి ఉండేది కాదు.
రిప్లయితొలగించండి________________________________________________
అప్పట్లో రష్యా /USSR మనకి కొమ్ము కాసింది. ప్లెబిసైట్ అవసరం అప్పుడు కాకపోయినా ఇప్పుడయినా వచ్చుండేది. Its always a long term threat.
Nehru and his team seemed to have undereatimated the potential danger when they took the issue to the UN.
ఆ సమయంలో ప్లెబిసైట్ నిర్వహించాల్సిన అవసరం కూడా ఎంతమాత్రమూ వచ్చి ఉండేది కాదు.
రిప్లయితొలగించండి========
కానీ అప్పుడు మనం ఏ మాత్రం పాకిస్తాన్ భూభాగం పైన దాడి చేసినా అమెరికా రంగంలోకి దిగడానికి రెడీగా ఉన్నదనుకుంటా, ఇందిరపై ఉన్న కోపంతో.
"ఎందుకంటే అప్పుడు ప్లెబిసైట్ నిర్వహించాల్సిన బాధ్యత భారత్ మీద ఉంటుంది. ఆ ఎన్నిక ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం"
రిప్లయితొలగించండి@malak
what is the need to conduct plebiscite?
I don't have complete knowledge abt constitution, but as per my knowledge in Indian constitution there nothing like plebiscite.other wise was there any international law which makes India or pak to hold such type of poll after war?
some times i wonder while china was successful in controlling Tibet successfully irrespective of resistance from Tibetans why cant India control Kashmir at least so called Indian controlled Kashmir? problem is not in laws, its problem with rulers
Constitution is not holy book. It can certainly be commented or criticized for it's shortcomings. It was amended several times. The spirit and basic structure of the Constitution has to be honestly followed by the executive and the people in power nurturing healthy institutions and constitutional conventions.
రిప్లయితొలగించండిDr Ambedkar is only the chairman of drafting committee. he is not the sole author of the Constitution as wrongly believed by many. as you rightly said there are about 400 members of constituent assembly who participated in preparation of the constitution.
రిప్లయితొలగించండిwhat is the need to conduct plebiscite?
రిప్లయితొలగించండి_________________________________________
The republic of India is committed to the UN resolutions and thanks to Nehru and his team, the UN has called for the plebiscite with the caveat that both the parts of Kashmir should be demilitarized and combined before the vote is cast.
some times i wonder while china was successful in controlling Tibet successfully irrespective of resistance from Tibetans why cant India control Kashmir at least so called Indian controlled Kashmir?
రిప్లయితొలగించండి__________________________________________________
China has always been a powerful country and to add to it, its under dictatorship, wherein things can be done a lot faster.
In contrast, India traditionally had not been so powerful and its just for the last few years, she is showing the signs of power. Also, being a democracy, she cant do everything that China does.
Most of you guys are citizens of US. India will NEVER change, it will be like this. You guys have an option to live some where far away, but people like me, have no choice. So, how much should I cry? :(:(:(
రిప్లయితొలగించండి@ కొండముది గారు,
రిప్లయితొలగించండిమంచి ప్రయత్నం.. కానీ మీరు కొంత మంది కామెడీ మేధావులని టార్గెట్ చేసుకుంటూ కొంత కామెడీ గా మొదలెట్టిన ప్రయత్నం లా అనిపించిన , మంచి చర్చకి అవకాశం కలిపించారు.
ఒక ప్రశ్న .. అసలు రాజ్యాంగం పూర్తిగా తప్పుల తడక కావచ్చు, కానీ పోల్చి చూస్తే , సవరణలుకి అవకాశం వుంది కదా! తప్పులు సరి దిద్దుకునే అవకాశం ఎలాను వున్నప్పుడు సమస్య ఏమిటీ? ఈ రాజకీయ నాయకులు రాజ్యాంగ లో లొసుగులని తమ లాభాపేక్షకి వాడుకుంటారు తప్ప .. దేశ అభివృద్ధి కి ప్రయత్నించరనా? పబ్లిక్ సెంటిమెంటు అంటూ ఒకటి వుంటుంది.. అది కొన్నాళ్లు తొక్కి పెట్టగలరు గాని ఎల్లప్పటికి అది కుదరదు. అసలు ఈ రాజకీయ నాయకులు మటుకు ప్రజలలో భాగమే కదా!
