4, మార్చి 2010, గురువారం

దొంగ సన్యాసులు - కామెడీ సన్నాసులు

గత రెండు మూడు రోజుల్లో, తమను తాము బాబాలుగాను, స్వాములుగాను ప్రకటించుకున్న, నిత్యానందలు, భీమానందలు, కల్కి భగవాన్ల భాగోతాలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నాయి. హైందవ జనోద్ధరణకు, ఈ దొంగ స్వాములకు ఏమాత్రమూ సంబంధం లేకపోయినా, హిందువులందరూ ఇదో కుట్రగా భావిస్తున్నారని భ్రమ పడుతూ కామెడీ కేతిగాళ్ళు యధావిధిగా పండుగ చేసుకొంటున్నారు. అందుకుగాను, వారికి నా ప్రగాఢ సానుభూతి. మేకలకు కావల్సిన మేత దొరికింది కాబట్టి, ఆ కామెడీని కూడా కొన్నాళ్ళు భరించక తప్పదు.

హిందు మతానికి అరిష్టమై దాపురించిన ఈ నకిలీ సన్యాస వ్యవస్థ పెంచి పోషింపబడింది ఇందిరా గాంధి హయాం నుండి. ఆ వారసత్వాన్నే కాంగ్రెసీయులు, భా.జ.పా.లు తమ తమ పాలనలో కొనసాగించారు. ధీరేంద్ర బ్రహ్మచారి నుండి చంద్ర స్వామి దాకా, ఎన్నెన్ని కేసుల్లో వీళ్ళు ఇరుక్కున్నది, చరిత్ర తెలిసిన ప్రతివారికీ గుర్తు ఉండే ఉంటుంది. అయిదారేళ్ళ క్రితం స్టార్ న్యూస్ రహస్య కెమేరాలకు దాదాపు ఓ పదిమంది మహామహులైన సన్యాసులు చిక్కారు.

టీవీ ప్రతినిధులు తమను ఓ బహుళజాతి సంస్థ ప్రతినిధులుగా పరిచయం చేసుకొని, నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చే అవకాశం కోసం ఈ దొంగ సన్యాసులని సంప్రదించటం, దాదాపు అందరూ యాభై నుంచి అరవై శాతం కమీషన్ ఇస్తే ఆ పని చేయటానికి తయారని సెలవివ్వడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. ఆ సన్యాసులు కొందరు ఇప్పటికీ టీవీలో భక్తులకు అనుగ్రహ భాషణం ఇస్తూనే ఉన్నారు! ప్రభుత్వాల ప్రమేయం లేకుండా ఆ దొంగ సన్యాసులు బయటపడగలగటం అనేది అసాధ్యం. అంత రచ్చ చేసిన స్టార్ న్యూస్ కూడా అ విషయాన్ని రెండు రోజుల్లోనే ముగించిన తీరు కూడా అనుమానాస్పదమే.

గుళ్ళు గోపురాల్లో అనైతిక శృంగారాలు, కేరళలో నర్సులపై ఫాదర్ ల అత్యాచారాలు, మక్కా యాత్రలకు ప్రభుత్వం ప్రకటించే రాయితీలను అమ్ముకునే ముస్లీం మత పెద్దలు (వీరి వ్యవహారం కూడా పై సంఘటన వెంటనే, స్టార్ న్యూస్ రహస్య కెమేరాలతో చూపించింది) - వీరిపై ఏ ప్రభుత్వమూ ఎందుకని చర్యలు తీసుకోవటంలేదో అర్ధం కాదు. మతాలకు అతీతంగా జరుగుతున్న ఈ అనైతిక సంఘటనలను ముక్త కంఠంతో ఖండించాలి.

అలానే, తాను నిరసించే మతంలోని కొందరు ఈ అనైతికతలో పాలు పంచుకున్నారని, అదే అలుసుగా ఆయా మతాలను చిన్నబుచ్చే అవకాశం దొరికిందని పైశాచిక ఆనందం కోసం ప్రయత్నించే కామెడీ సన్నాసులకు కూడా కొంత గడ్డి పెట్టి బుద్ధి చెప్పాలి.

