18, మే 2009, సోమవారం

కుహానా లౌకికవాదులు - కామెడీ విశ్లేషణ

'హిందువులకు జయహో' అంటూ ఓ కామెడీ బ్లాగులో ఎన్నికల ఫలితాలను విశ్లేషించే ప్రయత్నం చేసారు. ఎప్పటిలాగే, హిందువులపై విషం కక్కుతూ, హిందువులను విభజించాలని చేసిన ప్రయత్నమే కానీ, దమ్మున్న విశ్లేషణ శూన్యం. ఆ రచయిత ఎలా ఏడ్చినా, ఒక్కటి మాత్రం సరిగ్గానే ఏడ్చాడు. ఈ దేశంలో ఏ పార్టీ అయినా మనుగడ సాగించాలంటే, హిందువులను గెల్చుకోవాలి. ప్రస్తుతం భా.జ.పా. ఓడిపోవటానికి కూడా హిందువులే కారణం. కానీ, ఇప్పటి భా.జ.పా. ఈ కుహానాలౌకికవాదుల ప్రకారమే మతతత్వ పార్టీ. నిజానికి, ఇప్పటి భా.జ.పా.లో అతివాద హిందుత్వం భూతద్దంతో వెతికినా కనిపించదు.

ఒకప్పటి జన్ సంఘ్ సిద్ధాంతాలతో రాజీపడటం, ఆపైన మూతి పగిలించుకోవటం కొత్తకాదు. జనతాపార్టీ ఆవిర్భవించిన సమయంలో కూడా మూల సిద్ధాంతాలను జన్ సంఘ్ మరవటం జరిగింది. ఆ తర్వాత భా.జ.పా. ఏర్పడటం, కొంతకాలం అతివాదధోరణితో నడిచి మళ్ళీ అధికారం కోసం మూల సిద్ధాంతాల నుంచి వెనక్కు తగ్గటం జరిగింది.

ప్రధానమంత్రి పదవి మోజుతో, అధికారంపై మోజుతో సిద్ధాంతాలకు నిరుటి సార్వత్రిక ఎన్నికల ముందే తిలోదకాలు ఇచ్చేసింది ఈ పార్టీ. ఎన్.డి.ఎ. కూటమి ఏర్పాటుకు ముందుగా జరిగిన ఎన్నికల్లో ఆర్టికిల్ 370, అయోధ్యలో రామ మందిరం, యూనిఫామ్ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరసత్వ చట్టం)ల ఏజెండాతో పోరాడిన భా.జ.పా. అధికారం కోసమే, వాటిని చంద్రబాబు నాయుడు, సమతా పార్టీ తదితరులకు తాకట్టు పెట్టి అధికారాన్ని చేజిక్కుంచుకుంది. పోనీ ఈ కొత్త వేషమైనా కొనసాగిందా అంటే అదీ లేదు. ఇప్పుడు మళ్ళీ రామ మంత్రాన్ని జపిస్తున్నది!


గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మోడీని మెచ్చుకున్న వాజ్ పేయి, గత సార్వత్రిక ఎన్నికల సమయానికి అదే మోడీని నిందిస్తూ చేసిన ప్రసంగాల సారాంశం 'అవకాశవాదమే'. అలానే, దేశం రెండుగా విడిపోటానికి కారణభూతుడుగా పేర్కొంటూ జిన్నాను ఆడిపోసుకున్న అద్వాని, అదే జిన్నాను పాకిస్తాన్ లో మెచ్చుకోవటం కూడా ఆ కోవలోనిదే.

మోడీని నిందించి, జిన్నాను పొగిడితే, ముస్లీములు ఒటు వేస్తారని, భా.జ.పా. ఒక లౌకిక పార్టీగా కొత్త జీవితాన్ని కొనసాగిస్తుందనే నమ్మకంతో ఈ నేతలు వేసిన వేషాలకు ప్రజలు బానే బుద్ధి చెప్పారు. ఉభయ భ్రష్టత్వానికి అద్భుతమైన ఉదాహరణ భా.జ.పా.

కుహానా లౌకిక సిద్ధాంతాలను తుంగలో తొక్కి, సహజసిద్ధమైన సిద్ధాంతాలతో ముందుకు వచ్చినరోజు, ఈ మధ్యతరగతి హిందువులే మళ్ళీ భా.జ.పా.కు పట్టం కడతారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి