23, మార్చి 2010, మంగళవారం

మైనారిటీ ముసుగులో అట్రాసిటీలు

ముస్లీం పర్సనల్ లా ముసుగులో, మైనారిటీ తీరకుండానే ఆడపిల్లకు వివాహం చేయబోయే సమయంలో జోక్యం చేసుకొని ఆ బాలికను విడిపించిన ముంబాయిలోని ఘట్కోపర్ పోలీసులు అభినందనీయులు. జకియా బేగం, మైనారిటీ తీరని తన బాలికకు డిసెంబరులో వివాహం చేయబోగా, స్థానిక పోలీసులు అడ్డుపడి ఆ బాలికను సంక్షేమ గృహానికి చేర్చారు (ముంబాయి మిర్రర్ 23-మార్చి-2010).

బాల్య వివాహ నిషేధ చట్టం పరిధిలో తమ పని తాము చేసామని పోలీసులు చెబుతుండగా, అది "ముస్లీం పర్సనల్ లా" వ్యవహారంలో మితిమీరిన జోక్యంగా ముస్లీం పర్సనల్ లా బోర్డు భావించి, ఆ బాలిక తల్లి ద్వారా హైకోర్టును ఆశ్రయించింది. బాలిక తల్లి వాదనలోని చట్టబద్ధతపై వివరణ ఇవ్వాల్సిందిగా, హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చూస్తుంటే, షాబానో తరహా కేసు పునరావృతమౌతున్న సూచనలు కనబడుతున్నాయి.

ఆడుతూ, పాడుతూ, చదువుకోవాల్సిన వయసులో ఆలిని చేసి, ఆనక తీరిగ్గా తలాకులిచ్చే సంస్కృతికి బలయ్యే బాలికలపై ఇప్పుడైనా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ముస్లీం బాలికలపై ఇటువంటి అత్యాచారాలను అందరూ ముక్త కంఠంతో ఖండించాలి.

పోలీసుల చర్యను, మైనారిటీ బాలికల హక్కులను కాలరాచే చర్యగా మన కామెడీ కేతిగాళ్ళు భావిస్తారేమో కానీ, ప్రస్తుతం దేశానికి యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌర చట్టం) ఆవశ్యకతను ఈ ఉదంతం మరోసారి గుర్తు చేస్తుంది.

కర్ణాటకలో, గో వధ నిషేధ స్ఫూర్తితో, భా.జ.పా. పాలనలోని రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం రాష్ట్ర స్థాయిల్లో, ఇటువంటి చట్టాలను రూపొందించగల అవకాశాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ప్రత్యేక చట్టాలు కష్టతరమని భావిస్తే, హిందు చట్టాలే అందరికీ అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలి.

3 కామెంట్‌లు:

  1. అసలు ఉమ్మడి పౌరన్యాయాన్ని అమలు చేయలేకపోవడం వ్యవస్థగా మన వైఫల్యాన్ని సూచిస్తుంది. ముస్లింలకోసం తెగబారెడు బాధపడిపోయే మన కాంగ్రేసువాళ్లకి ముస్లింలంటే సాధారణ ప్రజలుకాదు వాళ్ళవోటుబ్యాంకులను ప్రభావితం చేయగల మౌల్వీలు, ఇమాములూను కాబట్టి వాళ్ళకింపైన ప్రత్యేక చట్టాలను సాగనిస్తుంది. మరి ముస్లింలకు అదే ఖురాన్‌లో శిక్షాస్మృతికూడా వుందికదా అదికూడా అమలుచేస్తానంటే ఈ ప్రత్యేక చట్టాలతో నాకేమీ ఇబ్బంది లేదబ్బా...

    రిప్లయితొలగించండి
  2. ఈ మైనారిటీలందరూ గుంపు గుత్తంగా వోట్లు వేస్తున్నంత కాలం వాల్లు ఆదింది ఆట పాడింది పాటగా సాగనిస్తుంది కాంగిరేసు పార్టీ.

    రిప్లయితొలగించండి
  3. >>మైనారిటీ బాలికల హక్కులను కాలరాచే చర్యగా మన కామెడీ కేతిగాళ్ళు భావిస్తారేమో
    తప్పకుండా అలాగే భావిస్తారు. పార్టీలు వాళ్ళ ఓట్లు కోసం అడ్డమైన ఏడ్పులు ఏడుస్తాయి. మరి వీళ్ళకేమి అవసరమో ఏమి ఆశించో ఇదంతా. స్వజాతిని అవమానం పాలు చేయటంగాక ఇంకేమిటి.

    రిప్లయితొలగించండి