12, మే 2009, మంగళవారం

కత్తి సుత్తికి ఏమౌతుంది - అవసరమా?

కామెడీ కోసం నేనో కత్తి లాంటి బ్లాగును ఫాలో చేస్తూంటా. ఆ బ్లాగులో హిందువులను, అగ్రవర్ణాలను ఏరకంగా ఇన్ డైరెక్టుగా అమ్మ నా బూతులు తిట్టచ్చో ఆ బ్లాగరి ప్రదర్శన నిర్వహిస్తుంటాడు. ఒకానొకప్పుడైతే అటువంటివి చదివి ఆవేశం వచ్చేది. రానూరానూ, ఆ బ్లాగరి దయవల్ల, అదో అలవాటైంది. ఇప్పుడు చదివి నవ్వుకోటానికి మాత్రమే ఆ బ్లాగు చదువుతాను.



సరే, అసలు విషయం ఏమిటంటే, మొన్నామధ్య కాసేపు నవ్వుకుందామని మరోమారు ఆ బ్లాగు తెరిచాను. ఈసారి 'సీత రాముడికి ఏమవుతుంది?' అన్న ఓ రచన కనిపించింది. నవ్వుకోటానికి సిద్ధపడే చదివాను. పాపం ఆ బ్లాగరికి ఆ కధ జస్ట్ అప్పుడే తెలిసినట్లుంది. ఇటువంటి వివాదాస్పద విషయాలే కదా ఆయన్ను మేథావిని చేసింది. అందుకనే మేత దొరికిన మేకలా హడావుడిగా బ్లాగులో పెట్టేసారు.



ఇక కావల్సిన రభసకు రంగం సిద్ధం చేసారుగా. చిన్నపాటి రణరంగం మొదలయ్యింది. అందులో కొందరిని 'పిటీ' చేసి, మరి కొందరికి పూర్తిగా చదివి కామెంటు పెట్టమని ఉద్బోధించి, చివరికి ఆ కథ ఆల్రెడీ తెలుగు సాహిత్యంలో దిగ్గజాలు ఇదివరకే ఉటంకించారని తేల్చేసారు.



కాసేపు ఆ బ్లాగరిని అభిశంసించి, ఆలోచిస్తే అనిపించిందేమిటంటే, ఇదంతా ఓ కుట్రలో భాగంగానే జరుగుతున్నది. దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు. అన్ని మతాలవారితో సామరస్యంగా వీరు ఉండటం ఈ మేథావులకు నచ్చదు. ఎలాగైనా సరే, ఇతరమతాలతో వీరి సంబంధాలని పాడుచేసి, హిందువులను రెచ్చగొట్టి, మతవిద్వేషాలు పెంచి, వాటిని ప్రతిఘటించే హిందువులను ప్రపంచం ముందు వెర్రి వెధవలుగా నిలబెట్టాలనే ఆలోచన వీరిది. హిందూమతాన్ని కూకటివేళ్ళతో పెకిలించాలని చేసే ప్రయత్నాలవి.



సాధారణంగా జరిగే చర్చల్లో వీరు వేదాల చారిత్రక సత్యాన్ని ఒప్పుకోరు. అవన్నీ కల్పితం అంటారు. సరే అలా అని ఊరుకుంటారా... ఊరుకోరు. ఆ వేదాలనే ఉటంకిస్తూ, వేదకాలంలో జంతుహింస చేసేవారని విమర్శిస్తారు. బ్రాహ్మణులు మాంసం భుజించేవారని చెబుతారు. అవును, ఒకానొకప్పుడు జంతు హింస, ఇంకా చెప్పాలంటే గో వధ జరిగేది యజ్ణయాగాది క్రతువుల్లో. ఆ గో మాంసాన్ని ప్రసాదంగా భుజించేవారే! అయితే ఏమిటి? ఆ తర్వాత అది తప్పనే కదా, అవి మానింది.

అశ్వాలంభం, గవాలంభం, సన్యాసం, పలపైతృకం

దేవరా చ్చసుతోత్పత్తి: కలౌ పంచ విసర్జయేత్ - అని శాస్త్రసిద్ధాంతం చేసారు.



అంటే, అశ్వంతో యాగం చేయకూడదు. గోవును చంపి యజ్ణం చేయకూడదు. సన్యాసం తీసుకోకూడదు. పెతృకర్మలో, శ్రాద్ధకర్మలో, ఆబ్దికంలో మాంసం పెట్ట కూడదు. మరిది ద్వారా సంతానం పనికిరాదు. ఈ ఐదూ కలియుగంలో నిషేధించబడినవి.



మరి ఈ విషయాన్ని వీళ్ళు ఎందుకు విస్మరిస్తారో! ఇక వీళ్ళకి 'థూ' కొట్టో, 'ఛీ' కొట్టో... అసలు విషయంలోకి ప్రవేశిద్దాం.

===

అసలు సిద్ధార్ధుడు, బుద్ధుడు ఎందుకు అయ్యాడు. హిందూ మతాన్ని పెకిలించివేయటానికా? హిందువులను మతమార్పిడి చేయటానికా? కాదు. నిరంతరం శోకమగ్నులై, దు:ఖితులైన మానవజాతిని ఉద్ధరించాలనే తపనతో రాజ్యాధికారాన్ని వదులుకున్నాడు. చివరికి కోరికలే దు:ఖానికి కారణమని తెలుసుకున్నాడు. తాను ఏ ధ్యానయోగంవల్ల బుద్ధత్వాన్ని పొందాడో, ఏ దివ్యజ్ణానాన్ని సంపాదించాడో, అది తోటిమానవులకు పంచాలనే ధ్యేయంతో బయలుదేరాడు.

బుద్ధై: ప్రత్యేక బుద్ధైశ్చ శ్రావకైశ్చ నిషేవితా

ఏ మార్గమైతే బుద్ధుల చేత, ప్రత్యేక బుద్ధుల చేత ఆరాధింపబడిందో ఆ ధ్యానయోగమార్గంలో పయనిస్తే, ఆ మార్గంలో సాధన చేస్తే మనం కూడా బుద్ధులం కావచ్చు అని అర్ధం. మానవునిలోని అరిషడ్వర్గాలను జయించటానికి తగినదిగా భావించే ఈ ధ్యానమార్గాన్ని ఎంతమంది బౌద్ధులు ఈనాడు ఆచరిస్తున్నారు?

ఆ రోజుల్లో యజ్ణయాగాది క్రతువుల్లో జరుగుతున్న జంతుహింసను నివారించిన బుద్ధుని వారసులు ఈనాడు బల్లులు, తొండలు కూడా వదలకుండా తింటున్నారే! వీటికి బుద్ధుడా కారణం?

బౌద్ధులకు బుద్ధుడు ఎలానో, హిందువులకు ఆదిశంకరులు కూడా అంతే. ఆదిశంకరులవారు వచ్చేటప్పటికి ఉన్న పరిస్థితులు వేరు. అప్పట్లో వ్యష్టి ధర్మానికి ప్రాధాన్యతనిచ్చి, సమిష్టి ధర్మాన్ని విస్మరించిన రాజుల వల్ల దేశం పతనావస్థకు చేరుకుంది. మరోపక్క, బౌద్ధులు శూన్యవాదం చేస్తున్నారు. ఈ ప్రపంచమంతా శూన్యం, దు:ఖం. ఇంతకు మించి మరోది లేదు అనే వాదనల మధ్య హిందూ అస్థిత్వమే ప్రమాదానికి చేరుకుంది. లక్షల, కోట్ల మందిని అనుశాసనం చేసి ఈ జాతి మొత్తం ఒకటి అనేటటువంటి మహనీయుడైన వ్యక్తి కావాలి। ఆ సమయంలో వచ్చారు శంకరులవారు.



శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రా:

మనమంతా అమృతపుత్రులం. అమృతపుత్రులమేమిటి? సాక్షాత్తు పరమేశ్వరులమే మనం అన్న ఆలోచనను జాతికి కలిగించారు. ఆయన మిధ్యావాదానికి, బౌద్ధుల శూన్యవాదానికి తేడాలేదని ఆనాడే విమర్శించారు అది వేరే విషయం.

చెప్పొచ్చే విషయమేమిటంటే, అటు బుద్ధుడైనా, ఇటు శంకరుడైనా, లేదా జీసస్ అయినా, ఆయా సమయాలలో వారివారి ధర్మాన్ని నిర్వర్తించి మానవజాతి ఉద్ధరణకు మహోన్నతమైన ఆలోచనలతో వచ్చారు. పథనిర్దేశకులైన ఆయా మహానుభావులను గౌరవించటం మన సాంప్రదాయం.

అంతేకానీ, ఈ మాయదారి సంత, ఆ మహానుభావుల పేరిట చేస్తున మాయాజాలాన్ని చూసి ఆవేశపడటం అనవసరం. అంతకన్నా, ఈ కుహానా మానవతావాదులని చూసి నవ్వుకోవటం మంచిది.

శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతి స్వామివారు వ్రాసిన వ్యాసాలలో కొన్నిభాగాలు ఉటంకించటం జరిగిందని గ్రహించగలరు.

19 కామెంట్‌లు:

  1. మన దెశంలొ ఎవడయితె హిందు మతాన్ని విమర్సిస్తాడొ వాడె మెదావి. చాలమంది మనసు లొ అమ్మనా బూతులు తిట్టుకున్నా ఎవరూ పైకె గట్టిగా చెప్పలెరు. అదే మన దౌర్బాగ్యం.

    రిప్లయితొలగించండి
  2. కత్తి గాడితో వాదిచటం waste అని చాల మంది lite తీసుకున్నారు.. మీరు టైం వేస్ట్ చేసుకోకండి.. ..

    రిప్లయితొలగించండి
  3. "ఒకానొకప్పుడైతే అటువంటివి చదివి ఆవేశం వచ్చేది. రానూరానూ, ఆ బ్లాగరి దయవల్ల, అదో అలవాటైంది."

    హహ్హా.. నాక్కూడా!!

    My friend - These retards suffer from a disease called attention deficiency syndrome. The only way one can cure it - deprive them of that attention. Ignore!! :)

    వీళ్ళ అసలు అజెండా, సగటుభారతీయుడు విలువనిచ్చే ప్రతి విషయాన్నీ ద్వేషించి, నాలుగు ముక్కలు రాసి - వితండంగా మాట్లాడి "కుతి" తీర్చుకోవడమ్! కానీ కుక్కల మొరుగుళ్ళు ఏం మారుస్తాయి? ఊరికే శబ్దకాలుష్యం తక్క?

    "మ్రుచ్చు గుడికిబోయి ముడివిప్పునే గాని..." అన్నాడు వేమన. అదీ సంగతి!

    రిప్లయితొలగించండి
  4. చరిత్రలో రాజుల కు ఈ శాంతి ని భోదించిన వాల్లు ఉపయోగ పడినట్లు ఇంకెవ్వరు ఉపయొగ పడలేదు. శత్రు రాజులకు కప్పాలు కట్టి యుద్దాలు చేయకుండా ఈ మహాత్ములను అడ్డం పేట్టుకొని శాంతి పేరు తో రాజులు బాగా సుఖించారు . పొయే వారిని పోని కుండా ఒక భారత జాతీయ నేత ఈ బుద్దుడిని పుస్తక బోధనలు చదివి దాని నుంచి ప్రేరణ పొంది మనకు చట్టాన్ని ఏర్పాటు చేశాడు. అది ఏలా ఉందో, ఏలా అమలు జరుగుతుందో అందరికి తెలిసిందే. పుస్తకాల లో ఎంత ప్రేమతత్వము గురించి రాస్తె అంత సమాజం అల్ల కల్లోలం గా ఉంది అని అర్థము. పాపం ఆయనకు అది సరిగ్గా అర్థంకాకనో లేక ఇంకొక కారణం వలననో ఒకటె బుద్దుడిని పొగిడి హిందువులకు ఆయననేదో శత్రువు లా చిత్రికరించారు. అంతే కాని మీరు చేప్పిన విధంగా బుద్దుడి బోధనలు అర్థమై కాదు. ఆ తరువాత ఆంధ్రా లో స్వాతంత్ర పోరాట సమయం లో కాంగ్రెస్ పార్టి లో బ్రహ్మణులు, రెడ్లు ఎక్కువగా ఉండె వారు ఒక అగ్రవర్గాము వారికి ఆ పార్టిలో డామినషన్ చేయదగ్గ స్తానం లభించక కమ్యునిస్ట్ పార్టి లో చేరారు. మత పరంగా బుద్దుడి కి వారు ప్రముఖ స్థానం ఇచ్చారు. కొంత మంది ఇప్పటికి ఒక బ్లొగ్ లో వివేకానందుడి లోపాలు ఎమిటి ఆయనను గోవుల గోపాలయ్య అమేరికా కి వెళ్ళినప్పుడు ఎవిధం గా విమర్శించాడు దానికి నెహ్రు గారే మన్నారు అని రాస్తారు. దానికి వారు పెట్టుకున్న పేరు మానవతా వాదము.

    కొంతకాలం క్రితం ఒక సినీ నటుడు పెట్టిన ప్రాంతీయ పార్టి లో అప్పుడు ఆవర్గానికి చెందిన కమ్యునిస్ట్ పార్టి వారంత మెల్లి మెల్లి గా జాయిన్ అయ్యారు.అదే వర్గానికి చెందిన ఒకరిద్దరు కమ్యునిస్ట్ పార్టి లొ మిగిలి ఎన్నికల ప్పుడు పొత్తు పేట్టుకుంటారు. బుద్దుడు అప్పుడె కాదు ఈ శతాబ్ధం లో కూడా రాజ్యాధికారం కావలను కునే వారికి చేతనైన విధం గా ఉపయొగ పడ్డాడు . రాజ్యాధికారం కొరకు వీరు చాల ఎక్కువగా హిందూ మతాన్ని విమర్శించారు. ఈ వర్గాల వారు అధికారం లో కి వచ్చిన తరువాత సిద్దంతాల తో పని లేకుండా అన్ని సిద్దంతాలకి డబ్బు తో వెలగట్టి పాలన సాగిస్తుంటే ఈ అభ్యుదయ వాదులు నోరు తెరుచుకొని చూస్తున్నారు. ప్రజల లో ఎలాగు ఈ అభ్యుదయ వాదులకు స్పందన లేదు కనుక బ్లాగులు పెట్టి 1900సం || కాలం నాటి కథలను ఇంకా ఇప్పుడె జరిగిన విధంగా రాస్తున్నారు.

    Thanks for publishing my views in your blog


    Thanks for publishing my views.

    రిప్లయితొలగించండి
  5. not onlu that this guy can write Masters thesis about a junk movie director who made money with three films (which are sequels he says) and stopped begging on roads. So the moral is that anyone can get his masters degree seeing movies alone. Great stuff.

    These guys believe movies are our culture. Not that they 'reflect' our culture. if you say anything else they say it was shown in such and such movie.

    And quote the movie dialog - light tIskO. what the hell. light tisko bulbu teeskso nI srAddham tIsuko? Why cant they say lightGA teesko? they cannot because it was told in such and such $#@% movie.

    రిప్లయితొలగించండి
  6. ఆ మహానుభావుడెంత గొప్పోడంటే నేను గొప్ప అని చెప్పడానికి రచ్చకెక్కుతాడు.
    And a group of "intelligent" yet foolish followers make him feel hero....
    He has good writing skills but always picks up issues that question the integrity of a whole nation...
    I wonder what happens if he enters politics......

    రిప్లయితొలగించండి
  7. హ హ్హ హ్హా భలే టైటిల్ పెట్టారు. నేను కూడా మొదట్లో ఆవేశపడిపొయేవాడిని. తర్వాత కాస్త ఆలోచించి చూస్తే అర్థమయింది, మత గజ్జి ఉంటే ఊరకనే ఉండడం చాలా కష్టం అని. ఎంత గోక్కుంటే అంత హాయిగా ఉంటుంది, ఇంకా గోక్కోవాలనిపిస్తుంది. ఇలాంటి మానసికులు వ్రాసేది చూసి నవ్వుకోవాలి కానీ కోప్పడకూడదు. "అహా సూపరు" "ఒహో సూపరు" "ఏమి లాజిక్కు ఏమి లాజిక్కు" అని పొగుడుతూ ఉండాలి, అప్పుడే మరిన్ని కామెడీ పోస్టులు రాస్తారు.
    అన్నట్టు రాబోయే పోస్టు - "శ్రీక్రిష్ణుడికి రుక్మిణి ఏమవుతుంది" అని ఉంటుందేమో!

    రిప్లయితొలగించండి
  8. అన్నా
    నీకు తెల్వదానే కొందరు కారణ జన్ములు. వారు సదువికోండిరా అని ప్రబుత్వాలు ఉచితంగా కాలేజీలకు పంపితే, వారు, లెక్చెరరు, సదువుకునే వోడు ఇంటాన్నాడా లేదా అని సూడాకుండా తన మానాన తను సెప్పుకెల్తే దాన్ని బేమ్మనికల్ యాటిట్యూడ్ అంటారు. ఇలా బేమ్మనికల్ యాటిట్యూడ్ అనే యాటిట్యూడ్ ని ఏమంటార్రా అని ఎవుడైనా అడిగితే నీకు నా భావం అర్ధంకాలా గెట్ ద హెక్ అవుట్ ఆఫ్ మై బ్లాగ్ అంటారు.
    మనది అసలే సెక్స్ స్టార్వ్డ్ దేశం అని కనిపెట్టారు మహాత్ములు, ఆ కారణజన్ములు.
    అట్టకాదు నాయనా అని ఎవుడో అనామకుడు ఇలా నిలదీస్తే
    >>ఇది జాతకకథ అని చెబుతుంటే మళ్ళీ రాముడ్ని చరిత్ర పురుషుడ్ని చేసే వాదన చేస్తున్నారే!
    అనగా?
    రాముడు చరిత్ర పురుషుడు కాదా? ఎలా కాదు? చరిత్ర పురుషుడు అంటే మీ నిర్వచనం ఏంటి? ఎవరి రాసిన చరిత్ర ప్రకారం రాముడు చరిత్ర పురుషుడు కాదూ?
    ఆ చరిత్ర పురుషులు ఇలా చెప్పి కళ్ళు తెరిపించారు -
    @అనామకుడు: ప్రస్తుతానికి రాముడు ఏ చరిత్రలోనూ లేడు.రామాయణం అనే పుస్తకంలో అతనొక పాత్ర.మహా అయితే పురాణపురుషుడవుతాడు. చరిత్ర పురుషుడు కాదు. కొత్తగా రాముడ్ని చరిత్రపురుషుడుగా నిరూపించే ఆధారాలు దొరికితే అంగీకరించడానికి నేను రెడీ.

    నేను కొత్తగా ప్రజల మనోభావాలు దెబ్బతియ్యఖ్ఖరలేదు. ఈ బౌద్ధరామాయణం గురించి అచ్చ తెలుగులో బొచ్చెడు సాహిత్యం ఇదివరకూ అరుద్ర, కొడవటిగంటి కుటుంబరావు వంటి మహానుభావులు రాసేసారు. కాబట్టి మీరు భావవైశాల్యం కొత్తగా తెచ్చుకోకపోయినా,కనీసం కాస్త తెలుగు సాహిత్యాన్ని చదువుకోండి


    కాబట్టి అయ్యా, మీరూ, దయచేసి భావ వైశాల్యాన్ని పెంచుకోండి...

    రిప్లయితొలగించండి
  9. ఆరోజులలో బ్రాహ్మణికల్ నాయకత్వం ( నెహ్రు )ఏ గొడవలు లేకుండా రిసర్వషన్స్ అమలుకు చట్టం చేశారు. ఎఫ్పుడు చూసినా పూనా పాక్ట్ గురించి మాట్లాడే వీరు ( గాంధి ఎదో వీల్ల కి అన్యాయం చేశాడని) మొన్న మంద కృష్ణ మాదిగ 40 సీట్లు కావలంటె అసలికి ఎమీ ఇవ్వ కుండా తే.దే.పా. బయటికి పొమ్మంది. దానిని గురించి ఎక్కడా మా కు అన్యాయం చేశారు అని రాయరు. వీల్లు ఇంకా ఆ రోజులలో (1940-60) బ్రహ్మణ రాజకీయ నాయకుల దగ్గర వేసిన వేషాలు ఇప్పటికి వేస్తున్నారు. కాని ఈ భుస్వామ్య వర్గలకు చేందిన రాజకీయ నాయకులు తోక కోసి సున్నం పెడుతున్నారు ఎమీ చెయలేక పుస్తకాలు రాసుకుంటూ ,ఒక నాయ కుడి విగ్రహానికి పాలభిషేకం చేసుకుంటూ అణగారిన వారిని అదే వర్గానికి చేందిన చదువుకున్న వారు బాగా యక్స్ ప్లాయిట్ చేసుకోంటూ అలా కాలం గడిపేస్తున్నారు. హిందువు లా ఆచారలను విమర్సిన్స్తూ ఏలాగు పూలమాలలు, పాలభిషేకం అన్ని మొదలు పెట్టారు ఇక అర్చన, సహస్త్రనామం ఒక్కటె మిగిలి పొయింది అది త్వరలో మొదలౌతుందేమో.

    రిప్లయితొలగించండి
  10. @అనానిమస్,
    Y.S. కూడా మారప్పను తగిన విధముగా సన్మానించాడు.

    రిప్లయితొలగించండి
  11. నిన్ననే అన్నాను, మతగజ్జి ఉంటే గోక్కోకుండా ఉండలేరు అని. ఇన్నాళ్ళుగా ఎవరికీ తట్టని 'మతం' రంగును 'భరత ఖండంబు" అంటూ మరో పద్యంలో ప్రస్తావించారు మహేష్ గారు. ఈయన మతగజ్జి రోజు రోజుకూ పెరిగిపోతున్నది!!

    రిప్లయితొలగించండి
  12. ఈ మతగజ్జి మారాజులకు కొందరు తమని తాము గొప్ప తెలవైనవారని భ్రమపడే మూర్ఖుల భజన బృందం ఉంది. ఆ బృందం సుత్తిగారు ఎంత చెలరేగి రాసినా ఏమీ పట్టించుకోరు గానీ, మీ లాంటి వాళ్ళు అసహనం చూపినప్పుడు వెనకేసుకుని రావడం మాత్రం తెలుసు.

    http://andam.blogspot.com/2009/05/blog-post.html

    రిప్లయితొలగించండి
  13. ఈ మతగజ్జి వున్నవాళ్ళు పక్కవాళ్ళకి కుడా అది అంటించడానికి చూస్తారు. ఒకతను వున్నాడు.. ప్రతి బ్లాగ్ ని కెలికి ఒక కామెంట్ పెడతాడు. పైన ఎవరొ అన్నట్టు అది సగటుభారతీయుడు విలువనిచ్చే ప్రతి విషయాన్నీ ద్వేషించి, వితండంగా వుండె కామెంట్. ఆ తరువాత అందరు అతన్ని కుక్కని విదిలించినట్టు " చీ , చీ ఇక్కడకి వచ్చవా పొ" అంటె వెరె బ్లాగ్ కి పొయి అక్కడ విషం కక్కడానికి ప్రయత్నిస్తాడు. ఎంత కంట్రావర్షల్ గా రాస్తె అంత బ్లాగ్ రెటింగ్ పెరుగుతుంది మరి.

    ఎంత కమెడి గా తీసుకుందామన్న ..రొజు ప్రొద్దున్నె లెచి మ్రొక్కె నా దైవాన్ని అలా కించపరుస్తుంటె రక్తం మరిగిపొతుంది.

    రిప్లయితొలగించండి
  14. veellaki kevalam himdu mataanni matrame vimrshimchatam chetavutumdi. migataavaari jolikelite maatalumdavu kevalam tannule vumtaayi kanuaka vaari chaayalakellaru. emi chestaam manchivaadi sahanam cheddavaaniki balamavutunnadi.

    రిప్లయితొలగించండి
  15. ఎప్పుడు దళిత, ముస్లిం మరియు మైనారీటి వర్గాలు కలసి ఓటు బాంక్ గా మారాలి అని రాస్తారే. దళిత సాహిత్యం, ఆ సాహిత్యం ఈ సాహిత్యం అని ఇప్పుడు చాలా రక రకాల సాహిత్యాలు వస్తున్నాయి కాదా ఒక రచయితైనా దళిత యువకుడు/యువతి మైనారితి యువకుడు/యువతిల మధ్య ప్రేమించి పెళ్లి చెసుకొంట్లు కథలు ఎవరైనా రాసారా, మీకె వరికైనా తెలిస్తె ఆపుస్తకం పేరు చెప్పెది.

    రిప్లయితొలగించండి
  16. http://parnashaala.blogspot.com/2008/11/blog-post_18.html
    http://parnashaala.blogspot.com/2008/07/blog-post.html
    http://parnashaala.blogspot.com/2008/08/blog-post_26.html
    http://parnashaala.blogspot.com/2008/08/blog-post_06.html

    రిప్లయితొలగించండి
  17. నీ చెంచాల జాబితా లో మరికొందరు తెలిసారు ఈ లంకెల వల్ల థాంక్యూ కత్తి.

    రిప్లయితొలగించండి
  18. నవ్వలేక ఛస్తున్నా

    http://murkhudu.blogspot.com/2009/05/blog-post.html

    రిప్లయితొలగించండి