9 కామెంట్‌లు:

  1. బాగా చెప్పారు. అసలు హిందూ మతమన్నది ఈ సన్నాసులు (సన్యాసులు కాదు) ఏర్పరిచింది కాదుగదండీ? అప్పుడెప్పుడో జయేంద్ర సరస్వతి మీద వచ్చిన ఆరోపణలను చూపించి, హిందూ మతం పరువు పోతుందని దాన్ని తొక్కిపెట్టాలని చూస్తున్నారని నా స్నేహితుడు ఒక సారన్నాడు. అతని నేనిచ్చిన సమాధానం ఒక్కటే, హిందూ మతం జయేంద్ర సరస్వతి ప్రతిపాదించింది కాదు, ఆయన భోధనలను ప్రామాణికంగా తీసుకుని ఏర్పడింది కాదు, కాబట్టి జయేంద్ర సరస్వతి ఏమిచేసినా హిందూ మతానికి వచ్చే నష్టమే లేదు. ఇది ఆయనే కాదు అందరికీ వర్తిస్తుంది. ఇక వీటిని చూసి చంకలు గుద్దుకునే వాల్లంటారా, పోనీలెద్దురూ వాల్ల అల్ప సంతోషాన్ని, తెలియని తనాన్ని చూసి మనం నవ్వుకుని ఊరుకుంటే సరి.

    రిప్లయితొలగించండి
  2. బాగా చెప్పారు.

    ఉత్తర కుమారులూ, శిఖండులూ లాగే సుత్తి మనీష్ కుమారుడు లాంటి వారు కూడా నవీన భారతంలో అవసరమేనేమో...
    వీరు రాసే రాతలకు కొంత మంది సంస్కారులకు ఒళ్ళు మండుతుందేమో గాని, హైందవ ధర్మానికి వచ్చే ప్రమాదమేదీ లేదు.

    వారి ఉద్దేశ్యం మసి పూయడమే అయినా, తమకూ మసి అంటుకుంటుందేమో నని భయంతో బూడిద ఉపయోగిస్తున్నారు.
    బూడిదతో ఎంత ఎక్కువగా రాస్తే అంత మేలు జరుగు తుందే గాని వారాశించినట్లు కీడేమీ జరగదు.

    రిప్లయితొలగించండి
  3. నిన్నొకడు శునకాన౦ద౦తో స్వర్గపు అ౦చులదాకా వెళ్ళొచ్హాడుగా....! ఇలా౦టి బురద ప౦దులతో వచ్చే నష్టమే౦ లేదు. హి౦దూ మత౦ ఇటువ౦టి నిప్పులలో కాలాకే మరి౦త ప్రకాశిస్తు౦ది.

    రిప్లయితొలగించండి
  4. హ హ హ. ఓ దొంగడాక్టరూ నర్సూ కలిసి రొమాన్స్ చేస్తే, వైద్యం పేరుతో ప్రజలను మోసం చేస్తే. సైన్సు ని మొత్తం వైద్యవిధానాన్నే తప్పు పడుతున్నట్టుంది.

    రిప్లయితొలగించండి
  5. సామాన్యజనం ఈ స్వాముల దగ్గఱికి వెళ్ళనూ లేరు, వీళ్ళని ఇంత కోటీశ్వరులుగా మార్చే స్థాయిలో కానుకలు సమర్పించుకోనూ లేరు. కనుక ఏం తేలుతున్నదంటే, ఈ స్వాముల వెంట ఉన్నదల్లా చాలా చాలా డబ్బున్న కుబేరవర్గాలు మాత్రమేనని. నా మట్టుకు నేను నిత్యానందస్వామి గుఱించి ఇప్పుడే కొత్తగా వింటున్నాను. Because this fellow is freshly in news now for a very wrong reason. Suppose, it did never happen, then ? Then I would be left in permanent ignorance about this imposter. కాబట్టి ఇలాంటివాళ్ళు పట్టుబడితే హిందూమతం ప్రక్షాళన అయినట్లే తప్ప కళంకితం అయినట్లు కాదు. కామెడీ సుత్తి మనుషులు అంతగా ఆనమ్దించాల్సిందేమీ లేదిందులో ! మొన్నామధ్య తేలిందేమిటంటే హైదరాబాదులో ఒక సంవత్సరం పాటు అమ్ముడుపోయినవన్నీ నకిలీ జండూబాములేనని ! అంతమాత్రాన అసలు జండూబామ్ యొక్క చికిత్సక లక్షణం (curative property) అబద్ధమైపోదు గదా ? ఒక ఒరిజినల్ కి వెయ్యి డూప్లికేట్లు ఎప్పుడూ ఉంటాయి. అసలు డూప్లికేట్లు ఉన్నాయంటేనే దానర్థం, వాటికి ఆదర్శభూతమైన, అనుకరణీయమైన ఒరిజినల్ ఒకటి తప్పకుండా ఉందని !

    రిప్లయితొలగించండి
  6. నేను ఇతరుల బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాసే వ్యాసంగానికి శాశ్వతంగా స్వస్తి పలుకుతున్నాను. ఏదైనా రాస్తే నా బ్లాగులోనే రాసుకుంటాను. లేకపోతే అదీ లేదు. ఇక్కడ మీ బ్లాగులో రాసినదే బ్లాగ్‌లోకంలో నా చిట్టచివఱి వ్యాఖ్య.

    రిప్లయితొలగించండి