8, ఏప్రిల్ 2010, గురువారం

మహిళా సాధికారత - ఉమ్మడి పౌర చట్టం


శీర్షిక చదివితే, పరస్పర సంబంధం ఏమాత్రమూ లేని రెండు అంశాలుగా అనిపిస్తాయి మహిళా సాధికారత - ఉమ్మడి పౌరసత్వం అనే విషయాలు. ఈ నేపథ్యంలో, ఆయేషా సిద్దిఖీ కేసు ఓ సారి పరిశీలించినప్పుడు మహిళా సాధికారత అనేది, ఉమ్మడి పౌర చట్టంతో ఎలా సాధ్యమనేది కూడా మంచి చర్చకు దారితీస్తుంది.

-మరో వివాహానికి ముందుగా, తనకు విడాకులు ఇవ్వాలని ఆయేషా కోరింది.
-అసలు పెళ్ళే కాలేదు పొమ్మన్నాడు షోయబ్ మలిక్.
-జరిగిన పెళ్ళికి సాక్ష్యంగా, అతను సంతకం చేసిన వివాహ పత్రాలు బయట పెట్టింది ఆయేషా.
-అది తన సంతకమే అని ఒప్పుకున్నా, ఫోనులో జరిగిన వివాహం చెల్లదని తేల్చి చెప్పాడు షోయబ్.
-దీన్నిబట్టి, ఫోనులో చేసుకున్న పెళ్ళి చెల్లదని తెలిసే షోయబ్ పెళ్ళి చేసుకున్నట్లు అర్ధమౌతుంది.
-అంటే, స్త్రీని ఓ విలాస వస్తువుగా మాత్రమే భావించే అతని మనస్తత్వం బట్టబయలయ్యింది.
-తప్పనిసరి పరిస్థితుల్లో, పెళ్ళి పిమ్మట జరిగిన మరికొన్ని సంఘటనలకు సాక్ష్యంగా ఫోరెన్సిక్ విభాగానికి ఆధారాలు అందజేసింది ఆయేషా.
-ఇక, రాజీపడక తప్పని పరిస్థితుల్లో విడాకుల మీద సంతకం చేసాడు షోయబ్.
-నెలకు అయిదువేల చొప్పున, మూడు నెలలకు పదిహేనువేల భరణాన్ని కూడా ఇచ్చాడు.

చూడబోతే, ఆయేషా సంపన్న కుటుంబానికి చెందిన మహిళగా తెలుస్తోంది. అదే పరిస్థితుల్లో, ఓ సాధారణ ముస్లీం మహిళను, ఈ దేశ ముస్లీం పౌరుడుని ఊహించుకోండి. మూడు నెలల భరణం ఇచ్చేస్తే, ఆ మహిళకు జీవితాంతం వరకు సరిపోతుందా? ఇవన్నీ, ముస్లీం పర్సనల్ లా బోర్డుకు సంబంధించిన విషయాలని కొట్టిపారేయకూడదు.

ఆ మాటకొస్తే, హిందు వివాహ చట్టంలో కూడా మహిళల హక్కులను పరిరక్షించే పరిస్థితులు ఏమాత్రమూ లేవు. ఏవో కొన్ని కేసులు తప్పించి, అన్ని మతాలలోని మహిళలకు దాదాపు ఇదే దుస్థితి.

మనది లౌకిక ప్రజాస్వామ్య దేశం. అంటే, అన్ని మతాలను, మత భావనలను గౌరవించాలనే కాదు. మత ప్రమేయంలేని రాజ్యంగా తీర్చిదిద్దాలని. ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించే ప్రజాస్వామ్యంలో, అర్ధంపర్ధంలేని మతానికో చట్టం దేనికి?

ఆయేషాకు సంబంధించిన ఈ వ్యవహారంలో మరో కోణం కూడా ఉంది. వివాహానికి ప్రత్యామ్నాయంగా "కలసి" జీవించొచ్చని తీర్పులిచ్చే న్యాయస్థానాలు, "కలసి జీవించే వ్యవహారాల్లో" ఆయేషాలాంటి కేసులు ఎదుర్కొనే సాధారణ మహిళలకు ఏ రకమైన తోడ్పాటు అందించగలవో ఊహించటం కష్టతరమేమీ కాదు.

సమాజంలో మహిళలకు అవసరమైన సామాన్య భద్రత కల్పించలేని ప్రభుత్వాలు, చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషనులు అమలుపరచినా ఉపయోగం ఏముంది? ఉమ్మడి పౌరచట్టంపై సత్వరమే మంచి చర్చకు తెరదీయాల్సిన అవసరమే కాదు, ఒక ముసాయిదాను కూడా చేసి, అమలు పరచినప్పుడే, లౌకిక ప్రజాస్వామ్య దేశంగానే కాకుండా, మహిళలకు అవసరమైన చట్టపరమైన రక్షణ దొరుకుతుంది.

3 కామెంట్‌లు:

  1. నిజమే. ఉమ్మడి పౌరచట్టం సత్వరమే కావాలి.

    రిప్లయితొలగించండి
  2. "కలసి జీవించే వ్యవహారాల్లో"
    కేసేముంటుంది ఎవరిష్టం వాళ్ళది ఐనప్పుడు ఎవరి నష్టం వాళ్ళది :)
    అప్పుడు ప్రతి దానికీ కేసులేస్తే ఎలాగ ఓ అబ్బాయితో కలిసి జీవిస్తున్న యువతి దారివెంట వెలుతోంటే నాతో ఎందుకు కలిసుండవు అనిఇంకోడూ చెయ్యిపట్టి లాగుతాడు.
    మొన్నటిదాకా కలిసుండి ఈ రోజెందుకు ఉండవంటూ ఒకడు యాసిడ్ జల్లుతాడు.
    రోజుకొకరితో కలిసుంటాను అదినాకు రాజ్యాంగం ఇచ్చినహక్కు అంటాడు ఇంకోడు.
    భర్త/భార్య కళ్ళముందే ఇంకోళ్ళతో పోయినా తప్పులేదంటారు. ఎందుకంటే రాధకు పాపం భర్త ఉన్నాడు :) (ఆ జడ్జి రాధ భర్త సంగతి ఎత్తలేదు కదా)
    తల్లిదండ్రి లేనిపిల్లలు ప్రేమ కేర్ పొందడం తమ జన్మ హక్కు అని కేసు వేస్తారంటారా!
    కలిసున్న పాపానికి కుప్పతొట్లలో పసి కందులు . మునిసిపాలిటీకి మరింత శ్రమ. వాసనవేసినా పట్టించుకోకుండా పనిచూస్కోండి అంటారా. వాటినుండి గ్యాస్ ప్లాంటు తయారు చేస్కోవచ్చు అంటూ కోర్టువారు అమూల్యాభిప్రాయం వెలుబుచ్చుతారు.

    (సంబంధం లేకుండా ఏంటో! ఏంరాశానో! మీకేమైనా అర్ధం ఐతే సరె లేకపోతే కామెంటు డెలిటూ

    రిప్లయితొలగించండి
  3. ప్రతీ దానిని మతం దృష్టితో చూసే మనదేశంలో ఇలాంటి చట్టాలు అంత త్వరగా తయారుకావు. అందరిది ఒకదారైతే ఉలిపి కట్టెది మరో దారన్నట్టు ఉంటుంది ముస్లింల తీరు.

    రిప్లయితొలగించండి