22, మార్చి 2010, సోమవారం

నియో దళితిస్టు భావజాలం - ఓ ట్రాజెడీ

ఒకానొకప్పుడు, సామాజికంగా అణగదొక్కబడ్డ బలహీన, బడుగువర్గాల ప్రజల కోసం ఎందరో పోరాటం చేసారు. ఆ పోరాటాల్లో భాగంగానే, గుళ్ళల్లో, ఊళ్ళల్లో, చివరికి అందరి ఇళ్ళల్లోనూ వారి ప్రవేశానికి అడ్డంకులు లేకుండా, అంటరానితనాన్ని రూపుమాపే విధంగా చట్టం కూడా చేసారు. ఈ కృషిలో, సోకాల్డ్ దళిత నాయకుల కన్నా కూడా, అగ్రవర్ణాల హిందు నాయకుల శ్రమ ఎంతో ఉంది.

ఆయా నాయకుల కృషి ఫలితంగా, ఆయా సామాజికవర్గాల మధ్య అంతరం క్రమేపీ తగ్గుతూ వస్తున్నది. చెప్పుకోదగ్గ వేగం లేకపోయినా, మార్పు దిశగా మొదలైన ఈ చర్యలు సత్ఫలితాలు చూపగలవన్న భరోసాను దళితులకు ఇవ్వటమే కాకుండా, వారికి చేయూత నివ్వటంలోని అగ్రవర్ణాల సంకోచాన్ని కూడా చాలా వరకు దూరం చేసాయనే చెప్పుకోవచ్చు.

ఈ నేపథ్యంలో మొదలైనదే "నియో దళితిస్టు" భావజాల పరంపర. కాన్షీరాం పుణ్యమా అని, రాజకీయాల్లో వేగంగా మొదలైన ఈ దళిత పర్వం మొదట్లో కొత్త పుంతలు తొక్కినా, ఇప్పుడు మాయావతి లాంటి నేతల కారణంగా వెర్రి తలలు వేసి, అపహాస్యం పాలౌతున్నది.

అసలు ఏమిటి ఈ "నియో దళితిస్టు భావజాలం"? "హస్తినలో అధికారం కోసం ఏమైనా చేస్తాం, ఎవరికైనా మద్దతు ఇస్తాం", "అధికారం ద్వారానే, దళితుల సంక్షేమం" అనే సిద్ధాంతాలతో ఈ "నియో దళితిస్టు భావజాలానికి" ఓ రూపాన్ని కల్పించాడు కాన్షీరాం. ఆ సిద్ధాంతంలో భాగంగానే, దాదాపు రెండు దశాబ్దాలుగా, దాదాపు అన్ని పార్టీలకు ఆయా సమయాల్లో మద్దతు నివ్వటం, సొంత బొక్కసం నింపుకొని ఆనక మద్దతు ఉపసంహరించటం కూడా జరిగిపోతున్నది. ఆయన వారసురాలిగా చరిత్రకెక్కిన మాయావతి, ఆ సిద్ధాంతాన్ని మరింత స్ఫూర్తివంతంగా మార్చుకొని, "తనకు అధికారం ఇవ్వటం ద్వారానే, దళితుల సంక్షేమం" జరుగుతుందని ప్రజలను మభ్య పెడుతున్నది.

ఆ సిద్ధాంతంలో భాగంగానే, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే తీరులో కొందరు కుహానా దళిత నాయకులు కూడా అవతరించారు. ఒక్క రాజకీయ రంగమే కాకుండా, విద్యా రంగం నుంచి, సినిమా రంగం వరకు దళిత ప్రజలను "నియో దళితిస్టు భావజాలంతో" మభ్య పెట్టే దిశగా ఈ కుహానా నాయకులు విశృంఖల ప్రచారం గావిస్తున్నారు.

చివరికి ఈ పరిస్థితులు ఎలా పరిణమించాయంటే, దళితులుగా వారు సాధించిన విజయాలపై వారికే అపనమ్మకం కలిగేంతగా అంటే, బహుశా మనకు నమ్మశక్యం కాదు. దానికి ప్రధాన కారణం, అంతరాంతరాళాల్లో వీరికి ఉన్న ఆత్మన్యూనతా భావం. అది ఒప్పుకోటానికి అడ్డుగా భేషజం. ఆ భేషజాన్ని అధిగమించటానికి, అగ్రవర్ణాలపై అవసరం లేకున్నా నిప్పులు చెరగటం. పిల్లి పిత్తినా, అది అగ్రవర్ణాల దురహంకారానికి చిహ్నం అని ఆడిపోసుకోవటం.

దీని పర్యవసానం ఏమిటంటే :

వ్యక్తిగతంగా తమను తామే ముఖ్యులుగా పరిగణించుకుంటారు. అందులో భాగమే, యు.పి. మొత్తం తన విగ్రహాలతో మాయావతి నింపేయటం, డబ్బు దండలతో తనను తాను సత్కరింపచేసుకోవటం.

ఈ పనులు చేయగలిగే స్థాయిలేని తదితరులు చేసేవేమిటంటే :

1. అడ్డమైన ప్రతి చోటా కాలెత్తే కుక్కలా, హిందు సమాజంలోని అణువణువు వీరికి ఓ మరుగుదొడ్డిలా కనబడుతుంది. హిందు సమాజంపై, అక్కరకు రాని కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు. అలా ప్రఖ్యాతి పొందాలని ప్రయత్నిస్తారు.

2. కాదంటే, కేసు వేస్తామనే కేకలతో ఒకానొక అసహనాన్ని ప్రదర్శిస్తుంటారు.

3. ఆ అసహనంలో భాగంగా హిందువులు ఆరాధ్య దైవాలుగా భావించేవారిని ఛీత్కరిస్తారు. పురాణేతిహాసాలని అగౌరవ పరుస్తారు.

4. గొడ్డు మాంసం మీద ఉన్న ఆసక్తి, గొడ్డు చాకిరీ చేస్తూ ఓ పూట కూడా గడవని తోటి మనిషిపై వీరికి ఉండదు.

5. గూడు, గుడ్డలేని తోటి మనుషులపై కన్నా, దేవాలయాలలోని బూతు బొమ్మలపై వీరికి ఆసక్తి ఎక్కువ.

6. ఒకప్పుడు అంటరానివారుగా ఉన్న వీరిని, జనజీవనస్రవంతిలోకి తీసుకువద్దామని ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలించి, సంఘంలో సముచిత స్థానం దక్కించుకున్నా, అగ్రవర్ణాల మీది దౌష్ట్యంతో, తమను తాము ఓ చట్రంలో బిగించుకొని ఎదుటివారికి భావ వైశాల్యం లేదని తీర్మానించటం ఈ "నియో దళితిస్టు భావజాల" పరంపరలో భాగమే!

7. భావ వైశాల్యాన్ని ప్రదర్శించటానికి, కాశ్మీరుని పాకిస్తాన్ కు, అరుణాచల్ ప్రదేశ్ ను చైనాకు ఇవ్వమని చెప్పటం కూడా వీరికే పరిమితమైన "మేధావి తెంపరితనం". హిందువుల మీద, హిందు మతం మీద వీరికి ఉన్న అక్కసు తీర్చుకునే క్రమంలో, దేశద్రోహానికి కూడా పాల్పడుతున్నారని వీరు గ్రహించకపోవటం ఓ విషాదం.

వారి ఏ మనోభావాలను గతంలో అగ్రవర్ణాల వారు గాయపరిచారని చెబుతారో, ఖచ్చితంగా అదే రకంగా హిందువుల, అగ్రవర్ణాల మనోభావాలను గాయపరుస్తారు. ఇది పైశాచికానందమని తెలియదు. ఇదే, "నియో దళితిస్టు భావజాలం".

దేశానికి ప్రమాదకరంగా తయారౌతున్న ఈ పెడధోరణులని నివారించే దిశగా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి. లేదంటే, మేధావులుగా మనగల మన సోదరులు, కామెడీ గాళ్ళుగానే చరిత్రలో నిలచిపోయే ట్రాజెడీ ఎంతో దూరంలో లేదు.

8 కామెంట్‌లు:

  1. @ వారి ఏ మనోభావాలను గతంలో అగ్రవర్ణాల వారు గాయపరిచారని చెబుతారో, ఖచ్చితంగా అదే రకంగా హిందువుల, అగ్రవర్ణాల మనోభావాలను గాయపరుస్తారు. ఇది పైశాచికానందమని తెలియదు. ఇదే, "నియో దళితిస్టు భావజాలం".

    >>తనదాకా వస్తేనే గానీ తెలీదంటారు ...అప్పుడు దళితులను అవమానిచి ఊరి చివరకి తరిమేసి మీరు ఆనందించారు .దానిని పైశాచికత్వం అనరేమో ఇప్పుడు వాళ్ళ వంతు ... అనుభవించండి ... చేసుకున్నోడికి చేసుకున్నంత . ఆనాడు మాకు కూడా దేవుడు కావాలి మొర్రో అని కాళ్ళా వేళ్ళా పడ్డా కనీసం దూరం నుండి అయినా చూసి తరిస్తామని అరిచి గీపెట్టినా మీరు కనికరించలేదు. చీ అవతలకి పొండి మీకు దేవుడెందుకు అని హేళన చేసారు , అవమానించారు , తన్ని తగలేసారు . ఇంక వాళ్ళకెందుకు మీ దేవుడు. చివరికి వాళ్ళు పరాయి దేవుడ్ని నెత్తినెట్టుకున్నారు . ఆ సంధర్భాన్ని మీరే కల్పించారు. ఇప్పుడు తీరిగ్గా విచారిస్తే ఏం లాభం . ఇప్పటికైనా వాళ్ళను హిందూ సమాజం వైపుకు తీసుకురండి లెక పోతే వాళ్ళు మీకు మనశ్శాంతి ఉండనీయరు

    రిప్లయితొలగించండి
  2. "...అప్పుడు దళితులను అవమానిచి ఊరి చివరకి తరిమేసి మీరు ఆనందించారు" అన్నారు, ఎవరు ఎవరిని ఎందుకు తరిమేసారో చెపుతారా? దళితులు (అయిదవ వర్ణం) అనేవాళ్లు అన్ని కులాలలోనుండి వచ్చారన్న సంగతి మీకు తెలియదా?

    "అవమానించారు , తన్ని తగలేసారు" అన్నారు, నిజమే తప్పులు జరిగినాయి చరిత్రలో, కాని వాటిని సర్ధుకోవటానికి నవీన భారతావనిలో వాళ్లకు కల్పించిన వసతులు ఏ దేశంలో నయినా అలా పీడించబడిన వాళ్లకు కల్పించారేమో చెబ్తారా? మాటి మాటికి మమ్ములను అవమానించారు ఒకప్పుడు కొందరు అన్నమాటే గుర్తుకువస్తుంది కాని, కొంతమంది మీ వెనకే నిలబడ్డారు ఆ రోజులలో కూడా అన్న చరిత్ర ఎందుకు గుర్తుకు రాదు?
    " మీ దేవుడు" అంటున్నారు, ఏ దేముడు గురించి మాట్లాడుతున్నారు మీరు? హిందూ దేముడు ఎక్కడయినా అగ్రవర్ణాలకే దేముడు అని ఎక్కడయినా చెప్పాడా? మనువు గురించి మాత్రం గుర్తుకువస్తుంది కాని, క్రిష్ణుడు ఓ యాదవుడనో, వాల్మీకి ఓ బోయవాడనో, సత్యవతి మత్స జాతి అనో లాంటివి ఎందుకు కన్వీనియెంట్ గా మర్చిపోతారు?

    "వాళ్ళను హిందూ సమాజం వైపుకు తీసుకురండి " అన్నారు, ఎలానో చెబ్తారా?
    ప్రతి గుళ్ళొ ప్రతిరోజు గొడ్డుమాంసంతో ఫలహారం పెట్టి అని మాత్రం చెప్పకండి :) అయినా మనం అందరం కలసి భారత సమాజం అన్న నిజం ఎందుకు మర్చిపోతారు?


    "వాళ్ళు మీకు మనశ్శాంతి ఉండనీయరు" అన్నారు, మీరు మేము అనే భేదము ఎందుకు? అందరం భారతీయులము కాదా? అందరం ముందు ముస్లిం పాలకుల చేతిలో, తర్వాత ఆంగ్లేయుల చేతిలో బానిస బతుకులు బతికిన వాళ్లము కాదా? ఎవరికి వారు మనశాంతిగా ఉంటే చాలు, పక్కన వాళ్లకు లేకుండా చేయ్యాలన్న కుత్సిత భావం లేకుండా ఉంటే చాలు అనేదే ఈ టపా భావమని మీకు అనిపించటం లెదా?

    చివరగా టపాలో "అంతరాంతరాళాల్లో వీరికి ఉన్న ఆత్మన్యూనతా భావం." అన్న ముక్క మాత్రం నూటికి నూరుశాతం నిజం, అది ఒకడు పోగొట్టేది మాత్రం కాదు, ఎవరికి వారు పోగొట్టుకోవాల్సిందే!! అది పోనంత కాలం "లేదంటే, మేధావులుగా మనగల మన సోదరులు, కామెడీ గాళ్ళుగానే చరిత్రలో నిలచిపోయే ట్రాజెడీ ఎంతో దూరంలో లేదు." అన్న మాట మాత్రం నిజం!!

    రిప్లయితొలగించండి
  3. ఇంగితజ్ఞానము మీకు అందిచే ఏకైక ఆథరైజ్డ్ బ్లాగ్ పర్ణశాల. ఇంగితజ్ఞానంలో చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాము , ఇస్తున్నాము. మా స్కూల్ ఆఫ్ థాట్ లో స్త్రీలకు 99శాతం రిజర్వేషన్ వుంటుంది.

    మా ఇంగితజ్ఞాన రహస్యం పంది డెలికసీలు. పంది, శతాబ్దాలుగా పర్యావరణహిత అని మీకందరికీ తెలిసిందే. కమ్మని పందివంటకాలు మా హాస్టల్ ప్రత్యేకం అని ఇంగితజ్ఞానం లేని మీకు ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.
    రండి, నేడే విచ్చేసి మీ ఇంగితజ్ఞానం పెంపొందించుకోండి.

    రిప్లయితొలగించండి
  4. Kiran,
    Don't you think you are giving undue importance to such insignificant fellows by mentioning their barkings in their blogs?
    Pig is a pig whether you mention the same or not and let the pig live its piggy life.

    I heard Maoists too have caste divisions. I would like to know your views in that angle. :P

    How about fusion of Hindutva/BJP and Maoism? ;)

    Sankar

    రిప్లయితొలగించండి
  5. నిజమే, అగ్రవర్ణాలు దళితులకు నాయకత్వ౦ వహి౦చిన౦తకాల౦ సమాజ౦ పూర్తిగా కాకపోయినా కొ౦తయినా బాగు౦డేది. ఈ దళిత నాయకులు సమాజాన్ని మొత్త౦గా బ్రష్టు పట్టిస్తున్నారు.

    అగ్రవర్ణాల తోడ్పాటు లేనిదే, అట్రాసిటీ చట్టాలు వచ్చేవా? ఇప్పుడు అవే అట్రాసిటీ కేసులనే అగ్రవర్ణాలపై తమ పగ, ప్రతీకారాల కోస౦ వాడుతున్నారు.

    వాళ్ళప్పుడు చేసారు కాబట్టి మేమిప్పుడు చేస్తే తప్పే౦టటున్నారు. మేము అమాయకుల౦ అనిచెప్పుకునే దళితులు అవకాశ౦ వస్తే ఎదవలే, కాకపోతే కాస్త ఎక్కువ ఎదవతన౦.

    రిప్లయితొలగించండి
  6. దళితులని ఇప్పుడు అణగదొక్కేది వాళ్ళ నాయకులే. ఈ మూర్ఖులకి ఆ విషయం తెలీడం లేదు.

    రిప్లయితొలగించండి