రాజ్యాంగం విమర్శకి అతీతమూ కాదు, అన్ని సమస్యలకి సమాధానమూ కాదూ , లోప రహితం అంత కన్నా కాదు .
To control Kashmir (like China did in Tibet or Pak in PoK) one has to change the demography -
రిప్లయితొలగించండి1. Move the Kashmiri muslims down south by offering better standards of living, better lifestyle, more income, more safety etc and quell the resistance by force.
2. Move Kashmiri pundits and the poor Hindus from Bihar, Jharkhand, UP etc to Kashmir area. (Jammu and Ladakh aint a problem)
3. Prolong the tussle in Kashmir and make sure Pakistan doesnt return PoK for the next 20 years and make sure that the demography is altered by 2030.
For the above thing to happen, either the media houses should be heavily bribed so that they dont report the activity or the international pressure needs to be ignored - both are difficult.
@malak
రిప్లయితొలగించండి>>What we need is the RIGHT TO RECALL an underperforming representative and also the RIGHT TO REJECT ALL THE CONTESTANTS in an election. >>
ఎక్కడ అయినా ఇలాంటి విధానం అమలులో వుందా?
>>the UN has called for the plebiscite with the caveat that both the parts of Kashmir should be demilitarized and combined before the vote is cast. >>
అందు కోసమే , బయటి వారు కాశ్మీరులో భూములు కొనుక్కొలేరు , అక్కడ స్థిర పడలేరు కదా. ప్రజాభిప్రాయం బయటి వ్యక్తులతో డైల్యూట్ అయిపోకూడదు అని బహుశా! అమెరికా కూడా ఐ. రా. స. అభిప్రాయాన్ని తోసి పుచ్చి , ఇరాక్ లో ఆయుధ తనీఖీ చేసింది కదా! అసలు ఐ.రా.స బలమేమిటీ ఇప్పుడు ? కేవలం అమెరికా ఇష్టమే నడుస్తుంది. ఆర్ధికం గా మనం కూడా బలపడ్డాక మరి మనం కూడా ఐ.రా.స అభిప్రాయాన్ని పట్టించుకోనక్కరలేదు. మరొ సారి అవకాశం వచ్చినప్పుడు 1971 లా , ఆక్రమిత కాశ్మీరుని వెనక్కి తీసుకొవచ్చేమో ? కానీ మరి ఇలా బల ప్రయొగాలు చేస్తే , చైనా మన అరుణాచల్ ని ఆక్రమించినా కిమ్మని ఊరుకోవాలి కదా! అప్పుడు పరిస్థితి ఏమిటీ ?
>.China has always been a powerful country and to add to it, its under dictatorship, wherein things can be done a lot faster.
In contrast, India traditionally had not been so powerful and its just for the last few years, she is showing the signs of power. Also, being a democracy, she cant do everything that China does.>>
చైనాలో కూడా ఎన్నికలు వున్నాయి కదా! ఒక వ్యక్తి నియంతృత్వం అక్కడ వుందా? ఒక పార్టీ నియంతృత్వం .. లేదా ఏక చత్రాధిపత్యం అని కూడా అనవచ్చు. కమ్యూనిస్టు పార్టీ కాకుండా ఇంకా పార్టీలు వున్నా అవి బలం గా లేవు. అక్కడ ప్రజలు అందరూ ఆ పార్టీని అభిమానిస్తారు కాబట్టి , ఆ పార్టీ కి అంత బలం, ఏ నిర్ణయం అయినా అంత సులభంగా తీసుకుని అంత బలం గా అమలు చేస్తుంది. మన దేశం లో కూడా నలభయ్యేళ్లు ఒకే పార్టీ అధికారం లో వున్నా , వర్గాలు గట్రా ఎక్కువ అవ్వడం, ఏకాభిప్రాయ సాధన కష్టం అవ్వడం మన బలహీనత అనుకుంటాను.
