అది ఓ పోలీస్ స్టేషన్.
ఇన్ స్పెక్టర్ : ఏంటి సంగతి? ఎందుకొచ్చారు?
ఒకటో వ్యక్తి : సార్ వీడు ముసుగేసుకొని నా పీక పిసుకుతానని బెదిరించాడండి. అందుకే ముసుగు తీసి తెచ్చా.
ఇన్ స్పెక్టర్ : ఏరా నిజమేనా?
రెండో వ్యక్తి : అవునండి. కానీ, వీడే ముందు నా పిర్ర గిల్లాడు. కోపం వచ్చి.....
ఇన్ స్పెక్టర్ : ఏరా, కోపం వస్తే మాత్రం... పీక పిసుకుతానంటావా? బొక్కలో తోయండిరా వీడ్ని.
***
అలా, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి జరిగింతర్వాత, మరో సన్నివేశం, అదే పోలీస్ స్టేషన్ లో ...
ఇన్ స్పెక్టర్ : ఏంట్రా మళ్ళీ వచ్చావ్?
ఒకటో వ్యక్తి : సార్ వీడు కూడా ముసుగేసుకొని పీక పిసుకుతానని బెదిరిస్తే, ముసుగు తీసి తెచ్చా సార్.
ఇన్ స్పెక్టర్ : ఏరా నిజమేనా?
ఆరో వ్యక్తి : సార్... వీడే ముందు నా పిర్ర గిల్లాడండి. అందుకే కోపం వచ్చి....
ఇన్ స్పెక్టర్ : వారానికో లంపటం ఇలాంటిది ఎందుగ్గానీ, పిర్ర గిల్లినోడిని బొక్కలో తోయండిరా, వీడి పీక ఇంకెవరూ పిసకరు. వీడెవడి పిర్ర గిల్లడు. వారానికోసారి ఎఫ్ఫైఆర్ లంటూ, సైబర్ క్రైంలంటూ విసిగిస్తున్నాడు.
***
అయ్యా ఇదీ భోగట్టా. మనం అనాల్సింది అంటూనే ఉన్నాం. మనం చేయాల్సింది చేస్తూనే ఉన్నాం. మరి, ప్రతిక్రియలు, ప్రతిచర్యలు వస్తున్నప్పుడు గగ్గోలు పెట్టటం దేనికి?
తను కుల విమర్శ చేయలేదు, మత విమర్శ చేయలేదు అంటున్న పెద్దమనిషి 'బ్రాహ్మణికల్ ఆటిట్యూడ్' అన్న విషయంపై జరిగిన ఒకానొక చర్చలో వ్రాసిందేమిటి?
అసలు 'బ్రాహ్మణికల్ ఆటిట్యూడ్' అన్న పదం ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా మొట్టమొదట, ఏ సందర్భంలో వాడారో పక్కన పెడదాం. ఈ పెద్దమనిషి తానే ఒప్పుకున్నట్లుగా వ్రాసిన కామెంటులో ఓ సారి చూడంది, ఆ పదాన్ని ఏ సందర్భంలో వాడారో...
"పనిలోపని ఇంకోమాట. మా యూనివర్సిటీలో (HCU) లైబ్రరీలోని ఆ సెమిస్టర్ కోర్సుకి సంబంధించిన ముఖ్యమైన పుస్తకాల్ని రూముకి తెచ్చుకుని మరెవరికీ అందకుండా రహస్యంగా చదివే వాళ్ళనికూడా బ్రాహ్మనికల్ అనేవాళ్ళం.
విద్యార్థుల రెస్పాన్స్ తో సంబంధం లేకుండా, వారి ఇంట్రెస్ట్ తో సంబంధం లేకుండా కేవలం సమయానికొచ్చి పాఠం వల్లెవేసే లెక్చరర్ ఆటిట్యూడ్ ని బ్రాహ్మనికల్ అనేవాళ్ళం.
సోషియల్ సైన్స్ లో రిసెర్చ్ అంటే రెఫరెసులతోనో మొదలవ్వాలి అనినమ్మే ప్రొఫెసర్ ఆటిట్యూడ్ ని బ్రాహ్మనికల్ అనేవాళ్ళం.
విద్యార్థుల కష్టనష్టాలతో సంబంధం లేకుండా “రూల్స్” మాత్రమే ఫాలో అవుతాననే డీన్ ఆటిట్యూడ్ ని బ్రాహ్మనికల్ అనేవాళ్ళం.
ఇప్పటికీ ఆ పదంలోగానీ దాన్ని వాడే విధానంలోగానీ పెద్ద తేడా లేదు."
అయ్యా ఇదీ సంగతి. పైన ఆయనే పేర్కొన్న సందర్భాల్లో కనీసం ఒక్క సందర్భంలోనైనా, బ్రాహ్మణ కులాన్ని పేర్కొనకుండా విమర్శించటం సాధ్యపడదా! ఒక స్వార్ధపర వ్యక్తిని తిట్టడానికో, మరొకరిని గేలిచేసి వేళాకోళం చేయటానికో మాత్రమే ఈయన ఆ పదాన్ని వాడుతారని ఇంత నిర్భయంగా, నిస్సిగ్గుగా చెబుతున్నా, ఆయన చేసిన కుల దూషణ కనిపించకపోతే మీరు ధృతరాష్ట్రులే.