నా అభిప్రాయం లో మన దేశ ఆర్ధిక , సైనిక బలం కన్నా ఇలా భిన్నోభిప్రాయలు వలనే ఈ విషయాలు ప్రభావితం అవుతున్నాయి అని నాకు అనిపిస్తుంది.
The republic of India is committed to the UN resolutions and thanks to Nehru and his team, the UN has called for the plebiscite with the caveat that both the parts of Kashmir should be demilitarized and combined before the vote is cast.
రిప్లయితొలగించండి------------------
Nope, Republic of India is not a member of UN then, its only unpartitioned India.
If India decides to occupy Kashmir, there are no such rules which force India to conduct plebiscite and do accordingly, the best they can do is they just pressure the Indian administration thats it.
Plebiscite never happened anywhere Infact, the Eastern States they wanted Independence but they merged Into Indian Union forcefully.
Even Nehru wanted to take Hyderbad State issue to UN, but its Patel who resisted and made arrangements for war with out Nehrus consent.
Nehru just more than concerned with his minority politics thats it.
>>
రిప్లయితొలగించండిఅక్కడ ప్రజలు అందరూ ఆ పార్టీని అభిమానిస్తారు కాబట్టి , ఆ పార్టీ కి అంత బలం, ఏ నిర్ణయం అయినా అంత సులభంగా తీసుకుని అంత బలం గా అమలు చేస్తుంది.
>>
నిజమా అయ్యోరు, మరే, ఉత్తర కొరియాలో కుడా ఇంతేనా?
ఓ పాలి చైనా వెళ్ళి కమ్యునిష్ట్ పార్టీ డౌన్ డౌన్ అను, నీ తల మీద మెడ ఉంటది..
అది అభిమానం..మరి
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిన పేపర్లు, విలేఖరుల జాడ ఏకో నారాయణ
@ తార,
రిప్లయితొలగించండి>>నిజమా అయ్యోరు, మరే, ఉత్తర కొరియాలో కుడా ఇంతేనా?
ఓ పాలి చైనా వెళ్ళి కమ్యునిష్ట్ పార్టీ డౌన్ డౌన్ అను, నీ తల మీద మెడ ఉంటది..
అది అభిమానం..మరి
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిన పేపర్లు, విలేఖరుల జాడ ఏకో నారాయణ >>
అది అభిమానమో, వంకాయ పులుసో పక్కన పెడీతే పార్టీ బలంగా వుంది అన్నది నిఝం. అదే పరిస్థితి కాంగ్రెసుకి ఇక్కడ వున్నా ఉపయోగించలేకపోయింది. అది నేను చెప్పాలనుకున్న విషయం. తియన్మాన్ స్క్వేరు ఉదంతం తరువాత చైనా రివిజనిస్టు ఎందుకు అయ్యింది ? నియంతృత్వ ప్రభుత్వానికి ఆ అవసరం ఏముంది ? ప్రజల అభిప్రాయానికి అక్కడ విలువ వుంది అన్నది నా అభిప్రాయం. అక్కడ ప్రతి వ్యక్తి పార్టీ కార్యకర్తగానే ఫీలు అవుతాడు. కాకపోతే డిసిప్లిన్ అన్నది కూసింత ఎక్కువ , భయం వలనో మరొకటో అక్కడ ఏకాభిప్రాయ సాధన సులభమే! ఇప్పుడు టిబెట్ విషయమే తీసుకుంటే సానుభూతిపరులు అక్కడా వున్నారు, కానీ బలమైన ప్రభుత్వం ఒక ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తుంది కదా! మరి మన దేశంలో ఏకభిప్రాయ సాధన అని మెజారిటీ అభిప్రాయాన్ని కూడా ప్రజాస్వామ్య బద్ధంగా తుంగలో తొక్కేస్తారు :(
>>ఏ రకంగా అనుకోటానికైనా ఆస్కారం కలిగించే విధంగా మన రాజ్యాంగాన్ని ఆయా పార్టీల ప్రభుత్వాలు వాడుకున్నాయనేది సుస్పష్టం. విస్పష్టంగాలేని మన రాజ్యాంగానిది తప్పులేదని అనగలరా? ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు అర్ధం చెప్పుకునే విధంగా రూపొందించబడిన మన రాజ్యాంగానిదే తప్పు.
రిప్లయితొలగించండిఏరకంగానైనా అనుకోవడం అంటే? మనం ఎవరికి అవసరమైన అర్థం వారు చెప్పుకునేటప్పుడు, ఒక లక్ష పేజీలు రాసినా, ఉపయోగం ఉండదు కదా! పైన చెప్పినట్టూ, PV నరసిం హారావు లాంటి మేధావులు కూడా MP లని డబ్బులిచ్చి కొన్న విషయంలో, పార్లమెంట్లో సభ్యుల ప్రవర్తన కోర్టుల పరిధిలోకి రాదనే నియమాన్ని వాడుకోవడం, సుప్రీం కోర్టు దాన్ని అనుమతించడం లాంటివి రాజ్యాంగం లో స్పష్టత కరువయ్యి అంటారా లేక మనలో పరిణతి లోపం వల్ల అంటారా.
>>మరో ఉదాహరణ. కొందరు దళిత యువకులు, ఏవేవో కారణాల వల్ల ప్రయాణీకులతో నిండి ఉన్న ఓ బస్సును తగులబెట్టారు. చాలామంది మరణించటం కూడా జరిగింది. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం వారికి మరణశిక్ష విధిస్తే, దాన్ని తోసిరాజని వారికి క్షమాభిక్ష పెట్టాడు అప్పటి రాష్ట్రపతి. రాజ్యాంగం తనకిచ్చిన విశేషాధికారాన్ని ఆయన దుర్వినియోగం చేయటంలో రాజ్యాంగం తప్పేముందని మీరు అడగవచ్చు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా కొట్టివేసే అధికారం రాష్ట్రపతికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?
దళిత యువకులైనా, ఇంకే యువకులైనా ఇక్కడది అప్రస్తుతం. వారు అతి భయంకరమైన నేరస్తులు. అది సుస్పష్టం. మీరన్నట్టు రాష్ట్రపతి నిర్ణయం మనలాంటి వారికి చాలా మందికి నచ్చలేదు. క్షమాభిక్ష అధికారం రాష్ట్రపతి కి ఉండాలా వద్దా అనేది మనం ఎప్పుడైనా సమీక్షించుకోవచ్చు. రేపు ఒక వేళ కోర్టే ఒక అన్యాయమైన తీర్పు ఇస్తే అసలు అతువంటి అధికారాన్ని కోర్టుకి ఇవ్వడం రాజ్యాంగం తప్పు కాదా అని వాదించడం సరికాదు కదా.
>>అంతేకాదు, తప్పుచేసే చట్ట సభల సభ్యులను, స్పీకరు అనుమతి లేకుండా అరెస్టు చేసే అధికారం ఎవరికీ లేకుండా చేయటం మన రాజ్యాంగ లోపంగా మీకనిపించదా?
నాదృష్టిలో ఇది చాలా మంచి సంప్రదాయంగా కనిపిస్తుంది.Why and how we can discuss may be some other time. కాకపోతే స్పీకర్ మరీ క్రిమినల్ కేసులకి కూడా తన అధికారాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితులు రావడం పెద్ద సమస్యే.
సాయి కిరణ్ గారూ,
రిప్లయితొలగించండిరాజ్యంగంలో ఏ లోపాలూ లేవని చెప్పడమో, లేక ప్రపంచంలోకెల్లా మనమే అత్యుత్తమమైన రాజ్యాంగ రాసుకున్నమనో చెప్పదం నా వాదన ఉద్దేశ్యం ఎంత మాత్రం కాదు.
అందరం కూడా, రాజ్యాంగ విలువల అధారంగా మనవ్యవ్థని నడుపుకోవడానికి ప్రయత్నించాలి. ఏవైనా లోటుపాట్లు కనిపించినప్పుడు మార్చుకోవాలి.
60 సంవత్సరాల క్రితం ఒక జాతిగా మనం అనుకున్న రాజ్యాంగ స్ఫూర్తిని, సమాజం ప్రతిఫలించేలా ఇప్పటికి కూడా చేయలేక పోవడం అన్నది మనందరి సమస్య. దీనికి కారణం సరైన నాయకత్వాన్ని తయారు చేసుకోలేక పోవడం అని నేననుకుంటున్నాను. కాదు రాజ్యాంగ మూల విలువలతోనే సమస్య అని కొంతమంది అనుకుంటూ వుండవచ్చు. అలా అనుకునేవారు, కొత్త విలువలతో మరో రాజ్యాంగం రాస్తే సమస్య తీరిపోతుందనే ఆశతో వుండి వుంటారు. ఈ రాజ్యాంగ మైనా, మరే రాజ్యాంగమైనా మనమీదే ఆధారపడ్ది ఉంటుంది.
అసలా మాట కొస్తే, రాజ్యాంగమే లేని బ్రిటన్ బాగానే మనగలుగుతుంది కదా!
నా వరకు మాత్రం ఈ 60 సంవత్సరాల్లో మనకున్న పరిస్థితుల్లో మనం బాగానే ప్రగతి సాధించామనిపిస్తుంది. ఇంకా చాలా పరిణతి చెందాల్సిన అవసరం కనిపిస్తుంది. Our people are just starting to give more focus to politics. That is a hopeful sign. I strongly believe that we will cross that threshold in a decade from now.
@ weekend politician,
రిప్లయితొలగించండిvery optimistic of you :) hope your wish come true .
@kvrn
రిప్లయితొలగించండి>>Dr Ambedkar is only the chairman of drafting committee. he is not the sole author of the Constitution as wrongly believed by many. as you rightly said there are about 400 members of constituent assembly who participated in preparation of the constitution.
hmm.. good point. yeah.. there may be some people who might think that Ambedkar alone wrote the constitution, Gandhi alone fought with British to bring freedom, or Ambedkar alone is responsible for reseervation policy etc..
Sometimes, people will brand you as a supporter of reservation Policy or as a blind follower of Dr. Ambedkar just based on the fact that you are talking about the constitution of India.
There are also people who will brand you as a Hindu extremist if you dare to express a slight disagreement with Gandhi or Nehru.
There are people who might think that it is only dalits and benificiaries of reservations who admire Dr. Ambedkar or the constitution.
:) we just need to express what we think and need not bother with these things. because majority of the people are capable of seeing the truth themselves if you are consistant.
just as a matter of fact,
Constituent assembly was formed with 389 members. After the formation of a separate assembly for pakistan our constituent assembly had 299 members representing various provinces and states.
There were 13 committees and 4 sub committees which worked on the most defining excercize. of these as you rightly said, Dr. Ambedkar was the Chairman of one of the committees.
[రాజ్యంగంలో ఏ లోపాలూ లేవని చెప్పడమో, లేక ప్రపంచంలోకెల్లా మనమే అత్యుత్తమమైన రాజ్యాంగ రాసుకున్నమనో చెప్పదం నా వాదన ఉద్దేశ్యం ఎంత మాత్రం కాదు.]
రిప్లయితొలగించండి= = =
వీకెండ్ గారు - కనీసం ఇంతవరకైనా ఒప్పుకున్నారు. సంతోషం.
= = =
[దళిత యువకులైనా, ఇంకే యువకులైనా ఇక్కడది అప్రస్తుతం. వారు అతి భయంకరమైన నేరస్తులు.]
= = =
అది ఎంతమాత్రం అప్రస్తుతం కాదండి. ఆ దళిత యువకులకు క్షమాభిక్ష పెట్టింది ఓ దళిత రాష్ట్రపతి. ఒక్క ఆయనే అనేముంది. మత ప్రమేయంలేని ఓ లౌకిక ప్రజాస్వామ్య దేశానికి రాష్ట్రపతిగా ఉన్న శంకర్ దయాళ్ శర్మ, తన పదవీ కాలంలో, మందీ మార్బలం వేసుకొని ప్రతి శనివారం తిరుమలకి వచ్చేవాడు. మన రాజ్యాంగం ఇటువంటి అధికార దురుపయోగాన్ని ఎందుకని ఖచ్చితంగా అడ్రెస్ చేయలేకపోయింది?
= = =
[60 సంవత్సరాల క్రితం ఒక జాతిగా మనం అనుకున్న రాజ్యాంగ స్ఫూర్తిని, సమాజం ప్రతిఫలించేలా ఇప్పటికి కూడా చేయలేక పోవడం అన్నది మనందరి సమస్య. దీనికి కారణం సరైన నాయకత్వాన్ని తయారు చేసుకోలేక పోవడం అని నేననుకుంటున్నాను.]
= = =
ఆరు దశాబ్దాల కాలం తర్వాత కూడా, మనలో సరైన నాయకత్వ స్ఫూర్తిని మన రాజ్యాంగం రగిలించలేకపోయిందని నేను భావిస్తున్నాను.
>>వీకెండ్ గారు - కనీసం ఇంతవరకైనా ఒప్పుకున్నారు. సంతోషం.
రిప్లయితొలగించండిThank you. ఇంతకీ మీరెంత వరకూ ఒప్పుకున్నారో తెలియట్లేదే :)
>>ఆ దళిత యువకులకు క్షమాభిక్ష పెట్టింది ఓ దళిత రాష్ట్రపతి. ఒక్క ఆయనే అనేముంది. మత ప్రమేయంలేని ఓ లౌకిక ప్రజాస్వామ్య దేశానికి రాష్ట్రపతిగా ఉన్న శంకర్ దయాళ్ శర్మ, తన పదవీ కాలంలో, మందీ మార్బలం వేసుకొని ప్రతి శనివారం తిరుమలకి వచ్చేవాడు. మన రాజ్యాంగం ఇటువంటి అధికార దురుపయోగాన్ని ఎందుకని ఖచ్చితంగా అడ్రెస్ చేయలేకపోయింది?
దళిత రాష్ట్రపతా? ఒహో, ఆ సమయంలో భారత రాష్ట్రపతిగా వున్నాయన ఒక దళిత జాతికి చెందినాయన, అని మీ ఉద్దేశ్యం అయ్యుండొచ్చు.
అంత పెద్ద స్థాయిల్లో వున్న వాళ్ళు, మహా అయితే పొరపాట్లు చేస్తారు, రాజకీయ లేక స్వీయ ప్రయోజనాలకోసం తప్పటడుగులు వేస్తారు గానీ మరీ కుల, మత, జాతి ఫీలింగ్స్ తో ప్రవర్తిస్తారంటే, నాకు మాత్రం నమ్మశక్యంగా లేదండీ. The merits and demerits of that decision need to be debated irrespective of the caste to which the President or the pardoned guys belong. That sort of a discussion helps us learn lessons and improve.
ఇక, శంకర్ దయాళ్ శర్మ గారి విషయానికి వస్తే, ఆయన చేసిన దాంట్లో మన లౌకిక వాదానికొచ్చిన ముప్పేమీ కనబడట్లేదు నాకు. మనది, పరిపాలనలో మత ప్రమేయం ఉండకూడని లౌకిక రాజ్యమే గానీ మత రహిత రాజ్యం కాదుకదా! కాకపోతే, ఆయన వ్యక్తిగత అవసరాల కోసం అధికార లాంచనాలని వాడారనే అభ్యంతరం కొంత మంది వ్యక్తం చేయొచ్చు. అది కొంచెం ఆలోచించవలసిన విషయమే. The problem in these things is where to draw the line? is it OK if the president goes to see his family every week? Is it OK if the president goes for a walk with the security two times a day?
So it is best to leave it to the good sense and judgement of individuals as long as it is not coming in the way of honest discharge of their duty.