కొన్నాళ్ళక్రితం వరకూ అగ్రవర్ణాల వారు నిమ్నజాతులవారిని పిలవటానికో మరొకరిని తిట్టడానికో ఓ రెండు పదాలు ఉపయోగించేవారు. అటువంటి పిలుపులను అభ్యంతరకరమని, సంస్కారహీనమని భావించి మరచిపోతున్న రోజుల్లో, గతాన్ని గుర్తుచేసే విధంగా, వైషమ్యాలకు ఆజ్యం పోయాలనే సంకల్పంతో చేసే ఈ ప్రయత్నాలు ఎంతవరకూ సహేతుకం?
ప్రభుత్వము, సమాజము అందించిన సహకారంతో ప్రస్తుతం మంచిస్థాయిలో ఉన్న ఈ పెద్దమనిషికి తాను చేసే యాగీ వల్ల కలిగే నష్టమేమీ లేదు. ఉన్న లాభమల్లా, గతంలో దాష్టీకం చేసిన అగ్రవర్ణాన్ని అవమానించగలిగాననే తృప్తి. కానీ ఈయన చేస్తున్న ఈ దాష్టీకం వల్ల ఎవరికి నష్టం కలుగుతుందో ఓసారి ఆలోచించాలని మనవి.
అగ్రవర్ణాల నుండి ఈయన తరహాలోనే సంస్కారహీనుడైన ఓ నత్తి నరేష్ 'శూ*** ఆటిట్యూడ్' అని మొదలేసి సమాజంలో వైషమ్యాలు సృష్టిస్తాడు. వీడు సృష్టించే వైషమ్యాలవల్ల సమాజంలో మంచి స్థానంలో ఉండి, కేసుల మీద కేసులు వేసి పబ్బం గడుపుకోగలననే వ్యక్తులకు వచ్చే నష్టంలేదు. కానీ, ఇప్పటికీ నిమ్నజాతులుగానే మిగిలిపోయి సమాజంలో భాగం కావాలని తపనపడే మరికొందరు వారి ప్రమేయం లేకుండానే వెలివేయబడి, వారి తప్పు లేకుండానే వైషమ్యాలు ఎదుర్కోవాల్సివస్తుంది. దీనికి బాధ్యత ఈ సంస్కారహీనులదే.
ఈ విషయాన్ని సైబర్ పోలీసులు గమనిస్తారనే ఆశిస్తాను.
***
పై వ్యాసం పోస్టు చేసే లోపే, అయ్యవారి బెకబెక మరోసారి వినిపిస్తే, వెళ్ళి చూసా వేరే బ్లాగులో. మీరూ చూడండి.
"మనుస్మృతి ఆధారంగా కులాల్ని ప్రతిపాదించించి ఎవరు? పంచమకులంగా అంటరాని కులాల్ని సృష్టించిందీ, ఆ ఆభిజాత్యాన్ని వర్ణాశ్రమంలో కుదించింది ఎవరు? దాన్ని perpetuate చెయ్యడంలో అన్ని కులాల పాత్ర ఉన్నా, basis ఇదే అనేది మీరొప్పుకోకపోయినా చరిత్ర అదే చెబుతోంది.
సంస్కృతంలో మాత్రమే ఉన్న ఈ doctrines బ్రాహ్మణులు కాక మరెవరైనా రాసారని చరిత్ర నాకు చెప్పలేదు. మీకు కావలసిన scientific proof నాకు తెలీదు. కానీ నేను ప్రతిపాదించిన సిద్ధాంతం చారిత్రకు సంబంధించినది.ఇందులో నేను కొత్తగా ఆపాదించందీ, నిందించిందీ ఏమీ లేదు. I was only stating a social and historical FACT."
అయ్యవారి రెండు నాల్కల ధోరణికి ఇదో పెద్ద ఉదాహరణ. వేదాలు, పురాణాలు లేవు. అవి కేవలమూ కల్పిత గాధలు అనే పెద్దమనిషి 'మనుస్మృతి' మాత్రం ఉన్నదని నమ్ముతారు. దాని ఆధారంగా కులవిభజన చేసింది కూడా బ్రాహ్మణులే అని (ప్రత్యేకించి చెప్పకపోయినా) నమ్ముతారు. ఇకపైగా, అది సామాజిక, చారిత్రక సత్యం అని కూడా నొక్కి వక్కాణిస్తారు.
మనుస్మృతి ఉన్నదని నమ్మేట్లయితే, వేద పురాణాలని కూడా ఉన్నాయని విశ్వసించండి. లేదంటే, మనుస్మృతి ఉన్నదనే వాదన కూడా కట్టిపెట్టాలి. కేవలమూ, అవకాశవాదంగా వీటిని వాడుకుంటామనటం అసమంజసం.
ఒక్క ఈయన అనే కాదు, మేధావులుగా భావింపబడుతున్న చాలామంది చరిత్రకారులు చేసే వితండవాదనే ఇది. కేవలమూ కొన్ని అగ్రవర్ణాలను విమర్శించటమే ధ్యేయంగా వీరు అవకాశవాదాన్ని ప్రదర్శిస్తారు. అంతేకానీ, నిజమైన చారిత్రక ఆధారాలు ఉండి కాదు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి